Friday 31 March 2017

Boppayi leaves and fruit

బొప్పాయి పండు మాత్రమే కాదు, దాని ఆకుల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి... 
బొప్పాయి ఆకుల్లో పపైన్‌, కైమోపపైన్‌లాంటి ఎంజైములు ఎన్నో ఉన్నాయి. 
బొప్పాయి ఆకులతో చేసిన జ్యూసు తాగడం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. అందుకే డెంగ్యూ సోకిన వారిని ఈ జ్యూస్‌ తాగమంటారు. 
బొప్పాయి ఆకుల్లో యాంటీ-మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజెనిన్‌ విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. 
కాలేయాన్ని శుభ్రం చేయడంలో ఇది క్లీనింగ్‌ ఏజెంటుగా పనిచేస్తుంది. 
లివర్‌ సిరోసిస్‌, ఇతర కాలేయ జబ్బుల్ని నివారిస్తుంది. 
దీనివల్ల జీర్ణక్రియ బాగా జరగడమే కాకుండా మలబద్ధకం కూడా తగ్గుతుంది. 
ఇందులోని యాంటి-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పేగులోని, పొట్టలోని మంటను తగ్గిస్తాయి. 
ఈ జ్యూసు పెప్టిక్‌ అల్సర్లను కూడా తగ్గిస్తుంది. 
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది. శరీరంలోని ఇన్సులిన్‌ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. 
ఆకులోని యాంటాక్సిడెంట్లు కిడ్నీ దెబ్బతినకుండా కాపాడడంతో పాటు ఫ్యాటీ లివర్‌ సమస్యను నివారిస్తాయి. 
బొప్పాయి ఆకుల జ్యూసు ఆడవాళ్లకు బహిష్టు సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. 
బొప్పాయి ఆకుల్లో విటమిన్‌-సి, విటమిన్‌-ఎ లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ జ్యూసు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో కాంతిమంతంగా ఉంటుంది. 
బొప్పాయి ఆకుల గుజ్జు తలకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. నేచురల్‌ కండిషనర్‌గా పనిచేస్తూ శిరోజాలను కాంతిమంతంగా ఉంచుతుంది. 



బొప్పాయి పండులో ఎన్నో ఔషధగుణాలున్నాయి. భోజనం చేశాక బొప్పాయి తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మూత్రపిండాలతో రాళ్ళు అరికట్టేందుకు బొప్పాయి ఎంతగానో దోహద పడుతుంది. బొప్పాయి ఆకులతో చేసిన జ్యూస్‌ తాగితేప్లేట్లేట్స్‌ సంఖ్య పెరుగుతుంది. అందుకే డెంగ్యూ సోకిన వారికి ఈ జ్యూస్‌ తాగమని చెబుతారు. బొప్పాయి ఆకులను మెత్తగా దంచి పసుపుతో కలిపి పట్టువేస్తే బోధకాలు తగు తుంది. ఈ ఆకుల్లో యాంటీ మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజనీస్‌ విషజ్వరాలు రాకుండా కాపాడుతుంది. జీర్ణక్రియ బాగా జరగడమే కాకుండా మలబద్దకం కూడా తగ్గుతుంది. ఇందులో యాంటి ఇంప్లిమేటరీ గుణాలు ప్లేగు, పొట్టలోని మంటను తగ్గిస్తాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఈరసం మంచిది శరీరంలోని ఇన్సులిన్‌ ఉత్పత్తిని క్రమబద్దీ కరిస్తుంది. బొప్పాయి ఆకుల్లో విటమిన్‌-సి, విటమిన్‌-ఎలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ జ్యూస్‌ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా, ఎంతో కాంతివంతంగా ఉంటుంది.

Thursday 30 March 2017

Ugadi Special

ఉగాది పచ్చడిని మన శాస్త్రాల్లో ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోక కళికా ప్రాశనం’ అని పేర్కొంటారు. రుతువుల మార్పు కారణంగా కలిగే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఈ ఉగాది పచ్చడిని పూర్వకాలం సేవించేవారు. ‘‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం, మమ శోకం సదా కురు’’ అనే శ్లోకం చదువుతూ ఈ పచ్చడిని తింటే సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్యమూ రాదని శాస్త్రాలు పేర్కొన్నాయి. పూర్వకాలం ఈ వేపపువ్వు పచ్చడిని చైత్రశుక్ల పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ, ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ సేవించేవారు. ఈ పచ్చడిలో మన పూర్వీకులు- వేప లేత చిగుళ్లు, ఇంగువ, బెల్లం, సైంధవ లవణం కలిపి నూరేవారు. ఆ తర్వాత చింతపండు, తాటిబెల్లం లేదా పటిక బెల్లం, వాము, జీలకర్ర, పసుపు కూడా వేసి మెత్తగా నూరేవారు. ఈ మిశ్రమాన్ని పరగడుపున అరతులం వంతున తొమ్మిది లేదా పదిహేను రోజులు తింటే ఎలాంటి అనారోగ్యమూ రాదని విశ్వసించేవారు. ఇప్పుడు ఈ పచ్చడిలో లేతమామిడి చిగుళ్లు, అశోక చిగుళ్లు వాడటం మానేశారు. ఇక ఆయుర్వేదంలో కూడా ఈ పచ్చడిలో ఉపయోగించే పదార్థాల విశిష్టత గురించి ఎన్నో విషయాలు పేర్కొన్నారు. అవి..
 
బెల్లం (మధురం): బెల్లం మనసును ఆహ్లాద పరుస్తుంది. మినరల్స్‌, విటమిన్స్‌, పొటాషియం విరివిగా లభిస్తాయి. దీనిలో ఉండే ఐరన్‌ రక్తహీనత రాకుండా కాపాడుతుంది. దగ్గు, అజీర్ణం, అలర్జీ, మలబద్ధకం, మైగ్రేన్‌, కామెర్లు వంటి అనారోగ్యాలను నివారిస్తుంది.
 
చింతపండు (పులుపు): కొత్త చింతపండు జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. మంచి విరేచనకారి. జీర్ణాశయంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
 
లవణం (ఉప్పు): మంచి రుచిని కలిగిస్తుంది. హైపోనెట్రోనియా రాకుండా నివారిస్తుంది.
 
వాము (కారం) : దీనిలో ఫైబర్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగ్‌సలకు ఇది విరుగుడు. ఆస్తమా, దగ్గు, శ్వాస సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది. విరేచనాలను కట్టడి చేయడానికి, ఎముకలు, కీళ్ల నొప్పుల నివారిణిగా పని చేస్తుంది.
 
వేప పువ్వు (చేదు): పొట్టలో ఉండే క్రిములను నాశనం చేస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడి అనేక రకాల చర్మ వ్యాధులను నివారిస్తుంది. దీన్ని పొడిగా చేసి వాడితే చర్మంపై పుండ్లు, గాయాలు మానుతాయి. మధుమేహానికి మంచి ఔషధం.
 
మామిడి పిందెలు (వగరు): లేత మామిడిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల పేగుల్లోని మలినాల్ని బయటకు పంపుతుంది. రక్త విరేచనాలను అరికడుతుంది. సన్నగా ఉన్నవారు పాలల్లో గానీ, బెల్లంతో గానీ లేతమామిడిని తింటే లావు అవుతారు.

