Tuesday 20 December 2016

ఆస్టియో ఆర్థరైటిస్‌

శరీరంలో కదలికలను నిర్వీర్యం చేసి, కదల్లేని పరిస్థితిలో మంచానికే పరిమితం చేయగల వ్యాధి కీళ్ల నొప్పులు. ఆస్టియో ఆర్థరైటిస్‌గా వ్యవహరించే ఈ వ్యాధి ముఖ్యంగా మోకాలి కీలు, తుంటి కీలుకు వస్తుంది. సామాన్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఏర్పడే ఈ వ్యాధి కారణంగా అడుగుతీసి అడుగు వేయలేనంత దుర్భరమైన నొప్పి వేధిస్తుంది. ఆయుర్వేద వైద్యంలో ఈ వ్యాధికి                     అద్భుతమైన ఔషధాలు ఉన్నాయని అంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్‌ హనుమంతరావు.
ఆస్టియో ఆర్థరైటిస్‌ను ఆయుర్వేద శాస్త్రంలో వాత ప్రధాన వ్యాధిగా పరిగణిస్తారు. దీనిని ఆయుర్వేద ఆచార్యులు సంధివాతంగా వివరించారు. సామాన్య పరిభాషలో కీళ్లు అరిగిపోయాయి అని చెప్పుకునే ఆస్టియో ఆర్థరైటిస్‌ 40 ఏళ్లు పైబడిన వారిలో వస్తుంది. ఇందులో ఎముకలు ఒకదానితో మరొకటి ఒరుసుకుపోవడం వల్ల కీళ్ల నొప్పి వస్తుంది. 40 ఏళ్లు పైబడిన మహిళలలో ఆస్టియో ఆర్థరైటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో సరిగా నడవలేని పరిస్థితి దుర్భరంగా కనిపిస్తుంది. ఒకసారి ఆస్టియో ఆర్థరైటిస్‌ అనే సమస్య వస్తే ఇక తగ్గదనే అభిప్రాయం సరైనది కాదు.
శరీరంలో డిఫెన్స్‌ మెకానిజం ఉటుంది. దీనినే రోగ నిరోధక శక్తిగా పరిగణిస్తారు. సమస్య తీవ్రత తక్కువైతే శరీరం తనకు తాను సర్దుబాటు చేసుకుంటుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు మరమ్మతుకు వీలుకాదు. అప్పుడు మోకాలి కీలు, తుంటి కీలు ఉబ్బినట్లు అవుతాయి. కీలు లోపల ఒక సున్నితమైన పొర ఉంటుంది. దీనిని శ్లేషక కల అంటారు. అక్కడ శ్లేషక కఫం ఉత్పత్తయి దాని సంధికార్యం చేస్తుంది. వాత ప్రకోపం వల్ల శ్లేషక కఫం తగ్గి, శ్లేషక కల అరిగిపోవడం వల్ల ఈ సంధి వాతం వస్తుంది. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్‌ అంటారు.
ఆస్టియో ఆర్థరైటిస్‌ లక్షణాలు
 ఆస్టియో ఆర్థరైటిస్‌ వచ్చినప్పుడు కీళ్లు వాచి, బిగుసుకుపోయి బాధిస్తాయి. కీలు భాగాన్ని సులభంగా కదిలించలేరు. కీళ్ల దగ్గర రాపిడి ఏర్పడి శబ్దం వస్తుంది.
 వ్యాయామం చేసినప్పుడు ఆ బాధ మరింత పెరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌ పెరిగిన కొద్దీ కీళ్ల భాగాలు ఉబ్బుతాయి. ఆ వాపు వస్తూ, పోతూ ఉంటుంది. కొన్నిసార్లు నొప్పి ఎక్కువ అవుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల(ముఖ్యంగా చలికి), అలాగే శారీరక కదలికల వల్ల వేదన పెరుగుతుంది.
 ప్రారంభ దశలో బాధ, బిగుసుకుపోవడం ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్‌కి చేరిన దశలో మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా బాధ తగ్గి స్థిరపడతాయి.
పైన వివరించిన విధంగానే మెడ భాగంలో ఉండే వెన్నుపూసలో అరుగుదల లాంటి సమస్యల వల్ల గ్రీవగత వాతం(సర్వైకల్‌ స్పాండిలోసిస్‌) వస్తుంది. దీని వల్ల చేతులలో తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయి. అలాగే కటి భాగంలో ఉండే వెన్ను పూసలో మార్పుల వల్ల వచ్చే కటిశ్శూల(లంబార్‌ పెయిన్‌)ను కూడా సంధివాతంగానే పరిగణించవచ్చు.
ఆయుర్వేద చికిత్సా పద్ధతులు
ఆయుర్వేద శాస్త్రంలో ఆస్టియో ఆర్థరైటిస్‌ను మూడు పద్ధతుల ద్వారా చికిత్సించవచ్చును.
నిదాన పరివర్జనం: వ్యాధికి కారణమవుతున్న వాటిని పాటించకుండా ఉండాలి. ఉదాహరణకు పగలు నిద్రపోవడం, రాత్రి మేల్కొని ఉండటం వంటి కారణాలు వదిలిపెట్టాలి.
ఆహార నియమాలు: సరైన సమయానికి భోజనం చేయడం, తగిన వ్యాయామం చేయడం, తగిన విశ్రాంతి తీసుకోవడం చేయాలి.
ఔషధ సేవన
శమన: దోషాలను బట్టి ఔషధ సేవన. 
శోధన: పంచకర్మ చికిత్స.
స్నేహ కర్మ, స్వేద కర్మ(పూర్వకర్మలు), వమన, విరేచన, వస్తి(ప్రధాన కర్మలు), పాశ్చాత్‌ కర్మలు తీసుకోవలసి ఉంటుంది. అభ్యంగ, శిరోధార, శిరావస్తి, గ్రీవవస్తి, కటివస్తి, జానువస్తి వంటి చికిత్సలు కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Saturday 17 December 2016

