100 గ్రాముల బోడ కాకరకాయలను తినడం వల్ల సుమారుగా 30 క్యాలరీల మేర శక్తి లభిస్తుంది. ఈ కాయల్లో 80 శాతం నీరు ఉంటుంది. ప్రొటీన్లు 3 గ్రాములు, ఫైబర్ 3 గ్రాములు, విటమిన్లు సి, ఎ, బి1, బి2, బి3, బి9, పొటాషియం, ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు ఈ కాయల్లో అధికంగా ఉంటాయి. ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు సైతం వీటిల్లో అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ కాయలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. బోడకాకర కాయలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక ఈ కాయలను తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఈ కాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో శరీరం ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
No comments:
Post a Comment