Tuesday 28 March 2017

Sugarcane Juice

వేసవిలో విరివిగా దొరికే చెరకు రసంతో దాహం తీరటమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. శక్తినిచ్చే ఈ వేసవి పానీయానికి ఆరోగ్యానికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయి. అవేంటంటే... 
చెరకు రసంలో సుక్రోజ్‌ రూపంలో ఉండే చక్కెరను శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి చెరకు రసం తాగగానే తక్షణ శక్తి చేకూరుతుంది. డీహైడ్రేషన్‌ బారిన పడ్డప్పుడు చెరకు రసం తాగితే త్వరగా కోలుకుంటాం. 
చెరకు రసంలోని ఫినాల్‌, ఫ్లేవనాల్‌ ఒంట్లోని ఫ్రీ ర్యాడికల్స్‌ను పారదోలి కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. 
క్యాన్సర్‌ రాకుండా నియంత్రించే ఫ్లేవనాయిడ్స్‌ చెరకు రసంలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కణాలు విస్తరించకుండా చేయటంతోపాటు వాటితో పోరాడి నాశనం చేస్తాయి. 
చెరకు రసం స్పోర్ట్స్‌ డ్రింక్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఆటల వల్ల వచ్చే అలసటను దూరం చేసే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, కాల్షియం ఎలక్ట్రోలైట్లు చెరకు రసంలో ఉంటాయి. 
చెరకు రసంలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. కాబట్టి మధుమేహులు కూడా చెరకు రసం తాగొచ్చు. దీన్లోని సుక్రోజ్‌ దంత క్షయాన్ని కూడా నివారిస్తుంది.

Monday 27 March 2017

Badam

బాదంపప్పు అనగానే..ఆయిల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుందని భయపడుతుంటాం. అయితే ఆల్‌మండ్‌లో ఉండే ఫ్యాట్‌ శరీరానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అడపాదడపా బాదాంపప్పు తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందట. బాదంతో కలిగే లాభాలు..
బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ బ్లడ్‌ సెల్స్‌ డ్యామేజ్‌ను అరికడతాయి. క్యాన్సర్‌ కారక కణాలను నిలువరిస్తాయి.
బాదంలో పుష్టిగా ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మం నిగనిగలాడేందుకు కూడా దోహదం చేస్తాయి.
ఇందులో ఉండే విటమిన్‌-ఇ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా బాదం మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం డయాబెటిక్‌ను కంట్రోల్‌ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.         బీపీని అదుపులో ఉంచుతుంది.
శరీర బరువు తగ్గించడంలోనూ  క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. రోజుకు నాలుగైదు బాదం పప్పులు తినడం వల్ల శారీరక అలసట దూరం                       అవుతుంది.
బాదంలో సమృద్ధిగా ఉండే కాపర్‌, కాల్షియం ఎముకల్లో పటుత్వం పెంచడంతో పాటు, కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి.
        రోజూ కొన్ని పప్పుల్ని తినడం వల్ల ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది.
 

Friday 17 March 2017

Jama Leaves

జామపండే కాదు జామ చెట్టు ఆకులూ మన ఆరోగ్యం విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యమైన జుట్టుకు జామ ఆకులు ఎంతో శ్రేష్ఠమని నిపుణులు అంటున్నారు. జామ చెట్టు ఆకుల ఉపయోగాలేంటో పూర్తిగా తెల్సుకుందాం.
 జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. జామ ఆకులు నీటిలో ఉడకబెట్టి  ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది. అంతేనా అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి.
 జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యం. నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటిలో ఉండే పొక్కులు పోతాయి. 
 వీటితో టీ చేసుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు నియంత్రిస్తాయి.
 జామాకులతో చేసిన టీ తాగటం వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు పోతాయి. దగ్గు తగ్గిపోతుంది.
 ఈ ఆకుల్లో విటమిన్‌- బి పుష్కలంగా ఉంటుంది. విటవిన్‌ బి2 కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. బి3, బి5, బి6 విటమిన్లల చర్మ సౌందర్యానికి మంచిది
గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో 20 నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు తలెత్తవు. దీంతో పాటు జుట్టు కుదుళ్లు  దృఢంగా తయారవుతాయి.
 

Remedies for Hicups

ఎక్కిళ్లు అడపా దడపా అందరినీ ఇబ్బంది పెడతాయి. ఇవి కొందరిని కొన్ని నిమిషాల పాటు విసిగించి మాయమవుతాయి. ఇంకొందరిని ఏకంగా కొన్ని గంటలపాటు వేధిస్తాయి. ఎక్కిళ్లు ఎందుకిలా ఎక్కువ సేపు అసౌకర్యానికి గురిచేస్తాయి. అసలు ఎక్కిళ్లు రావటానికి కారణలేమైనా ఉన్నాయా?
 
ఛాతీ అడుగున ఉండే డయాఫ్రమ్‌ అసంకల్పితంగా స్పందించినప్పుడు కలిగే శారీరక మార్పే ఎక్కిళ్లు. ఇలా జరగటానికి చాలా కారణాలున్నాయి. 
ఆహారంతోపాటు గాలిని మింగేయటం. 
ఆహారం త్వరత్వరగా తినటం. 
ఎక్కువ కారంగా ఉండే పదార్థాలు తినటం. 
ఎక్కువగా మద్యం తాగటం. 
భయం, ఆందోళన. 
ఉన్నట్టుండి శరీర ఉష్ణోగ్రతలో మార్పులు కలగడం. 
కొన్ని రకాల మందులు, పొట్ట భాగంలో సర్జరీలు, వ్యాధులు. 


సాధారణంగా జీవితంలో ఏదో ఓ సందర్భంలో ఎక్కిళ్లు అందరినీ వేధిస్తాయి. బాధించే సమయం నిడివిని బట్టి ఎక్కిళ్లను 3 రకాలుగా విభజించారు. 
హికప్‌ బౌట్‌: 48 గంటల పాటు ఎక్కిళ్లు వేధిస్తాయి. 
పర్సిస్టెంట్‌ హికప్స్‌: 48 గంటలు దాటి కొన్ని రోజులపాటు ఇవి కొనసాగుతాయి. 
ఇన్‌ట్రాక్టబుల్‌ హికప్స్‌: ఈ రకం ఎక్కిళ్లు నెల రోజులకు మించి బాధిస్తాయి.
 
ఎప్పుడు తీవ్రంగా పరిగణించాలి? 
ఆగకుండా నెలరోజులపాటు ఎక్కిళ్లు వేధిస్తే ఆ పరిస్థితిని తీవ్రంగా పరిగణించి వైద్యులను ఆశ్రయించాలి. కేంద్ర నాడీ వ్యవస్థ, పక్షవాతం, మూత్రపిండాల పనితీరు మందగించటం, మానసిక వ్యాధుల్లో ఎక్కిళ్లు నెలల తరబడి వేధిస్తాయి. కాబట్టి వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.
 
తేలికైన చిట్కాలు 
ఎక్కిళ్లను ఆపాలంటే మనసును ఇంకో విషయం వైపు మళ్లించాలి. కొద్ది క్షణాలు, నిమిషాలపాటు ఎక్కిళ్లు వేధిస్తూ ఉంటే ఈ చిట్కాలు ఫలితాన్నిస్తాయి. 
ముక్కును గిల్లాలి.
కొద్దిసేపు ఊపిరి బిగపట్టాలి.
నీళ్లతో నోరు పుక్కిలించాలి. 
చల్లని నీరు తాగాలి. 
నోట్లో ఒక స్పూన్‌ చక్కెర లేదా తేనె వేసుకోవాలి. 
పేపర్‌ బ్యాగ్‌లో గాలి వదిలి పీల్చాలి. 
నిమ్మకాయ కొరకాలి. 
భయానికి గురవ్వాలి.
 