Brown Rice

హె ల్తీ ఫుడ్‌  అనగానే బ్రౌన్‌ రైస్‌ పేరు గుర్తుకు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన ఫుడ్‌ ఇది. ఇందులో ఆర్గానిక్‌ బ్రౌన్‌రైస్‌కు ఎక్కువ ఆదరణ ఉంటోంది. నిజానికి బ్రౌన్‌రైస్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ సందేహాలు తీర్చడానికే  ఈ కథనం.
ఆర్గానిక్‌ ఫుడ్‌ అంటే..
పర్యావరణ అనుకూల పద్ధతుల్లో సేంద్రియ రసాయనాలు ఉపయోగించి పండించే పంటలను ఆర్గానిక్‌ ఫుడ్‌ అంటారు. ఈ పద్ధతిలో కృత్రిమ ఎరువులు, పురుగు మందులను ఉపయోగించడం జరగదు. 
ఆర్గానిక్‌ బ్రౌన్‌రైస్‌ అంటే...
పాలిష్‌ చేయని బియ్యంను బ్రౌన్‌రైస్‌ అంటారు. అంటే బియ్యంపైన ఉండే గ్రేన్‌ పొరను తొలగించడం జరగదు. ఆర్గానిక్‌ బ్రౌన్‌ రైస్‌ అంటే సేంద్రియ రసాయనాలు ఉపయోగించకుండా పర్యావరణ అనుకూల పద్ధతుల్లో పండించిన బియ్యంను పాలిస్‌ చేయకుండా ఉపయోగించడం జరుగుతుంది. 
ఉపయోగం ఏంటి?
 వైట్‌ రైస్‌తో పోల్చితే బ్రౌన్‌రైస్‌లో మాంగనీస్‌, పాస్ఫరస్‌ రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి.
 రెండున్నర రెట్లు ఐరన్‌ ఉంటుంది.
 మూడు రెట్లు విటమిన్‌ బి3 ఉంటుంది.
 విటమిన్‌ బి1 నాలుగు రెట్లు, విటమిన్‌ బి6 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
 డయాబెటిస్‌ రోగులకు సాధారణ బియ్యంతో పోల్చితే బ్రౌన్‌రైస్‌తో చాలా మేలు జరుగుతుంది. హైపర్‌గ్లైసిమిక్‌తో బాధపడుతున్న వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వైట్‌రైస్‌ తీసుకునే వారితో పోల్చితే బ్రౌన్‌ రైస్‌ తీసుకునే వారిలో 16 శాతం ఈ రిస్క్‌ తగ్గుతుంది. 
 వారంలో ఐదు లేక అంతకన్నా ఎక్కువ సార్లు వైట్‌రైస్‌ తీసుకునే వారిలో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. 
ఇందులో లభించే రైస్‌బ్రౌన్‌ ఆయిల్‌ లో బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ చాలా తక్కువగా ఉంటుంది. 
ఇందులో ఇనోసిటల్‌ హెక్సాఫాస్పేట్‌ ఉంటుంది. ఇది కేన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఇది కేన్సర్‌ను నిరోధించడంలోనే కాకుండా చికిత్సలోనూ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పాంక్రియాటిక్‌ కేన్సర్‌ చికిత్సలో బాగా ఉపయోగపడుతుంది.
అధిక రక్తపోటు, అథెరోస్ల్కెరోసిస్‌కు కారణమయ్యే ఎండోక్రైన్‌ ప్రొటీన్‌కు వ్యతిరేకంగా పనిచేయడంలో బ్రౌన్‌రైస్‌ కీలకపాత్ర పోషిస్తుంది. 
బ్రౌన్‌రైస్‌లో సెలీనియం అనే మినరల్‌ ఉంటుంది. ఇది కోలన్‌ కేన్సర్‌ రిస్క్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల కేన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
సెలీనియం, విటమిన్‌ ఇతో కలిసి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి గుండె జబ్బుల రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది. 
