తానికాయ పొడిని వాడితే జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మూత్రాశయ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా వ్యవస్థలకు చెందిన వ్యాధులు సులభంగా తగ్గిపోతాయి. తానికాయలను లివర్‌కు సంబంధించిన ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తానికాయలను వాడితే ఆహారం సులభంగా జీర్ణమవతుంది. అజీర్తి తగ్గుతుంది. ఈ కాయలను అలర్జీలను తగ్గించే మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. తానికాయలను వాడడం వల్ల విరేచనాలు, చిన్న పేగుల వాపులు తగ్గిపోతాయి. జీర్ణ సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు నల్లగా మారుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహాయం చేస్తాయి.
తానికాయల కషాయంలో అశ్వగంధ చూర్ణం, బెల్లం కలిపి తీసుకుంటే వాతం తగ్గిపోతుంది. తానికాయలను కాస్త కాల్చి చూర్ణం చేసి అందులో కొద్దిగా సైంధవ లవణం కలిపి తీసుకుంటే విరేచనాలు క్షణాల్లో తగ్గుతాయి. తానికాయను అరగదీసి ఆ మిశ్రమాన్ని లేపనంగా రాస్తుంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి. తానికాయల పొడిలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. శ్వాస సరిగ్గా లభిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. తానికాయల పొడిలో కొద్దిగా చక్కెర కలిపి రోజూ తింటుంటే కంటి చూపు మెరుగు పడుతుంది.
తానికాయల పొడిలో తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకుంటుంటే గొంతులో నొప్పి, మంట, గొంతులో గరగర వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు బొంగురు పోయిన వారు ఈ చిట్కాను పాటిస్తుంటే ఉపయోగం ఉంటుంది. తానికాయ గింజల పప్పును రాత్రి పూట తింటే నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. తానికాయల పొడిని రోజూ తింటుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. తానికాయల పొడి, అశ్వగంధ చూర్ణం, పాత బెల్లాన్ని సమాన భాగాల్లో తీసుకుని రోజూ కాస్త మోతాదులో తింటుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. వాతం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి.
No comments:
Post a Comment