ఎక్కిళ్లు రాకుండా ఉండాలంటే
 
ఎక్కిళ్లను ప్రేరేపించే విషయాలకు దూరంగా ఉంటే ఎక్కిళ్లు రాకుండా ఉంటాయి. అవేంటంటే.. 
కూల్‌డ్రింక్స్‌ 
మద్యం, సిగరెట్లు 
హఠాత్తుగా ఉత్తేజితమవటం, ఆందోళనకు గురవ్వటం. 
శరీర ఉష్ణోగ్రతలో మార్పులు జరగకుండా చూసుకోవటం. 
ఎక్కువ తినటం, తాగటాన్ని తగ్గించుకోవాలి. 
వేగంగా తినే అలవాటును మార్చుకోవాలి.

Piles and remedies

తీవ్రమైన మలబద్ధకంలో బలవంతంగా మల విసర్జన చేస్తున్నప్పుడు పురీషనాళం దగ్గర ఉన్న రక్త నాళాలు ఉబ్బి చిట్లి మలంతో పాటు రక్తం కలిసి బయటకు పడుతుంది. ఈ సమస్యనే ఆయుర్వేదంలో ‘మూలవ్యాధి’ అంటారు. కొందరికి మలంతో పాటు రక్తం పడకుండా అధికమంట, పోటు, వాపు మాత్రమే ఉంటాయి. ఆధునిక వైద్యులు ఈ మొదటి రకం వ్యాధిని external piles అని, రెండవ రకాన్ని internal piles అని పిలుస్తారు. ఈ మూల వ్యాధిలో అధికంగా రక్తం బయటకు పోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. రోగి బలహీన పడిపోతాడు. అశ్రద్ధ చేస్తే పురీషనాళం వాచి బయటకు పొడుచుకు వస్తుంది. ఇలాంటప్పుడు లైంగిక బలహీనతలు కూడా ఏర్పడతాయి. రక్తం బాగా బయటకు పోవడం వల్ల తీవ్ర స్థితిలో ప్రాణాపాయం కూడా కలగవచ్చు. 

ప్రధాన కారణాలు 
తీవ్రమైన మలబద్ధకం, అజీర్ణం, అతికారం, పులుపు, మిర్చి, మసాలాలు దట్టించిన ఆహార పదార్థాలు తినడం, ఎక్కువగా నిద్రలేని రాత్రుళ్ళు గడపడం, కాలేయంలో విషపదార్థాలు చేరడం, శరీరానికి సరిపడని వ్యతిరేక పదార్థాలు తీసుకోవడం ఈ వ్యాధికి ప్రధాన కారణాలు. 
మనశ్శాంతి లేకుండా చేసే ఈ వ్యాధిని అదుపు చేసే సులభ మూలికా చికిత్సలు తెలుసుకుందాం. 
ఫ ఒక టీ స్పూన్‌ ఉసిరికాయల చూర్ణం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ముందు పాలలో గానీ మజ్జిగలో గానీ కలిపి తాగుతుంటే ఈ వ్యాధిలో రక్తం పడటం త్వరగా తగ్గి బాధ తగ్గుతుంది. 
ఫ ఒక టీ స్పూన్‌ నాగకేసరాల చూర్ణంలో ఒక టీ స్పూన్‌ చక్కెర కలిపి రోజూ ఉదయం, రాత్రి నీటిలో తాగుతుంటే త్వరగా వ్యాధి బాధ నుండి బయటపడతారు. అధిక రక్తస్రావం తగ్గిపోతుంది. 
అల్ల నేరేడు పండ్లను రోజూ ఉదయం కొద్దిగా ఉప్పులో అద్దుకుని తింటుంటే రెండు లేదా మూడు నెలలకు ఈ వ్యాధి తగ్గిపోతుంది. 
ఉత్తరేణి వేళ్ళను నీటిలో మెత్తగా నూరి, తేనె కలిపి ప్రతి రోజూ బియ్యం కడుగుతో తాగుతుంటే మూలవ్యాధి తగ్గుతుంది. 
ఉత్తరేణి గింజలను నీటిలో మెత్తగా నూరి, బియ్యం కడుగుతో కలిపి తాగితే రక్తం పడే మూల వ్యాధి తగ్గుతుంది. 
ఉసిరికాయలను ముక్కలుగా కోసి పెరుగు మీది తేటతో ఉడికించి తింటుంటే అతిగా రక్తం పోవడం ఆగిపోయి వ్యాధి శమిస్తుంది. 
బ్రహ్మమేడిపాలను మూలాలకు రాస్తూ భోజనంలో ఎక్కువగా నెయ్యి చేర్చి తింటుంటే మొలలు తెగి పడిపోతాయి. 
నీరుల్లి గడ్డలను కుమ్ములో ఉడికించి చక్కెర కలిపి తింటుంటే రక్తం పోవడం ఆగిపోయి వ్యాధి శమిస్తుంది. 

How to improve Memory ?

కొంత వరకూ గాని, పూర్తిగా గాని జ్ఞాపకశక్తిని కోల్పోవడాన్ని మతిమరుపు (amnesia) అని అంటారు. ప్రధానంగా వృద్ధాప్యంలో ఏర్పడే నరాల బలహీనత ఈ మతి మరుపుకి కారణమవుతుంది. 
 
నరాలలోని జీవ కణాలు ఏ కారణం చేతనైనా బలహీన పడితే తిరిగి కోల్పోయిన శక్తిని పుంజుకోవడం చాలా కష్టం. ఈ రకంగా జీవకణాలు క్రమేపి బలహీనపడుతూ ఉండటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడమే కాకుండా మెదడు కార్యక్రమాలన్నీ కుంటుపడిపోతూంటాయి. ఈ రకం వ్యక్తులకు మాటలు జ్ఞాపకం రాకపోవడం వస్తువుల పేర్లు, వ్యక్తుల పేర్లు మర్చిపోవటంతో ప్రారంభమవుతుంది. సహజంగా వృద్ధాప్యంలో ఈ రకంగా జరుగుతుంది. కొన్ని ప్రమాద సంఘటనలలో కూడా తాత్కాలికంగా ఈ లక్షణాలు కనపడతాయి. తరచుగా ఈ రకమైన మతిమరుపు పూర్తిగా ఏర్పడి చివరకు తమ పేర్లను తామే మర్చిపోయే పరిస్థితికి ఈ వ్యాధిగ్రస్తులు వస్తారు.
 
ఈ మతిమరుపుకి ఇతర కారణాలు ఎక్కువగా మానసిక వ్యాధులేనని చెప్పాలి. నరాల బలహీనత, ఉన్మాదకరమైన మానసిక ఒత్తిడి లేకుండా తరచుగా మానసిక భ్రమలతో బాధపడేవారికి కూడా ఈ మతిమరుపు తోడవుతుంది. మతిమరుపు రోగులకు ముందుగా వస్తువులు, ఊర్లపేర్లు, జరిగిపోయిన సంఘటనలు గుర్తుండవు.  
మతిమరుపు తగ్గించటానికి చేతికి అందుబాటులో ఉండే మూలికా చికిత్సలు కొన్నింటిని ప్రయత్నించండి.
 