ఇందులో ఇన్‌సాల్యుబుల్‌ ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది గాల్‌స్టోన్స్‌ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌(ఐబీఎస్‌)ను తగ్గిస్తుంది. 
జీవక్రియల పనితీరు మెరుగుపడటానికి అవసరమయ్యే థయామిన్‌ బ్రౌన్‌రైస్‌లో పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్‌ లోపించిన వారిలో నరాల సమస్యలు , బెరిబెరి డిసీజ్‌ వచ్చే అవకాశం ఉంటుంది.
స్థూలకాయంతో బాధపడే వారు, బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్న వారు బ్రౌన్‌ రైస్‌ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఫోలసిన్‌ బ్రౌన్‌రైస్‌లో ఉంటుంది. శిశువుల్లో మెదడు ఎదుగుదల, వెన్నెముక ఎదుగుదల సరిగ్గా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. అందుకే గర్భిణిలు బ్రౌన్‌రైస్‌ తీసుకోవడం చాలా మంచిది. గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్న వారు సైతం బ్రౌన్‌రైస్‌ తీసుకోవడం వ్లల ఫలితం ఉంటుంది.
ఒక కప్పు బ్రౌన్‌రైస్‌లో రోజు తీసుకోవాల్సిన మెగ్నీషియం శాతంలో 21 శాతం లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మైగ్రేన్‌ సమస్యను అరికడుతుంది.
ఒక కప్పు బ్రౌన్‌రైస్‌లో రోజు తీసుకోవాల్సిన మాంగనీస్‌ శాతంలో 88 శాతం లభిస్తుంది. కొలెస్ట్రాలన్‌ను తయారుచేసుకోవడానికి శరీరానికి మాంగనీస్‌ అవసరం. అంతేకాకుండా సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తికి అవసరం.
బ్రౌన్‌రైస్‌ తినడం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు లభిస్తాయి. బ్రౌన్‌రైస్‌లో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్‌ యూనిక్‌గా బౌండ్‌ అయి ఉంటాయి. అంటే ప్లాంట్‌ కణాల గోడలకు అతుక్కుని ఉంటాయి. జీర్ణక్రియ జరిగే సమయంలో ఇంటెస్టినల్‌ బ్యాక్టీరియా ద్వారా రిలీజ్‌ అవుతాయి. అంటే పోషకాలు నెమ్మదిగా గ్రహించడం జరుగుతుంది. 
ఎలా తీసుకోవాలి?
బ్రౌన్‌రైస్‌ను రోజులో ఒక సారి తీసుకున్నా సరిపోతుంది. అయితే నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలి. 
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశెకు బదులుగా అరకప్పు బ్రౌన్‌రైస్‌ను తీసుకోవచ్చు. 
లంచ్‌లో సాధారణ మీల్స్‌కు బదులుగా బ్రౌన్‌రైస్‌ పలావు తినవచ్చు.
బ్రౌన్‌రైస్‌ను మష్రూమ్స్‌, వెజిటబుల్స్‌, చికెన్‌తో కలిపి తీసుకోవచ్చు. 
ఒక కప్పు బ్రౌన్‌రైస్‌, రెండు స్సూన్ల ఉప్పు, రెండు స్పూన్ల షుగర్‌, పావు కప్పు వెనిగర్‌, ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌,  ఒక కప్పు తులసి ఆకులు, ఒక కప్పు తరిగిన టొమాటో ముక్కలు, దోసకాయ, నల్లమిరియాల పొడి కొంచెం వేసుకుని సలాడ్‌గా చేసుకోవచ్చు.

