కొంత వరకూ గాని, పూర్తిగా గాని జ్ఞాపకశక్తిని కోల్పోవడాన్ని మతిమరుపు (amnesia) అని అంటారు. ప్రధానంగా వృద్ధాప్యంలో ఏర్పడే నరాల బలహీనత ఈ మతి మరుపుకి కారణమవుతుంది.
నరాలలోని జీవ కణాలు ఏ కారణం చేతనైనా బలహీన పడితే తిరిగి కోల్పోయిన శక్తిని పుంజుకోవడం చాలా కష్టం. ఈ రకంగా జీవకణాలు క్రమేపి బలహీనపడుతూ ఉండటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడమే కాకుండా మెదడు కార్యక్రమాలన్నీ కుంటుపడిపోతూంటాయి. ఈ రకం వ్యక్తులకు మాటలు జ్ఞాపకం రాకపోవడం వస్తువుల పేర్లు, వ్యక్తుల పేర్లు మర్చిపోవటంతో ప్రారంభమవుతుంది. సహజంగా వృద్ధాప్యంలో ఈ రకంగా జరుగుతుంది. కొన్ని ప్రమాద సంఘటనలలో కూడా తాత్కాలికంగా ఈ లక్షణాలు కనపడతాయి. తరచుగా ఈ రకమైన మతిమరుపు పూర్తిగా ఏర్పడి చివరకు తమ పేర్లను తామే మర్చిపోయే పరిస్థితికి ఈ వ్యాధిగ్రస్తులు వస్తారు.
మతిమరుపు తగ్గించటానికి చేతికి అందుబాటులో ఉండే మూలికా చికిత్సలు కొన్నింటిని ప్రయత్నించండి.
ఉదయాన్నే 5 గ్రాముల శంఖపుష్పి పువ్వులతో 5 గ్రాముల పటికబెల్లం కలిపి మెత్తగా నూరి పాలలో తినిపిస్తుంటే మతిమరుపు తగ్గుతుంది.
ప్రతి రోజు ఉదయాన్నే ఒక ఆపిల్ తిని టీ స్పూన్ తేనెను గ్లాసు పాలల్లో కలిపి తాగుతుంటే మతిమరుపు, మానసిక ఉద్రేకాలను తగ్గిస్తుంది.
ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని 2 టీ స్పూన్ల తేనెతో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే మతి మరుపు తగ్గిస్తుంది.
మతిమరుపు కలవారు ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న గింజలు, చిరు ధాన్యాలు, పండ్లరసాలు, ఆవుపాలు, అత్తిపళ్ళు, ద్రాక్ష, ఆరెంజ్, ఖర్జూరాలు మొదలైనవి వాడి ఆహారపదార్థాలలో ఉండేట్టు చూసుకోవాలి.
No comments:
Post a Comment