ఎరుపు రంగు అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లో కెరోటినాయిడ్స్, ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అందువల్లే ఈ అరటి పండ్ల తొక్క ఎరుపు రంగులో ఉంటుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వీటి తొక్కకు ఎరుపు రంగు ఉంటుంది. అందువల్ల ఎరుపు రంగు అరటి పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబు తగ్గుతాయి. శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, అంతర్గత వాపులు తగ్గుతాయి. దీని వల్ల గుండె జబ్బులు, ఇతర ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఎరుపు రంగు అరటి పండ్లలో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది.
ఈ అరటి పండ్లలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి6 ఉంటుంది. ఇది మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. క్యాలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. ఈ పండ్లలో అధికంగా ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎరుపు రంగు అరటి పండ్లలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరగకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ఎరుపు రంగు అరటి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఈ పండ్లలో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఎరుపు రంగు అరటి పండ్లలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంతోపాటు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపు రంగులో ఉండే అరటి పండ్లను తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ ఎరుపు రంగు అరటి పండ్లను తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఎందుకంటే వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటుంది. పైగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి కనుక ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా ఎరుపు రంగు అరటి పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
No comments:
Post a Comment