ఎండబెట్టిన 5 గ్రాముల సరస్వతి ఆకులను, నీటిలో నానబెట్టి పొరతీసిన 5 బాదం గింజలను, 5 మిర్యాలను కలిపి నీటితో బాగా మెత్తగా నూరి వడకట్టి కొద్దిగా పంచదార కలిపి రెండు వారాల పాటు ఉదయాన్నే పరగడపున తింటే మతిమరుపు తగ్గుతుంది.  
ఉదయాన్నే 5 గ్రాముల శంఖపుష్పి పువ్వులతో 5 గ్రాముల పటికబెల్లం కలిపి మెత్తగా నూరి పాలలో తినిపిస్తుంటే మతిమరుపు తగ్గుతుంది. 
ప్రతి రోజు ఉదయాన్నే ఒక ఆపిల్‌ తిని టీ స్పూన్‌ తేనెను గ్లాసు పాలల్లో కలిపి తాగుతుంటే మతిమరుపు, మానసిక ఉద్రేకాలను తగ్గిస్తుంది. 
ఒక టీ స్పూన్‌ జీలకర్ర పొడిని 2 టీ స్పూన్ల తేనెతో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే మతి మరుపు తగ్గిస్తుంది. 
మతిమరుపు కలవారు ఫాస్ఫరస్‌ ఎక్కువగా ఉన్న గింజలు, చిరు ధాన్యాలు, పండ్లరసాలు, ఆవుపాలు, అత్తిపళ్ళు, ద్రాక్ష, ఆరెంజ్‌, ఖర్జూరాలు మొదలైనవి వాడి ఆహారపదార్థాలలో ఉండేట్టు చూసుకోవాలి.

Saturday 11 March 2017

Karpoora Tulasi

తెల్లని లేక లేత గులాబి రంగు పూలను పూసే ఈ మొక్క పుష్పాలలోని మకరందం కోసం తేనెటీగలు బాగా ఆకర్షితులవుతాయి. మొక్క పైభాగమంతా సువానస కలిగి ఉన్నా నలిపిన ఆకుల నుంచి మాత్రం ఘాటైన ఇంపైన, ఉత్తేజపరిచే వాసనలు వెదజల్లుతుంది. ప్రధానంగా ఆకుల నుంచి తీసిన తైలంలో కేంఫర్‌ శాతం 60 నుంచి 80 వరకు ఉంటుంది. ఈ తైలంలో హృదయాన్ని రంజింపచేసే సుగంధ సువాసనలకు కారణం అందులో కేంఫర్‌, కేంఫీన్‌, టర్‌పినోలీన్‌, లియోనీన్‌, సినియోల్‌, ఆల్ఫా-పైనీన్‌, బీటా-మైర్సిన్‌, ఆసిమిన్‌, కారియోఫిల్లీన్‌ వంటి రసాయనాలు ఉండటమే. వీటితో పాటు ఫ్లావోనాయిడ్లు, టానిన్లు, సాపోనిన్లు, స్టిరాల్స్‌ వంటి కెమికల్‌ కాంపౌండ్లు ఉన్నాయి. వీటి కారణంగానే కర్పూర తులసికి అనేక ఔషధీయ విలువలు కలిగి ఉన్నాయి. పూజలు నిర్వహించు ప్రదేశాలలో, దేవాలయాలలో, కర్పూరంతో వెలిగించే జ్యోతులు, వెలువడే పొగలు, మనస్సుకు ప్రత్యేకతమైన ఆధ్యాత్మికతను, పవిత్రతను చేకూర్చడమే కాకుండా పరిసరాల స్వచ్ఛతను ప్రభావితం చేస్తాయి.
 
ఔషధ సంపత్తులు  
యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉండటం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలను నివారిస్తుంది. 
దీని ఆకుల రసం నుంచి లేక ఆకులు వేసి మరగ కాచిన వేడి నీళ్లలో నుంచి వెలువడు ఆరోమాటిక్‌ ఆవిర్లు పీల్చినచో జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు దిబ్బడ, కంజెస్టెడ్‌ ఊపిరితిత్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
ఆకుల ఇన్‌ఫ్యూజన్‌ శరీరానికి రాసుకుంటే చికెన్‌పాక్స్‌, మీజిల్స్‌ వంటి అంటు వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది. 
ప్రదేశాలను, పరిసరాలను క్రిమిరహితంగా ఉంచి ఆరోగ్యరక్షణకు దోహదకారి అవుతుంది. 
జఠర దీప్తిని కలిగిస్తుంది. అజీర్ణం, కలరా, విరోచనాలను అరికడుతుంది. 
రోజ్‌వాటర్‌తో కలిపి చుక్కలుగా వాడినచో ముక్కు నుంచి రక్తస్రావం, కంటి, చెవి సంబంధ సమస్యలు తొలగిపోతాయి. 
దోమలు, ఇతర కీటకాలను సమర్ధవంతంగా వికర్షించుటయే కాకుండా ధాన్యాగార, కీటక సంహారిణిగా కూడా పనిచేస్తుంది. 
నోటి దుర్వాసనను నివారించడంలో, దంతాల సమస్యలకు, వాటి పటిష్టతకు, చర్మం కాంతివంతంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. 
పెర్‌ఫ్యూమ్‌లలో, సెంటెడ్‌ సోపులలో, కాస్మెటిక్‌ ఆయింట్‌మెంట్లలో వాడతారు. దీని ఎసెన్షియల్‌ తైలాలతో కూడిన మస్కిటో రీపెల్లెంట్‌ ఆయిట్‌మెంట్‌ ఉత్పత్తులు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. 
కేంఫర్‌ బాసిల్‌ని అనేక సంప్రదాయ ఔషధాలలో ఉపయోగించడమే కాకుండా బంగారం ద్రావకాలలో కలిపి గ్లాస్‌, సిరామిక్‌ వస్తుసామగ్రిపై డిజైన్‌లు చిత్రీకరిస్తారు.
 

Lemon juice

నిమ్మ రసానికున్న సుగుణాలను లెక్కపెడితే రెండు చేతులకున్న వేళ్లు సరిపోవు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలోకి కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
మానసిక ఒత్తిళ్లను తగ్గించి, కొత్త ఉత్సాహాన్నిచ్చే శక్తి నిమ్మకు పుష్కలం.  
కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగిస్తుంది. కాలేయ జీవితకాలాన్ని పెంచుతుంది. 
నిమ్మలో దొరికినంత ‘సి’ విటమిన్‌ మరే పండులోను లభించదు. వయసుపెరుగుతున్నా చర్మాన్ని ముడుతలు పడనీయదు. మేనిఛాయ మెరుగవుతుంది. ఇది యాంటీసెప్టిక్‌గా పనిచేయడం వల్ల చర్మ సమస్యలూ దరిచేరవు. 
ఎప్పుడైనా కలుషిత నీటిని తాగినప్పుడు గొంతువాపు వస్తుంది. దీనికి సరైన విరుగుడు నిమ్మరసం. వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. 
పంటినొప్పిని తగ్గించే శక్తీ నిమ్మకు ఉంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. లెమన్‌ వాటర్‌ గమ్‌ నమిలినా ఈ ఫలితం కనిపిస్తుంది. 
నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్‌ దండిగా ఉంటాయి. చౌకధరలో దొరికే నిమ్మ ద్వారా విలువైన వీటిని పొందవచ్చు.

