మల్బరీ పండు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మల్బరీ పండులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C వల్ల చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఈ పండులో పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు నియంత్రిస్తుంది. ఈ పండ్లలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత ఉన్నవారికి ఉపయోగపడుతుంది. మల్బరీ ఆకు పొడి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మల్బరీ పండులోని డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీ వస్తే వైద్య సలహా తీసుకోవాలి. ఈ పండును నేరుగా తినవచ్చు. ఆకుతో కషాయం పెట్టుకోవచ్చు.
మల్బరీ పండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, ముడతలు పడడాన్ని తగ్గిస్తుంది. చూసేందుకు మల్బరీస్ చిన్నగా కనిపించినప్పటికీ, మీ బరువును తగ్గించడంలో గొప్ప మేలు చేస్తుంది.
No comments:
Post a Comment