Thursday, 12 June 2025

తమలపాకు

 తమలపాకులో ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా తమలపాకులో క్యాల్షియం, విటమిన్ C, విటమిన్‌ B3, విటమిన్‌ B2, కెరోటిన్, క్లోరోఫిల్, టానిన్లు, యాంటీసెప్టిక్ గుణాలు వంటివి శరీరాన్ని రక్షణ కలిగించే ప్రధాన మూలకాలుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

తమలపాకులో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నుంచి రక్షిస్తాయి. తమలపాకును చిన్న చిన్న గాయాలు, పుండు వంటి చర్మ సమస్యల రుద్దినా కూడా అవి త్వరగా మానిపోతాయి. తమలపాకుతో మరిగిన నీటిని చర్మానికి రాసినా, లేదంటే, ఆ నీటితో మొఖం కడిగితే చర్మ రుగ్మతలు, చర్మ దురద, అలర్జీలు తగ్గుతాయి.

No comments:

Post a Comment