ఒక కప్పు హాట్ కాఫీ లేదా గరం చాయ్‌తో మన దినచర్య మొదలవుతుంది. కాఫీ, లేదా టీ అనేవి నిద్ర మత్తును వదిలించి యాక్టివ్‌గా చేస్తాయి. అయితే ఆరోగ్యపరంగాచూస్తే ఇంతకంటే మంచి డ్రింక్స్ తీసుకోవడం మేలుచేస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే బహుళ ప్రయోజనాలున్నాయి. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను నిర్మూలించే సాధనంగా పనిచేస్తాయి. గోరువెచ్చటి నిమ్మ రసాన్ని పరగడుపున తీసుకుంటే శరీంలోని గ్యాస్ట్రో‌సిస్టం మెరుగు పడుతుంది. ఫలితంగా శరీరంలో న్యూట్రిషన్లు, ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం వలన.. ఇది బరువు తగ్గలనుకునే వారికి దివ్య ఔషదం లాంటిది. దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. ముందు రోజు మసాలాలు, జంక్‌ఫుడ్ లాంటివి తినివుంటే ఉంటే అవన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బరం, అల్సర్లు లాంటివి రాకుండా ఉంటాయి. పొద్దున్నే ఒక గ్లాసు నిమ్మ రసం తాగడం వలన కడుపు శుభ్రపడి ప్రశాంతతను చేకూరుస్తుంది.


ఉదయాన్నే నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే ఆరోగ్యం హాయిగా ఉంటుందని అనుకుంటాం! కానీ ఈ పానీయం తయారు చేసుకునే పద్ధతి ఇది కాదు. ఈ పానీయం పూర్తి ఫలం దక్కాలంటే, ఇదిగో ఈ పద్ధతి అనుసరించాలి.
కావలసినవి:
నిమ్మకాయలు - 6, నీళ్లు - 3 కప్పులు, తేనె 2 టేబుల్‌ స్పూన్లు ఎలా కలపాలంటే?
  • నిమ్మకాయలను అడ్డంగా కోసి నీళ్లలో వేసి ఐదు నిమిషాలపాటు మరిగించాలి.
  • ఈ నీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు నిమ్మ బద్దల్ని పిండి నీళ్ల నుంచి తీసేయాలి.
  • ఈ నీళ్లను వడగట్టుకోవాలి.
  • ఒక కప్పు నీళ్లలో తేనె కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి.
మేళ్లు ఇవే!
ఇలా క్రమం తప్పక చేస్తే జీర్ణశక్తి మెరుగవడంతోపాటు, రోగ నిరోధకశక్తీ పెరుగుతుంది, శరీరంలోని పిహెచ్‌ లెవెల్స్‌ సమం అవుతాయి. ఇవే కాకుండా....

  • మూత్రనాళం శుభ్రపడుతుంది. ఫ బరువు తగ్గుతారు. ఫ రక్తపోటు అదుపులోకొస్తుంది. ఫ గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
  • చర్మం ముడతలు తగ్గి, మెరుపు సంతరించుకుంటుంది.





Pallelu

ఉడికించినా, వేయించినా పల్లీ రుచేరుచి! అయితే వీటిని ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందనే భయంతో.. అసలు తినకుండా మానేస్తారు. అది మంచి పద్ధతి కాదు. అప్పుడప్పుడు పల్లీలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.. 
పల్లీలలో విటమిన్లు, ఖనిజాలు, పోషకవిలువలతో పాటు, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం.
 
రోజూ కొన్ని పల్లీలు తింటే శరీరంలో పేరుకుపోయిన చెడుకొవ్వు తొలగిపోతుంది. ఇందులోని మోనో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ప్రత్యేకించి ఓలిక్‌ యాసిడ్‌ గుండెజబ్బుల్ని రాకుండా అడ్డుకుంటుంది.
 
పీనట్స్‌కు అత్యధిక ప్రొటీన్లు అందించే గుణం ఉంది. అమినో ఆసిడ్స్‌ శరీరారోగ్యాన్ని మరింత మెరుగు పరుస్తాయట.
 
ఈ రోజుల్లో ఉదరకోశ వ్యాధులు, పెద్ద చిన్న పేవులకొచ్చే క్యాన్సర్లు అధికం. పల్లీల్లోని పోలీ ఫినోనిక్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌ కడుపులో వచ్చే క్యాన్సర్లను రానివ్వవు. నరాల జబ్బులు, వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లను కూడా అడ్డుకుంటాయి. వీటిలోని నైట్రిక్‌ ఆక్సైడ్‌ గుండెపోటును రాకుండా కాపాడుతుంది.
 
శరీరానికి కొన్నిసార్లు బీ కాంప్లెక్స్‌ తక్కువై పలు సమస్యలు వస్తాయి. వేరుసెనగ తినేవాళ్లలో ఈ సమస్య తక్కువ. విటమిన్‌ బి6, బి9లతో పాటు మరిన్ని విటమిన్లు అందుతాయి.
 
పొటాషియం మెగ్నీషియం, కాపర్‌, కాల్షియం, ఐరన్‌, సెలీనియమ్‌, జింక్‌ వంటి ఖనిజాలకు వేరుసెనగలో కొదవ లేదు. శరీరంలోని అన్ని అవయవాలకు తగిన శక్తిని అందిస్తుంది వేరుసెనగ.
 
విదేశాల్లో పీనట్స్‌తో తయారైన బటర్‌ను విరివిగా వాడుతుంటారు. ఈ రకం బటర్‌ వల్ల గాల్‌బ్లాడర్‌ జబ్బులు దరిచేరవట. 25 శాతం రిస్క్‌ తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.
 
ముఖ్యంగా మహిళలు పీనట్స్‌ బటర్‌ను వారానికి రెండుస్లారు బ్రెడ్‌స్లయిసెస్‌కు రాసుకుని తింటే మంచిది. కొలోన్‌ క్యాన్సర్‌ ముప్పు తప్పుతుంది. ఈ విషయం పలు పరిశోధనల్లో రుజువైంది.
 
శరీరంలోని మెటాబాలిజాన్ని చురుగ్గా ఉంచి.. షుగర్‌లెవెల్స్‌ను చక్కదిద్ది.. ఆరోగ్యంగా ఉంచుతుంది వేరుసెనగ.  
సెరటోనిన్‌ లెవల్స్‌ పడిపోతే.. డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. ఆ లోటును తీరుస్తుంది పల్లీ. ఇవేకాదు, చర్మకాంతికి, జుట్టు నిగనిగలాడేందుకు పల్లీలు ఎంతో ప్రయోజనం.

Salt

మనము ఆరోగ్యంగా జీవించడానికి, ఈ శరీరానికి ఉప్పు అనేది తప్పనిసరిగా కావాలి. ఆ ఉప్పు మనకు సహజంగా ఆహారం ద్వారా అందాలే తప్ప బయటినుండి వేసుకునే ఉప్పు కాకూడదు. మనం తినే ప్రతి ఆహారంలో, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజలు, దుంపలు మొదలగు వాటిలో సహజంగా చాలా ఉప్పు ఉంటుంది. ఈ ప్రకృతిలో ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా అందులో ఉప్పు ఉంటుంది. ఉప్పులేని ఆహార పదార్థమంటూ ఉండదు, ఏ జీవి ఏ ఆహారం తిన్నప్పటికీ ఆ జీవి శరీరానికి కావాలసిన ఉప్పు ఆహారం ద్వారానే అందుతూ ఉన్నది. అందుకే, ఏ జీవి కూడా బయటి నుండి ఉప్పును గ్రహించదు. సహజమైన ఆహారం ద్వారా వచ్చే ఉప్పే వాటి సహజ జీవనానికి సరిపోతుంది. మనకు కూడా అలానే సరిపోతుంది. నాగరికత పెరిగినప్పట్నుండీ ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, పదార్థాన్ని రుచిగా చేసుకోవడానికి ప్రతి దాంట్లో ఉప్పు వేసుకోవడం మనిషికి అలవాటు అయ్యింది. అలా అలవాటుగా రోజుకి 10 నుండి 20 గ్రాముల ఉప్పును మనం తింటూ ఉన్నాము. మన శరీరానికి ప్రతి రోజూ లోపల ఖర్చు అయ్యే సహజమైన ఉప్పు 280 మి.గ్రా. అని శాస్త్రవేత్తలు తేల్చారు. అంటే ఒక గ్రాములో పావు వంతు మాత్రమే. మనం తినే ఏ ఆహారంలోనైనా ఇది మనకు అందుతుంది. ఆ ఆహారాన్ని మనం వండితిన్నా , లేదా అలాగే పాడుచేయకుండా తిన్నా ఉప్పు మాత్రం నశించకుండా మనకు అందుతుంది.
 