Avisa

మధుమేహాన్ని అదుపు చేయడంలో.. మెదడును చురుకుగా ఉంచడంలో అవిసెలు ఎంతో ప్రభావంతంగా పని చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవిసెలకు డైలీ డైట్‌లో చోటు కల్పిస్తే గుండె అలసిపోవడం అనేది ఉండదని చెబుతున్నారు.
గుండె జబ్బులను అరికట్టడంలో అవిసెలు దివ్యౌషధంగా పని చేస్తాయని పలు పరిశోధనల్లో తేలింది.
ఇందులో ఉండే ఫైబర్‌, మాంగనీస్‌, విటమిన్‌ బి1, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్‌ మెదడు పనితీరును మెరుగుపర్చడంతో పాటు, మతిమరుపు మీ                 ఛాయలకు రాకుండా చేస్తాయి.
         రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా అవిసెలు మంచి గుణాన్ని ప్రదర్శిస్తాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంలోనూ ఇవి క్రియాశీల పాత్ర           పోషిస్తాయి. శరీరంలో షుగర్‌ లెవల్స్‌ను బ్యాలన్స్‌ చేస్తాయి.
అవిసెల్లో ఉండే కెమికల్‌ కాంపౌండ్స్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పని చేస్తూ.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటికి ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, పెద్దపేగులోని          సమస్యలను నిరోధించగలిగే శక్తి కూడా ఉంది. 
రుతుక్రమ సమయాల్లో శరీరంలో వేడిని తగ్గించడంలోనూ అవిసెలు విశేషంగా పనిచేస్తాయి.
 

Anjeera

కొన్ని పండ్లు తాజాగా తీసుకుంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ, కొన్ని పండ్లలో తాజాగా కన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపవుతాయి. అలాంటి పండ్లలో అంజీర ఒకటి. ఇవి రక్తహీనత నుంచి విముక్తి కలిగిస్తాయి. పైగా ఎండు పండ్లను ఎంతకాలమైనా నిలువ చేసుకోవచ్చు. దూర ప్రయాణాల్లోనూ వాడుకోవచ్చు. ప్రత్యేకించి అంజీర పండులో  పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం,  ఐరన్‌తో పాటు కావలసినంత  పీచుపదార్థం కూడా ఉంటుంది. పలురకాల పోషకాలతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫైటో కెమికల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇటీ వలి ‘జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్‌ కాలెజ్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌’లో ఎండు పండ్లలో అత్యధికంగా పోషకాలు ఉన్నది  అంజీరలోనేనని స్పష్టం చేశారు. తాజా పండుగా చూసినా మిగితా వాటితో పోలిస్తే అంజీరాలో ఎక్కువ పోషకాలు, ఎక్కువ కేలరీలు ఉన్నాయి.  అయితే  ప్రతి మూడు తాజా పండ్లల్లో  65 కేలరీలు ఉంటే,  ప్రతి మూడు ఎండు పండ్లల్లో 215 కేలరీలు ఉన్నట్లు తేలింది. అంజీర పండ్లను  విడిగానే కాకుండా  ఇతర పండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చు. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహర ణకు, అంజీరను, ఓట్‌మీల్‌, సల్లాడ్‌, చట్నీలు, సల్సా, బియ్యం, పాస్తా,  కలిపి తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ప్రత్యేకించి  రక్తహీనత ఒక ప్రధాన సమస్యగా సతమతం అవుతున్న వారికి అంజీర పండ్లు గొప్ప  ఔషధంగా పనిచేస్తాయి. రక్తహీనత అనగానే  ఐరన్‌ ట్యాబ్లెట్లకు సిద్ధమయ్యే వారికి ఇవి  ప్రకృతి సహజమైన అంజీర పండ్లు పరమౌషధాలే.


