బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలున్నాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు. బెల్లం తినడం వల‌్ల రక్తహీనత తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజూ బెలం తినడం వల‌్ల నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు
బెల్లంలో ఉండే కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. రోజూ ఓ బెల్లం ముక్క తినడం వల‌్ల అలసటను కూడా తగ్గించుకోవచ్చు. భోజనం చేశాక ఓ బెల్లం ముక్క తింటే త్వరగా జీర్ణమవుతుంది. దాంతోపాటు స్వీట్స్ తినాలనే కోరికను కూడా తగ్గించుకోవచ్చు. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన టాక్సిన్లను వెలికితీస్తాయి.
No comments:
Post a Comment