Saturday 11 March 2017

Karpoora Tulasi

తెల్లని లేక లేత గులాబి రంగు పూలను పూసే ఈ మొక్క పుష్పాలలోని మకరందం కోసం తేనెటీగలు బాగా ఆకర్షితులవుతాయి. మొక్క పైభాగమంతా సువానస కలిగి ఉన్నా నలిపిన ఆకుల నుంచి మాత్రం ఘాటైన ఇంపైన, ఉత్తేజపరిచే వాసనలు వెదజల్లుతుంది. ప్రధానంగా ఆకుల నుంచి తీసిన తైలంలో కేంఫర్‌ శాతం 60 నుంచి 80 వరకు ఉంటుంది. ఈ తైలంలో హృదయాన్ని రంజింపచేసే సుగంధ సువాసనలకు కారణం అందులో కేంఫర్‌, కేంఫీన్‌, టర్‌పినోలీన్‌, లియోనీన్‌, సినియోల్‌, ఆల్ఫా-పైనీన్‌, బీటా-మైర్సిన్‌, ఆసిమిన్‌, కారియోఫిల్లీన్‌ వంటి రసాయనాలు ఉండటమే. వీటితో పాటు ఫ్లావోనాయిడ్లు, టానిన్లు, సాపోనిన్లు, స్టిరాల్స్‌ వంటి కెమికల్‌ కాంపౌండ్లు ఉన్నాయి. వీటి కారణంగానే కర్పూర తులసికి అనేక ఔషధీయ విలువలు కలిగి ఉన్నాయి. పూజలు నిర్వహించు ప్రదేశాలలో, దేవాలయాలలో, కర్పూరంతో వెలిగించే జ్యోతులు, వెలువడే పొగలు, మనస్సుకు ప్రత్యేకతమైన ఆధ్యాత్మికతను, పవిత్రతను చేకూర్చడమే కాకుండా పరిసరాల స్వచ్ఛతను ప్రభావితం చేస్తాయి.
 
ఔషధ సంపత్తులు  
యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉండటం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలను నివారిస్తుంది. 
దీని ఆకుల రసం నుంచి లేక ఆకులు వేసి మరగ కాచిన వేడి నీళ్లలో నుంచి వెలువడు ఆరోమాటిక్‌ ఆవిర్లు పీల్చినచో జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు దిబ్బడ, కంజెస్టెడ్‌ ఊపిరితిత్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
ఆకుల ఇన్‌ఫ్యూజన్‌ శరీరానికి రాసుకుంటే చికెన్‌పాక్స్‌, మీజిల్స్‌ వంటి అంటు వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది. 
ప్రదేశాలను, పరిసరాలను క్రిమిరహితంగా ఉంచి ఆరోగ్యరక్షణకు దోహదకారి అవుతుంది. 
జఠర దీప్తిని కలిగిస్తుంది. అజీర్ణం, కలరా, విరోచనాలను అరికడుతుంది. 
రోజ్‌వాటర్‌తో కలిపి చుక్కలుగా వాడినచో ముక్కు నుంచి రక్తస్రావం, కంటి, చెవి సంబంధ సమస్యలు తొలగిపోతాయి. 
దోమలు, ఇతర కీటకాలను సమర్ధవంతంగా వికర్షించుటయే కాకుండా ధాన్యాగార, కీటక సంహారిణిగా కూడా పనిచేస్తుంది. 
నోటి దుర్వాసనను నివారించడంలో, దంతాల సమస్యలకు, వాటి పటిష్టతకు, చర్మం కాంతివంతంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. 
పెర్‌ఫ్యూమ్‌లలో, సెంటెడ్‌ సోపులలో, కాస్మెటిక్‌ ఆయింట్‌మెంట్లలో వాడతారు. దీని ఎసెన్షియల్‌ తైలాలతో కూడిన మస్కిటో రీపెల్లెంట్‌ ఆయిట్‌మెంట్‌ ఉత్పత్తులు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. 
కేంఫర్‌ బాసిల్‌ని అనేక సంప్రదాయ ఔషధాలలో ఉపయోగించడమే కాకుండా బంగారం ద్రావకాలలో కలిపి గ్లాస్‌, సిరామిక్‌ వస్తుసామగ్రిపై డిజైన్‌లు చిత్రీకరిస్తారు.
 

No comments:

Post a Comment