ఆకు కూరలను వండినప్పుడు రకొ కొరకు కొద్ది ఉప్పు వేస్తే సరిపోయి, కందిపప్పు వండినప్పుడు ఎక్కువ ఉప్పు పడుతుంది. ఆకుకూరలలో ఎక్కువ ఉప్పు ఉంది కాబట్టే బయటనుండి కొంచెం పడింది. కందిపప్పులో ఉంది కాని ఆకుకూరల్లో ఉన్నంత లేదు. పుట్టిన దగ్గర్నుండీ ప్రతిరోజు తిన్న ఎక్కువ ఉప్పంతా శరీరంలో ఎక్కువై బయటకు పోలేక, లోపల పేరుకుపోయి, రకరకాలుగా కణాలకు, అవయవాలకు తుప్పు పట్టించటం మొదలు పెడుతుంది. ఏ జీవి ఉప్పు తినదు కాబట్టే వాటి శరీరంలో తుప్పు పట్టదు. అందుకే ఏ జీవికి జబ్బులు రావటం లేదు. మనమే ఆ ఉప్పును తింటూ పూర్తిగా నష్టపోతున్నది. ఉప్పును కనిపెట్టిన పూర్వీకులు ఉప్పు యొక్క నష్టాన్ని కూడా ఏనాడో తెలుసుకుని, దానితో జాగ్రత్తగా బతకమని కొన్ని మాటలు చెప్పారు. ఉప్పును శని అని పిలిచారు, దానినే దరిద్రమని కూడా అంటారు. ఉప్పు తింటే అప్పుల పాలవుతారని కూడా అంటారు. ఉప్పును ఎవరూ చేతికి ఇవ్వరు. ఇచ్చినా ఎవరూ పుచ్చుకోరు. అమ్మాయిని కాపురానికి పంపేటప్పుడు అన్నీ పంపి ఒక్క ఉప్పు మాత్రం పంపరు. ఉప్పుకు నీచస్థానం కలిగించి దొడ్లో మారుమూల దాచేవారు. ఎవరైతే ఉప్పును దూరంగా ఉంచుతారో వారు ఆరోగ్యంగా జీవిస్తారని ఎప్పుడో చెప్పారు.
 
యోగులు, మహర్షులు, ఉప్పు తినకుండా హాయిగా జీవించారు. మహాత్మాగాంధీ గారు వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి, ఉప్పును ఏనాడో పూర్తిగా మానారు. వినోబాభావే కూడా తినలేదు. వీరిద్దరూ ఉప్పు మానిన దగ్గర్నుండీ రోగం రాకుండా, హాయిగా జీవించగలిగామని తెలిపారు. ఉప్పు తగిలితే చాలు ఏ వస్తువైనా, వాహనమైనా నాశనం అయిపోతుంది. ఉప్పు ఇనుమును తినేస్తుంది. గోడలను పడగొడుతుంది. ప్లాస్టిక్‌ని తినేస్తుంది, మట్టికుండను కూడా శిథిలం చేస్తుంది. స్టీలు గిన్నెలో ఉంచితే దానిని కూడా చిల్లులు పెట్టేస్తుంది. అలాంటి నాశనం చేసే గుణమున్న ఉప్పును రుచికోసం తిని మనలో దాచుకుంటే ఆ ఉప్పు మనల్ని తినడం ఒక లెక్కా! శరీరాన్ని నాశనం చేసి పెడుతుంది. ఏ రుచికి ఇంత నాశనం చేసే గుణం లేదు. ఉప్పు మనపాలిట ఒక విషం. ఈ విషయాన్ని గ్రహిస్తే ఆరోగ్యానికదే వరం.

Thursday 9 March 2017

Karbooja fruits

ఎండాకాలం రానే వచ్చేసింది. మార్కెట్లో ఇప్పుడు కర్బూజపండ్లు సందడి చేస్తున్నాయి. సమ్మర్‌ సీజన్‌లో వచ్చే కర్బూజపండ్లు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే.. 
కర్బూజపండులో దాదాపు 92శాతం నీరుంటుంది. అందుకే దాహాన్ని తీరుస్తుంది.
వేడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
ఇందులో విటమిన్‌- ఎ అధికంగా ఉండటంవల్ల కంటికి మంచిది. కిడ్నీలో రాళ్లను పోగొట్టే గుణం వీటికుందని నిపుణులు చెబుతున్నారు.
కర్బూజరసం రక్తంలోని చక్కెరశాతాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది.
జీర్ణశక్తిని పెంచేగుణం వీటికుంది.
విటమిన్‌-బి ఉండటం వల్ల శరీరానికి శక్తినిస్తుంది.
విటమిన్‌-సి ఉండటం వల్ల వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది

Wednesday 8 March 2017

Simple cure for headache

బెల్లం 320 గ్రాములు, 
శొంఠి చూర్ణం 320 గ్రాములు, 
ఆవునెయ్యి 320 గ్రాములు, 
ఆవుపాలు 1,280 మి.లీ తీసుకోవాలి. 

ముందు పాలు పొయ్యి మీద పెట్టి, వేడిచేస్తూ అందులో బెల్లం (చిన్న ముక్కలు) వేయాలి. 
బెల్లం కరుగుతూ ఉండగా అందులో శొంఠి పొడి కలపాలి. 
కాసేపటికి పాలలోని నీరంతా ఇంకిపోతుంది. 
ఆ పదార్థం లేహ్యంగా మారుతున్న సమయంలో అందులో ఆవు నెయ్యి కలిపి దించుకోవాలి. 
ఈ లేహ్యాన్ని ఉసిరి కాయంత పరిమాణంలో రెండు పూటలు తింటూ ఉంటే, క్రమంగా తలనొప్పి, పార్శ్వపు తలనొప్పి (మైగ్రేన్‌), మెడనరాలు పట్టుకుపోవడం, వాతం నొప్పులు తగ్గుతాయి.

Saturday 4 March 2017

Saraswathi Aku





సరస్వతి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. కుష్టు, క్షయ వ్యాధి చికిత్సలో కూడా వీటిని వాడతారు. ఈ మొక్క సారాన్ని చైనీయులు వైద్యంలో మెదడుకి టానిక్‌లా ఉపయోగిస్తారు. ఒత్తిడి, డిప్రెషన్‌ల నుంచి బయటపడేందుకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. దీన్లో ఉండే సూక్ష్మపోషకాలు వయసు ప్రభావం మెదడు మీద పడకుండా చేస్తాయి. ఏకాగ్రతను పెంచి, మెదడుకి శక్తినిస్తాయి. సరస్వతి ఆకు వాడడం వల్ల మానసిక వైకల్యంతో బాధపడే పిల్లల్లో మార్పు వస్తుందనే విషయం పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ఆకు గురించి ఇప్పటివరకు ప్రతికూలంగా ఎటువంటి ఫలితాలూ లేనప్పటికీ. గర్భిణులు వాడితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అలాగే కొలెస్ర్టాల్‌, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిక్‌, అధిక కొలెస్ర్టాల్‌ సమస్యలతో ఇబ్బందిపడుతున్న వాళ్లు వాడకపోవడం ఉత్తమం.

