Research suggests that ice apple is good for preventing heatstroke, and its bioactive compounds have shown anti-inflammatory and blood sugar-regulating effects. Recent studies have also identified amino acids, antioxidants, and anti-diabetic properties in ice apple’s tender fruit endosperm. Plus, it’s low in calories and high in fibre, making it a smart snack for those watching their weight.
Herbal Medicines traditionally used in India as per Ayurveda
Monday, 30 June 2025
Wednesday, 25 June 2025
Shilajit
Purified Shilajit, an Ayurvedic rasayana, was evaluated in healthy volunteers of age between 45 and 55 years for its effect on male androgenic hormone viz. testosterone in a randomised, double-blind, placebo-controlled clinical study at a dose of 250 mg twice a day. Treatment with Shilajit for consecutive 90 days revealed that it has significantly (P < 0.05) increased total testosterone, free testosterone and dehydroepiandrosterone (DHEAS) compared with placebo. Gonadotropic hormones (LH and FSH) levels were well maintained.
Friday, 20 June 2025
అరటి ఆకు
అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాలలో కొన్ని ఆహారానికి బదిలీ అవుతాయి. అలా మీరు తినే ఆహారం పోషక విలువను పెంచుతుంది.
Tuesday, 17 June 2025
బెల్లం
బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలున్నాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు. బెల్లం తినడం వల‌్ల రక్తహీనత తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజూ బెలం తినడం వల‌్ల నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు
బెల్లంలో ఉండే కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. రోజూ ఓ బెల్లం ముక్క తినడం వల‌్ల అలసటను కూడా తగ్గించుకోవచ్చు. భోజనం చేశాక ఓ బెల్లం ముక్క తింటే త్వరగా జీర్ణమవుతుంది. దాంతోపాటు స్వీట్స్ తినాలనే కోరికను కూడా తగ్గించుకోవచ్చు. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన టాక్సిన్లను వెలికితీస్తాయి.
Thursday, 12 June 2025
Flame Lilly (Telugu : adavi nabhi )
తమలపాకు
తమలపాకులో ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా తమలపాకులో క్యాల్షియం, విటమిన్ C, విటమిన్ B3, విటమిన్ B2, కెరోటిన్, క్లోరోఫిల్, టానిన్లు, యాంటీసెప్టిక్ గుణాలు వంటివి శరీరాన్ని రక్షణ కలిగించే ప్రధాన మూలకాలుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
తమలపాకులో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నుంచి రక్షిస్తాయి. తమలపాకును చిన్న చిన్న గాయాలు, పుండు వంటి చర్మ సమస్యల రుద్దినా కూడా అవి త్వరగా మానిపోతాయి. తమలపాకుతో మరిగిన నీటిని చర్మానికి రాసినా, లేదంటే, ఆ నీటితో మొఖం కడిగితే చర్మ రుగ్మతలు, చర్మ దురద, అలర్జీలు తగ్గుతాయి.
Wednesday, 11 June 2025
పిప్పలి
పిప్పలి.. దీన్ని మనం తెలుగులో పిప్పళ్లు అని కూడా పిలుస్తాం.. ఇంకా పిప్పళ్లుని ఆంగ్లంలో లాంగ్ పెప్పర్ అంటారు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పిప్పళ్లను సూపర్ ఫుడ్‌గా పేర్కొంటారు.. ఆయుర్వేదంలో పిప్పళ్లను అనేక రోగాలకు దివ్యౌషధంగా ఉపయోగిస్తుంటారు. అస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిపై పిప్పలి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కఫం, శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. దీనికి శోథ నిరోధక లక్షణాలు ఉన్నందున, ఇది నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. పిప్పళ్లను చరక సంహితలో ఒక ముఖ్యమైన ఔషధంగా వర్ణించారు.. దీనిని అనేక వ్యాధులలో ఉపయోగిస్తారు.