ప్రతి రోజూ అంజీర్‌ తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేమంటే..
 
రోగనిరోధకశక్తి: అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
 
ఇన్సులిన్‌: ఈ పండ్లలో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తంలోని ఇన్సులిన్‌ స్రావం విడుదలను సమం చేస్తుంది. దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది.
 
మొటిమలు: అత్తిపండ్లు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, చర్మం ఎర్రబారకుండా చేస్తాయి. మొటిమల్ని తగ్గిస్తాయి.
 
ఎముకలు దృఢం: వీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి.
 
అధిక బరువు: అంజీర్‌లోని పీచు ఆకలిని నియంత్రించి, అధిక బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
 
కేన్సర్‌ నుంచి రక్ష: ఈ పండ్లలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్‌లలో కేన్సర్‌ కణాల అభివృద్ధిని అడ్డుకుంటాయి.


Lemons

నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది. వంటల్లో అయితే పక్కాగా నిమ్మకాయ పడితేనే రుచి. అంతేనా మన దైనందిన జీవితంలో నిమ్మకాయ అవసరం చాలా ఉంది. ఇంతకీ నిమ్మ వల్ల కలిగే ఉపయోగాలేంటీ?
నిమ్మరసాన్ని వంటకాల్లో ఉపయోగించటం, నిమ్మకాయలతో ఊరగాయలు చేయటం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. 
నిమ్మ రసంలో ఉండే విటమిన్ల కంటే నిమ్మతొక్కలో ఎక్కువ విటమిన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  అందుకే తొక్కే కదా అని తీసి పారేయకండి. అలా చేస్తే చాలా ఆరోగ్యపరంగా చాలా కోల్పోయినట్లే. నిమ్మకాయ నుంచి రసం తీశాక ఆ తొక్కతో చర్మాన్ని క్లీన్‌ చేసుకోవచ్చు. దీని వల్ల శరీరానికి హానిచేసే ట్యాక్సిన్లు అంతమవుతాయి. ముఖ్యంగా టాక్సిక్‌ మెడిసన్స్‌కు బదులుగా నిమ్మకాయలను వాడటం ఉపయోగమని రీసెర్చ్‌లో తేలింది. నిమ్మతొక్కతో ముఖాన్ని రబ్‌ చేస్తే మట్టి తొలగిపోవటంతో పాటు చర్మం కాంతివంతమవుతుంది. కురుల ఆరోగ్యానికి నిమ్మకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది...ఇది చుండ్రు నివారిణి. 
నిమ్మకాయ క్యాన్సర్‌ నివారిణి అంటున్నారు పరిశోధకులు. ఊపిరిత్తులు, ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్సతో పాటు మరో తొమ్మిది రకాల క్యాన్సర్స్‌ను తరిమేసే అద్భుత ఔషధం నిమ్మపండే అని వారు అంటున్నారు. కీమోథెరపీ కంటే సమర్థవంతంగా నిమ్మకాయ పని చేస్తుందని పరిశోధనలో తేలింది. 
బాక్టీరియా, శిలీంధ్రాల నాశినిగా నిమ్మకాయ పనిచేస్తుంది. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్స్‌ను రాకుండా చేస్తుంది. నిమ్మరసం వల్ల బ్లడ్‌ ప్రెషర్‌ను క్రమబద్ధీకరించవచ్చు. అందుకే నిమ్మకాయల్ని దైనందిన ఆహారంలో భాగంగా చేస్తే సరి ఆరోగ్యమూ మీ సొంతం అవుతుంది.