Alubukara

యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆలుబుకారా పండ్లు తినడం వల్ల కేన్సర్‌ బారినపడే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఉండే బీటాకెరోటెన్‌ అనే యాంటాక్సిడెంట్‌ ఊపిరితిత్తులు, నోటి సంబంధ కేన్సర్లను దరిచేరనీయదు. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమయ్యే పొటాషియం, ఫ్లోరైడ్‌, ఐరన్‌ వంటి ఖనిజాలు కూడా ఆలుబుకారాల్లో ఉంటాయి.  వీటిలో ఉండే ఇతర యాంటాక్సిడెంట్లు, శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. ఆలుబుకారా తింటే జీర్ణాశయ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం, జ్వరానికి మంచి విరుగుడు ఇది మంచి మందులా పని చేస్తుంది. కేలరీలు తక్కువ, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఈ పండ్లను తినడంవల్ల బరువు పెరుగుతామనే చింతే ఉండదు. ఇందులోని విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల దృఢత్వాన్ని కాపాడే విటమిన్‌-కె పాళ్లు కూడా ఈ పండులో ఎక్కువే. 
ఎరుపు, నలుపు, నీలం రంగుల్లో దొరికే ఆలుబుకారా పండ్లతో జామ్‌, జ్యూస్‌, చట్నీలు తయారుచేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడే జెల్లీలు, కేకులు కూడా తయారుచేసుకోవచ్చు. చైనాలో వైన్‌ తయారీకి ఎక్కువగా ఈ పండ్లనే ఉపయోగిస్తారు. ఇంగ్లాండ్‌, సెర్బియా వంటి యూరప్‌ దేశాల్లో ఆల్కాహాలిక్‌ డ్రింక్స్‌ను ప్రత్యేకంగా ఆలుబుకారా పండ్లతో తయారుచేస్తారు.
 

Dalchina Chekka - Sinnamom

కొద్ది మందిలో గాయాలు మానినట్టేమాని మళ్లీ తిరగబెడతుంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న గాయాల వల్ల మరి కొందరు శరీర భాగాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇటువంటి గాయాలు పూర్తిగా మానడానికి పరిశోధకులు ఒక మందును కనిపెట్టారు. పుదీనా నూనె, దాల్చిన చెక్క కలిపి ఒక మందును తయారుచేశారు. ఈ మందు గాయాల్లో ఉండే హానికరమైన క్రిములను నాశనం చేస్తుంది. అలాగే గాయాలు అతి త్వరగా మానేలా చేస్తుంది. గాయాల వద్ద ఉండే బ్యాక్టీరియా, క్రిములను సంప్రదాయ పద్ధతుల ద్వారా పూర్తిగా తొలగించలేము. అందువల్ల కొన్నిసార్లు గాయాలు ఏర్పడిన అవయవాలను కూడా తీసేయాల్సి వస్తుంది. పుదీనా నూనె, సిన్నమాల్డిహైడ్‌లున్న ఈ ఔషధం గాయాల్లో ఉండిపోయిన మట్టిని పూర్తిగా తొలగిస్తుంది. ‘‘ఈ క్యాప్సూల్స్‌ చికిత్స ద్వారా నాలుగు రకాల బ్యాక్టీరియాలను, ఇతర క్రిములను నాశనం చేయవచ్చు. అలాగే గాయాలు మానడంలో తోడ్పడే ఫైబ్రోబ్లాస్ట్స్‌ అనే శరీర కణాల ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది’’ అని పరిశోధకులు చెబుతున్నారు.





  • జీర్ణ సంబంధ సమస్యలకు దాల్చిన చెక్క మందుగా పనిచేస్తుంది. దీనిలోని పీచుపదార్థం కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు ఆకలిని పెంచుతుంది.
  • దాల్చిన చెక్కనూనె ఒంటికి రాసుకుంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.
  • దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్త సరఫరా సవ్యంగా జరిగేలా చూస్తాయి.
  • వీటిలోని సిన్నమాల్దిహైడ్‌, నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి, తాజా శ్వాసను ఇస్తుంది. దాల్చిన చెక్కను నీళ్లలో వేసి, మరిగించి, ఆ నీటిని
  • మౌత్‌వా్‌షగా ఉపయోగించొచ్చు.
  • వీటిలోని ప్రొటీన్లు చర్మం మీది ముడతల్ని నివారించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమం ముఖానికి
  • తాజాదనాన్ని ఇస్తుంది.
  • దాల్చినచెక్కను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తపీడనం అదుపులో ఉంటుంది. చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. టైప్‌ 2 డయాబెటీస్‌ ఉన్నవారు ప్రతి రోజు టీ స్పూన్‌ దాల్చిన చెక్క పొడి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  • కొలెస్ట్రాల్‌ ఉత్పత్తికి కారణమయ్యే ఎంజైమ్‌ను నియంత్రించి, రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చూస్తుంది. గుండె సంబంధ
  • జబ్బులను నివారిస్తుంది.
  • పలు రకాల కేన్సర్ల ముప్పును దాల్చిన చెక్క నివారిస్తుంది. వీటిలోని
  • మెగ్నీషియం, కాల్షియంతో కలిసి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ పెంచి, కురులు పెరిగేందుకు తోడ్పడుతుంది. టేబుల్‌ స్పూను దాల్చినచెక్క పొడి, తేనె, కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ నూనె కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.
  • దాల్చిన చెక్క వాసన మెదడును ఉత్తేజితం చేస్తుందని, దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకుంటే పార్కిన్‌సన్స్‌, అల్జీమర్స్‌ వంటి వ్యాధుల ముప్పు తప్పుతుందని పరిశోధనల్లో తేలంది.
  • ఈ సీజన్‌లో వేధించే జలుబు, జ్వరాలను దాల్చినచెక్క నివారిస్తుంది.

Mullangi

ముల్లంగిలో నీటిశాతం ఎక్కువ. సి-విటమిన్‌తో పాటు జింక్‌, పాస్ఫర్‌సలు ఇందులో ఉంటాయి. ముల్లంగి వల్ల ఉపయోగాలేంటీ.. 
 ముల్లంగి తరచు తింటే ఇన్ఫెక్షన్లు మన జోలికి రావు. 
జీర్ణాశయంలోని వ్యర్థపదార్థాల్ని శుభ్రపరిచే గుణం వీటికి ఉంది. 
 ముక్కు, గొంతునొప్పి, దగ్గు-జలుబు లాంటివి దరిచేరకుండా ఉండాలంటే ముల్లంగి తినాలి. 
కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా ఉండి, నీటిశతం అధికంగా ఉండే ముల్లంగిని డైట్‌లో చేరిస్తే త్వరగా బరువు తగ్గుతారు. 
 గుండె, కిడ్నీ, జీర్ణాశయం సమస్యలు రాకుండా చేస్తుంది. 
 ముల్లంగిని తింటే రక్తశుద్ధి జరుగుతుంది. దీంతోపాటు శరీరంలోని వ్యర్థాల్ని పారద్రోలుతుంది. ముఖ్యంగా ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. దీనివల్ల జాండీస్‌లాంటి వ్యాధితో బాధపడేవారికి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