నల్లేరు. వజ్రవల్లి
తీగ జాతికి చెందిన వజ్రవల్లినే 'నల్లేరు, బోన్ సెట్టర్ ప్లాంట్, అస్థి సంహార' అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆయుర్వేదంలో నల్లేరును మంచి మెడిసిన్‌లా యూజ్ చేస్తుంటారు. ఎన్నో ఔషధగుణాలు కలిగిన ఇది వయసు పెరగడం ద్వారా వచ్చే నడుము నొప్పి, కీళ్ల నొప్పులకు మంచి ఔషధంలానూ పనిచేస్తుంది. కాల్షియం అధికంగా కలిగి ఉండి మార్చడంలో సహాయపడుతుంది. దగ్గు, కఫం వంటి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా నల్లేరుతో చేసుకునే ఈ పచ్చడి చాలా బాగా సహాయపడుతుంది! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి, లేట్ చేయకుండా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నల్లేరు కాడలతో మీరు ఓసారి ప్రిపేర్ చేసుకొని చూడండి.
Monday, 9 June 2025
అరటిపువ్వు
డయాబెటిస్‌కు అరటిపువ్వు దివ్య ఔషధం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. అరటిపువ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయని చెబుతున్నారు. అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచుతాయి. అరటి పువ్వులో ఉండే ఫైబర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అరటిపువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని దూరం చేస్తాయి. దీని వల్ల ఇన్‌ఫ్లమేషన్ దూరమవుతుంది. క్రోనిక్ డిసీజెస్ కూడా తగ్గుతుంది.
అరటి పువ్వులో మెగ్నీషియం అధికం అధికంగా ఉంటుంది. అరటిపువ్వులోని మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటిపువ్వులో విటమిన్ బి6లు కూడా ఉంటాయి. ఇవి ఆడవారిలో మెనుస్ట్రువల్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసి వారి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా ఇందులోని విటమిన్ ఎ, సీ, పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల సమస్యల్ని దూరం చేస్తాయి. శరీరంలోని కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
Sunday, 8 June 2025
Chinthachiguru చింత చిగురు ఆ కు లు
సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించే శక్తి చింత చి గురు ఆకుల రసంలో ఉంది. ఈ సూక్ష్మజీవి మలేరియాకు కారణమవుతుంది. చింత ఆకుల రసం తీసుకోవడం వల్ల రక్తహీనత నయమవుతుంది. దీంతో ఫ్రీ రాడికల్స్ సమస్య కూడా దూరమవుతుంది.
చింత ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ సి లోపం వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. గాయాలు లేదా చర్మ వ్యాధులపై చింత ఆకుల రసాన్ని పూయడం వల్ల అవి త్వరగా నయం అవుతాయి. దీని యాంటీసెప్టిక్ లక్షణాలు చర్మంపై రక్షణ కవచంగా పనిచేస్తాయి.
ఆకుల రసం తీసుకోవడం వల్ల పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాల నాణ్యత కూడా మెరుగుపడుతుంది. చింత చెట్టు ఆకులు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఆకులు మూత్ర నాళాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.
చింత ఆకులో ఉండే యాంటీ హైపర్‌టెన్సివ్ గుణాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. చింత ఆకుల రసం తీసుకోవడం వల్ల శరీరంలోని జీర్ణ సమస్యలను తొలగించడానికి సమర్థవంతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను బాగా ఉంచుతుంది. తరచుగా ఆకలి సమస్య తగ్గుతుంది.
Saturday, 7 June 2025
Mulbury fruits
మల్బరీ పండు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మల్బరీ పండులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C వల్ల చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఈ పండులో పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు నియంత్రిస్తుంది. ఈ పండ్లలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత ఉన్నవారికి ఉపయోగపడుతుంది. మల్బరీ ఆకు పొడి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మల్బరీ పండులోని డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీ వస్తే వైద్య సలహా తీసుకోవాలి. ఈ పండును నేరుగా తినవచ్చు. ఆకుతో కషాయం పెట్టుకోవచ్చు.
మల్బరీ పండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, ముడతలు పడడాన్ని తగ్గిస్తుంది. చూసేందుకు మల్బరీస్ చిన్నగా కనిపించినప్పటికీ, మీ బరువును తగ్గించడంలో గొప్ప మేలు చేస్తుంది.