పియర్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
దీని వల్ల చర్మానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. చర్మం తన సాగే గుణాన్ని పొందుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మృదువుగా మారి తేమగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు.
పియర్ పండ్లలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి కనుక ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలుగా కూడా పనిచేస్తాయి.
దీని వల్ల శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. పియర్ పండ్లను కొందరు తొక్క తీసి తింటారు.
కానీఈ పండ్లను తొక్కతో సహా తినాల్సి ఉంటుంది. పియర్ పండ్ల తొక్కలోనూ అనేక పోషకాలు ఉంటాయి. కనుక ఈ పండ్లను తొక్కతో తింటే ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఇలా పియర్ పండ్లను తరచూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు
No comments:
Post a Comment