Monday, 9 June 2025

అరటిపువ్వు

 డయాబెటిస్‌కు అరటిపువ్వు దివ్య ఔషధం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. అరటిపువ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయని చెబుతున్నారు. అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచుతాయి. అరటి పువ్వులో ఉండే ఫైబర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అరటిపువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌‌ని దూరం చేస్తాయి. దీని వల్ల ఇన్‌ఫ్లమేషన్ దూరమవుతుంది. క్రోనిక్ డిసీజెస్ కూడా తగ్గుతుంది.

అరటి పువ్వులో మెగ్నీషియం అధికం అధికంగా ఉంటుంది. అరటిపువ్వులోని మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటిపువ్వులో విటమిన్ బి6లు కూడా ఉంటాయి. ఇవి ఆడవారిలో మెనుస్ట్రువల్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసి వారి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా ఇందులోని విటమిన్ ఎ, సీ, పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల సమస్యల్ని దూరం చేస్తాయి. శరీరంలోని కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

No comments:

Post a Comment