Saturday, 4 March 2017

Alubukara

యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆలుబుకారా పండ్లు తినడం వల్ల కేన్సర్‌ బారినపడే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఉండే బీటాకెరోటెన్‌ అనే యాంటాక్సిడెంట్‌ ఊపిరితిత్తులు, నోటి సంబంధ కేన్సర్లను దరిచేరనీయదు. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమయ్యే పొటాషియం, ఫ్లోరైడ్‌, ఐరన్‌ వంటి ఖనిజాలు కూడా ఆలుబుకారాల్లో ఉంటాయి.  వీటిలో ఉండే ఇతర యాంటాక్సిడెంట్లు, శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. ఆలుబుకారా తింటే జీర్ణాశయ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం, జ్వరానికి మంచి విరుగుడు ఇది మంచి మందులా పని చేస్తుంది. కేలరీలు తక్కువ, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఈ పండ్లను తినడంవల్ల బరువు పెరుగుతామనే చింతే ఉండదు. ఇందులోని విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల దృఢత్వాన్ని కాపాడే విటమిన్‌-కె పాళ్లు కూడా ఈ పండులో ఎక్కువే. 
ఎరుపు, నలుపు, నీలం రంగుల్లో దొరికే ఆలుబుకారా పండ్లతో జామ్‌, జ్యూస్‌, చట్నీలు తయారుచేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడే జెల్లీలు, కేకులు కూడా తయారుచేసుకోవచ్చు. చైనాలో వైన్‌ తయారీకి ఎక్కువగా ఈ పండ్లనే ఉపయోగిస్తారు. ఇంగ్లాండ్‌, సెర్బియా వంటి యూరప్‌ దేశాల్లో ఆల్కాహాలిక్‌ డ్రింక్స్‌ను ప్రత్యేకంగా ఆలుబుకారా పండ్లతో తయారుచేస్తారు.
 

No comments:

Post a Comment