Friday 3 March 2017

Jonnalu

జొన్నలు ఆరోగ్యానికి మంచివని చాలామంది అంటుంటారు. అయితే అవి తినడం వల్ల ఎటువంటి పోషకాలు లభిస్తాయో చాలామందికి తెలియదు. 
జొన్నల్లో ప్రొటీన్లే కాకుండా పాస్పరస్‌, మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, జింక్‌, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, నేరేడు పండు వంటి వాటిల్లో ఉండే వాటికన్నా రెట్టింపు యాంటాక్సిడెంట్లు జొన్నల్లో ఉంటాయి. గుండెజబ్బులు, కేన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరకుండా ఈ యాంటాక్సిడెంట్లు కాపాడతాయి. మెరుగైన జీర్ణక్రియకి తోడ్పడే ఫైబర్‌ జొన్నల్లో ఎక్కువగా లభిస్తుంది. వీటిల్లో నియాసిన్‌ అనే బి-6 విటమిన్‌ కాంపౌండ్‌ ఉంటుంది. అది తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణం అయి శక్తిలా మారడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోకుండా ఉంటాయి.
 

Lavanga Tulasi

ఆహారపానీయాలలోనూ, ఔషధంగానూ ఈ మొక్కను ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కలో ప్రతీ భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క నుంచి సుగంధ పరిమళభరితమైన వాసన వస్తుంటుంది. దీనికి కారణం యూజెనాల్‌, మిథైల్‌ యూజెనాల్‌, కారియోఫిల్లీన్‌, సిట్రాల్‌, కేంఫర్‌, థైమాల్‌ వంటి ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌ ఉండటమే. ఇలాంటి అరోమాటిక్‌ తైలాల మిశ్రమాలు యాంటిసెప్టిక్‌గా పనిచేస్తాయి. లవంగ తులసి మొక్కలు ఎక్కువగా పెంచితే ఆ పరిసరాలు పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా ఉంటాయి. దోమలను పారదోలుతాయి. 
ప్రయోజనాలు
లవంగ తులసి ఆకులను కషాయంగా చేసుకుని తాగితే దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీర్ణశక్తిని కలిగించుటకు, శరీరానికి సత్తువ చేకూర్చుటకు ఉపయోగపడుతుంది.
కీళ్ల సమస్యలను, రక్తస్రావాలను నిరోధించుటకు ఉపకరిస్తుంది.
తలనొప్పి, పంటి నొప్పి, చెవిపోటు బాధలకు నివారిణిగా పనిచేస్తుంది.
చిన్న పిల్లల ఉదర సమస్యలకు దివ్యౌషధం. తేనెతో కలిపి తీసుకుంటే వాంతులు కావు.
దీని విత్తన ఔషధం విరేచనాలు, నరాల బలహీనతలు, మూత్ర సమస్యలు, చంటి పిల్లల్లో వాంతుల నివారణకు పనిచేస్తుంది.
 ఆకుల రసం వీర్యవృద్ధికి, ఎర్రరక్తకణాల పెంపుకు తోడ్పడుతుంది. 
కాలేయ వ్యాధుల నివారణకు, కాలేయ పనితనాన్ని మెరుగుపరుచుటకు ఉపయోగపడుతుంది.
దోమలను వికర్షించు శక్తి అధికంగా ఉండటం వల్ల రకరకాల ఉత్పత్తుల్లో దీనిని విస్తృతంగా వాడుతున్నారు.
షుగర్‌ వ్యాధికి తీసుకును ఔషధాల పనితనాన్ని మెరుగుపరచడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది.

Ulavalu

పాతకాలంలో వేసవి వచ్చిందంటే చాలు ఉలవ గుగ్గిళ్లు పొయ్యిల మీద సలసల ఉడికేవి. రెండు దోసిళ్ల గుగ్గిళ్లు తిని, గ్లాసుడు నీళ్లు తాగితే.. ఆ రోజుకు అదే మంచి పౌష్టికాహారం. ఇక, మరుసటిరోజు ఉలవచారు తాగితే.. ఆహా.. ఆ సంతృప్తే వేరు. ఉలవలు ఎక్కువగా తిన్నవాళ్ల ఆరోగ్యం గుర్రంలా దౌడు తీసేది అందుకే! వాటి బలం మరే గింజలకు రాదు. ప్రస్తుతం ఉడికించిన గింజలను తినే అలవాటున్న వాళ్లు.. ఏ శనగలనో, పెసరగింజలనో తినడానికి ఇష్టపడుతున్నారు కాని.. ఉలవల జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే వాటిని ఉడికించడం అంత సులభం కాదు. కాని వారానికి ఒకసారైనా మీ మెనూలో ఉలవల్ని ఎందుకు చేర్చాలో చూద్దాం. వంద గ్రాముల పిజ్జా తింటే.. అందులో పన్నెండు గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే వంద గ్రాముల ఉలవల్ని తింటే కొవ్వులు అస్సలు ఉండవు. వంద గ్రాముల ఉలవగుగ్గిళ్లలో 321 కేలరీలశక్తితోపాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు పీచుపదార్థమూ లభిస్తుంది. అదే పిజ్జాలలో అయితే - ఇంతేసి మోతాదులో పోషకవిలువలు శూన్యం. అందుకే ఉలవల విలువను ఆయుర్వేదం ఏనాడో గుర్తించింది. జ్వరం, జలుబు, గ్యాస్ట్రిక్‌, పెప్టిక్‌ అల్సర్లు, కాలేయ, మూత్రపిండ సమస్యలను తగ్గిస్తుంది ఉలవ. మహిళలలో వచ్చే బహిష్టు సమస్యకు చక్కటి పరిష్కారం వీటితో సాధ్యం. 
 
ఇక, కండరాలను పటిష్టంగా ఉంచడంతోపాటు నరాలబలహీనత రానివ్వవు ఉలవలు. వీటిని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పలు పద్ధతుల్లో వినియోగిస్తారు. ఉలవచారు, గుగ్గిళ్లు, కూరలు, లడ్డూలు, సూప్‌లు ఇలా ఈ మధ్య కాలంలో అందరినీ వేధించే అధిక బరువు సమస్యకు ఉలవలు భేషైన పరిష్కారం. నాణ్యమైన ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేగించి.. చల్లారిన తరువాత మెత్తటి పౌడర్‌లా చేయాలి. రోజూ   పరకడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే బరువు తగ్గుతారు. ఉలవల మీద ఇదివరకే బోలెడన్ని పరిశోధనలు వచ్చాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ అధ్యయనం ప్రకారం ఉలవల్లో మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉన్నట్లు తేలింది.

Thursday 2 March 2017

Cherries

చెర్రీ పండు జ్యూస్‌ను తాగడం వలన కీళ్లనొప్పులను చాలా వరకూ తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. వ్యాయామం సమయంలో వచ్చే కీళ్లనొప్పులకు మంచి ఉపశమనంగా ఈ జ్యూస్‌ పనిచేస్తుందని వారు చెబుతున్నారు. అయిుతే ఒక్కసారిగా కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉండదనీ, కనీసం నాలుగైదు వారాలపాటు ఈ జ్యూ్‌స్‌ను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలకు ఈ జ్యూస్‌చాలా బాగా ఉపయోగపడుతుందని వారు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఊబకాయాన్ని తగ్గించుకునేవారికి ఇది మందులాగా కూడా పని చేస్తుంది అని వారు అంటున్నారు.