నిమ్మ రసానికున్న సుగుణాలను లెక్కపెడితే రెండు చేతులకున్న వేళ్లు సరిపోవు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలోకి కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
మానసిక ఒత్తిళ్లను తగ్గించి, కొత్త ఉత్సాహాన్నిచ్చే శక్తి నిమ్మకు పుష్కలం.  
కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగిస్తుంది. కాలేయ జీవితకాలాన్ని పెంచుతుంది. 
నిమ్మలో దొరికినంత ‘సి’ విటమిన్‌ మరే పండులోను లభించదు. వయసుపెరుగుతున్నా చర్మాన్ని ముడుతలు పడనీయదు. మేనిఛాయ మెరుగవుతుంది. ఇది యాంటీసెప్టిక్‌గా పనిచేయడం వల్ల చర్మ సమస్యలూ దరిచేరవు. 
ఎప్పుడైనా కలుషిత నీటిని తాగినప్పుడు గొంతువాపు వస్తుంది. దీనికి సరైన విరుగుడు నిమ్మరసం. వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. 
పంటినొప్పిని తగ్గించే శక్తీ నిమ్మకు ఉంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. లెమన్‌ వాటర్‌ గమ్‌ నమిలినా ఈ ఫలితం కనిపిస్తుంది. 
నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్‌ దండిగా ఉంటాయి. చౌకధరలో దొరికే నిమ్మ ద్వారా విలువైన వీటిని పొందవచ్చు.


నిమ్మ

 రోజూ ఉదయమే గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. శరీరంలో ఏర్పడ్డ మలినాలు తొలగిపోతాయి. ముత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. మూత్రం సాఫీగా రావడానికి తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి లెమన్‌ జ్యూస్‌ అద్భుత ఔషధం. పలు రోగాలు దూరమవుతాయి. శరీరానాకి కీలక పోషకాలు లభిస్తాయి. రోజూ నిమ్మరసం తాగితే ఎలాంటి మందుల అవసరం రాదని వైద్యులు చెబుతున్నారు. నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు, సీ విటమిన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సహజసిద్ధమైన యాంటీబయెటిక్‌, యాంటీ ఫంగల్‌, యాంటి వైరల్‌ లక్షణాలు ఉండడం వల్ల పలు రకాల ఇన్‌ఫెక్షన్లు నయం అవుతాయి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం పిండి తాగితే శరీరంలో పొటాషియం లెవల్స్‌ పెరుగుతాయి. సిట్రేట్‌ స్థాయిలు కూడా మెరుగుపడతాయి. దీంతో నెమ్మదిగా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. కడుపు నొప్పి బాధించదు. శరీరంలో చేరే విషపదార్ధాలను బయటకు వెళ్లిపోతాయి. ప్రధానంగా జీర్ణాశయ సంబంధ సమస్యలు రావు, గ్యాస్‌ అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణంలాంటివి దరిచేరవు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఔషధగుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. కీళ్ల నొప్పలు ఉన్నవారికి ఇది బాగా ఉపకరిస్తుంది. మధుమేహం ఉన్న వారు నిమ్మరసం క్రమం తప్పకుండా తాగితే గ్లూకోస్‌ లెవల్స్‌ అదుపులోకి వస్తాయి. నిమ్మ ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్‌ సీ, బీ, కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. నిమ్మ రసంలో ఉప్పు కలుపుకుని పళ్లు తోముకుంటే మెరుస్తాయి. దంత సమస్యలను దూరం చేస్తుంది.



