Saturday, 11 March 2017

Salt

మనము ఆరోగ్యంగా జీవించడానికి, ఈ శరీరానికి ఉప్పు అనేది తప్పనిసరిగా కావాలి. ఆ ఉప్పు మనకు సహజంగా ఆహారం ద్వారా అందాలే తప్ప బయటినుండి వేసుకునే ఉప్పు కాకూడదు. మనం తినే ప్రతి ఆహారంలో, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజలు, దుంపలు మొదలగు వాటిలో సహజంగా చాలా ఉప్పు ఉంటుంది. ఈ ప్రకృతిలో ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా అందులో ఉప్పు ఉంటుంది. ఉప్పులేని ఆహార పదార్థమంటూ ఉండదు, ఏ జీవి ఏ ఆహారం తిన్నప్పటికీ ఆ జీవి శరీరానికి కావాలసిన ఉప్పు ఆహారం ద్వారానే అందుతూ ఉన్నది. అందుకే, ఏ జీవి కూడా బయటి నుండి ఉప్పును గ్రహించదు. సహజమైన ఆహారం ద్వారా వచ్చే ఉప్పే వాటి సహజ జీవనానికి సరిపోతుంది. మనకు కూడా అలానే సరిపోతుంది. నాగరికత పెరిగినప్పట్నుండీ ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, పదార్థాన్ని రుచిగా చేసుకోవడానికి ప్రతి దాంట్లో ఉప్పు వేసుకోవడం మనిషికి అలవాటు అయ్యింది. అలా అలవాటుగా రోజుకి 10 నుండి 20 గ్రాముల ఉప్పును మనం తింటూ ఉన్నాము. మన శరీరానికి ప్రతి రోజూ లోపల ఖర్చు అయ్యే సహజమైన ఉప్పు 280 మి.గ్రా. అని శాస్త్రవేత్తలు తేల్చారు. అంటే ఒక గ్రాములో పావు వంతు మాత్రమే. మనం తినే ఏ ఆహారంలోనైనా ఇది మనకు అందుతుంది. ఆ ఆహారాన్ని మనం వండితిన్నా , లేదా అలాగే పాడుచేయకుండా తిన్నా ఉప్పు మాత్రం నశించకుండా మనకు అందుతుంది.
 
ఆకు కూరలను వండినప్పుడు రకొ కొరకు కొద్ది ఉప్పు వేస్తే సరిపోయి, కందిపప్పు వండినప్పుడు ఎక్కువ ఉప్పు పడుతుంది. ఆకుకూరలలో ఎక్కువ ఉప్పు ఉంది కాబట్టే బయటనుండి కొంచెం పడింది. కందిపప్పులో ఉంది కాని ఆకుకూరల్లో ఉన్నంత లేదు. పుట్టిన దగ్గర్నుండీ ప్రతిరోజు తిన్న ఎక్కువ ఉప్పంతా శరీరంలో ఎక్కువై బయటకు పోలేక, లోపల పేరుకుపోయి, రకరకాలుగా కణాలకు, అవయవాలకు తుప్పు పట్టించటం మొదలు పెడుతుంది. ఏ జీవి ఉప్పు తినదు కాబట్టే వాటి శరీరంలో తుప్పు పట్టదు. అందుకే ఏ జీవికి జబ్బులు రావటం లేదు. మనమే ఆ ఉప్పును తింటూ పూర్తిగా నష్టపోతున్నది. ఉప్పును కనిపెట్టిన పూర్వీకులు ఉప్పు యొక్క నష్టాన్ని కూడా ఏనాడో తెలుసుకుని, దానితో జాగ్రత్తగా బతకమని కొన్ని మాటలు చెప్పారు. ఉప్పును శని అని పిలిచారు, దానినే దరిద్రమని కూడా అంటారు. ఉప్పు తింటే అప్పుల పాలవుతారని కూడా అంటారు. ఉప్పును ఎవరూ చేతికి ఇవ్వరు. ఇచ్చినా ఎవరూ పుచ్చుకోరు. అమ్మాయిని కాపురానికి పంపేటప్పుడు అన్నీ పంపి ఒక్క ఉప్పు మాత్రం పంపరు. ఉప్పుకు నీచస్థానం కలిగించి దొడ్లో మారుమూల దాచేవారు. ఎవరైతే ఉప్పును దూరంగా ఉంచుతారో వారు ఆరోగ్యంగా జీవిస్తారని ఎప్పుడో చెప్పారు.
 
యోగులు, మహర్షులు, ఉప్పు తినకుండా హాయిగా జీవించారు. మహాత్మాగాంధీ గారు వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి, ఉప్పును ఏనాడో పూర్తిగా మానారు. వినోబాభావే కూడా తినలేదు. వీరిద్దరూ ఉప్పు మానిన దగ్గర్నుండీ రోగం రాకుండా, హాయిగా జీవించగలిగామని తెలిపారు. ఉప్పు తగిలితే చాలు ఏ వస్తువైనా, వాహనమైనా నాశనం అయిపోతుంది. ఉప్పు ఇనుమును తినేస్తుంది. గోడలను పడగొడుతుంది. ప్లాస్టిక్‌ని తినేస్తుంది, మట్టికుండను కూడా శిథిలం చేస్తుంది. స్టీలు గిన్నెలో ఉంచితే దానిని కూడా చిల్లులు పెట్టేస్తుంది. అలాంటి నాశనం చేసే గుణమున్న ఉప్పును రుచికోసం తిని మనలో దాచుకుంటే ఆ ఉప్పు మనల్ని తినడం ఒక లెక్కా! శరీరాన్ని నాశనం చేసి పెడుతుంది. ఏ రుచికి ఇంత నాశనం చేసే గుణం లేదు. ఉప్పు మనపాలిట ఒక విషం. ఈ విషయాన్ని గ్రహిస్తే ఆరోగ్యానికదే వరం.

No comments:

Post a Comment