జొన్నలు ఆరోగ్యానికి మంచివని చాలామంది అంటుంటారు. అయితే అవి తినడం వల్ల ఎటువంటి పోషకాలు లభిస్తాయో చాలామందికి తెలియదు.
జొన్నల్లో ప్రొటీన్లే కాకుండా పాస్పరస్, మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, నేరేడు పండు వంటి వాటిల్లో ఉండే వాటికన్నా రెట్టింపు యాంటాక్సిడెంట్లు జొన్నల్లో ఉంటాయి. గుండెజబ్బులు, కేన్సర్, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరకుండా ఈ యాంటాక్సిడెంట్లు కాపాడతాయి. మెరుగైన జీర్ణక్రియకి తోడ్పడే ఫైబర్ జొన్నల్లో ఎక్కువగా లభిస్తుంది. వీటిల్లో నియాసిన్ అనే బి-6 విటమిన్ కాంపౌండ్ ఉంటుంది. అది తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణం అయి శక్తిలా మారడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోకుండా ఉంటాయి.
No comments:
Post a Comment