Pesalu

పెసలు భారతీయ ఆహారం. మన దేశంలో పూర్వీకుల నుంచి వీటి వాడకం ఎక్కువగా ఉంది. ఇపుడు ప్రపంచమంతా ‘మూంగ్‌దాల్‌’ అని పిలినే ఇష్టమైన స్నాక్‌ ఐటమ్‌ పెసలే. ఇంతకీ పెసలు తినటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేకూరుతుందో తెల్సుకుందాం. 
పెసలు అంటేనే వెంటనే మనకు గుర్తొచ్చేది పులగం. కూరల్లో పెసలు వాడతారు. పెసర దోసె రుచికరంగా ఉంటుంది. ప్రస్తుతం మొలకెత్తిన పెసలు, మూంగ్‌దాల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే పెసలంటే అందరికీ ఇష్టమే.
 పెసల్లో విటమిన్‌ బి, విటమిన్‌ సి, మాంగనీసుతో పాటు 
ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా పెసలు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల  వచ్చే చర్మ సమస్యలు పెసలు ఆహారంగా తీసుకోవటం వల్ల తొలగిపోతాయి. అంతేనా ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
సున్నిపిండి తయారీలో పెసలను ఉపయోగిస్తారు. దీని వల్ల చర్మంలో మృదుత్వం వస్తుంది. 
పెసలు అధికంగా ఉండే బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. పెసలు తింటే ఆరోగ్యంతో పాటు చురుకుదనం కూడా వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
వీటిలో ఐరన్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. రోజూ వారి ఆహారంలో పెసల్ని భాగం చేస్తే అనీమియా లాంటి వ్యాధులు రాకుండా చేయవచ్చు.
బరువు తగ్గాలనుకునే వారికి పెసలు అద్భుతంగా ఉపయోగపడతాయని పరిశోధకులు అంటున్నారు. రోజూ బియ్యంలోకి కాసిన్ని పెసలు కలిపి పులగం చేసుకుని తింటే ఊహించని రీతిలో బరువు తగ్గొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. 
డయాబెటి్‌సను క్రమబద్ధీకరించటానికి పెసలు ఉపయోగపడతాయి. క్యాన్సర్‌ బారిన పడకుండా చేస్తాయి.
జీర్ణం సులువుగా అయ్యేట్లు సహాయపడే ఈ ఆహారం తీసుకోవటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్స్‌ దరి చేరవు.
పెసలు తినటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు. కండరాల నొప్పి, తలనొప్పి, నీరసాన్ని తగ్గించే గుణం వీటికి ఉంది.
రోజు వారి మెనూలో పెసలు ఉండటం వల్ల శరీరంలోని అనవసరమైన కెమికల్స్‌ నాశనం అవుతాయి. కంటిచూపు  సమస్యలు దరికి చేరవు. 
 

Garlick or lellulli

వెల్లుల్లి 
వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని అనేక ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించగలదని పరిశోధనలు చెబు తున్నాయి. శతాబ్దాల తరబడి నుంచి వెల్లుల్లి వాడుతున్నారు. గ్రీకులు సైతం తమ ఎథ్లెట్స్‌తో ఒలింపిక్‌ గేమ్స్‌లో పాల్గొనడానికి ముందు వెల్లుల్లి తినిపించేవారట. ఇందులో అనేక రకాల విటమిన్లు, ఎంజైములు, సహజచక్కెరలు, విటమిన ఎ, బి, సి, ఐరన, అయోడిన, పొటాషియం, జింక్‌, సెలీనియం, కాల్షియం, మెగ్నీషియంలతో సహా అనేక ఖనిజాలు ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు: 
1. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలుంటాయి. కాబట్టి అనారోగ్యాల నుంచి ఇనఫెక్షన్ల నుంచి కాపాడగల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని చిదిమినప్పుడు ఎలిసన అనే ఔషధ పదార్థం విడుదల అవుతుంది. దీన్లో యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉన్నందున ఆర్ధరైటిస్‌, రుమాటిజం, గౌట్‌లాంటి ఇబ్బందులను తగ్గిస్తుంది.
2. దీనిలో ప్రోకారియో సజీవ బ్యాక్టీరియా, శారీరక వ్యవస్థలోని చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. అదనపు హార్మోన్లను తొలగిస్తుంది. రోజుకో వెల్లుల్లి తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదంటుంది వైద్యశాస్త్రం!
3. సాధారణంగా చాలామంది వెల్లుల్లి ఉపయోగిస్తారు కానీ, దాన్లో ఉండే ప్రయోజనాల్ని సక్రమంగా ఉపయోగించుకోవడం తెలియదు. వెల్లుల్లిని కట్‌ చేసిన వెంటనే కూరల్లోనో లేక ఇతర పదార్థాల్లోనో వేసి వండుతారు కానీ వెల్లుల్లి కట్‌ చేసిన తర్వాత కనీసం ఓ పదిహేను నిమిషాలు అలా వదిలేయాలి. దానివల్ల ఎంజైమ్‌ రియాక్షన ఉండి వెల్లుల్లిలోని ఆరోగ్యవంతమైన గుణాలు మరింతగా పెరుగుతాయి.
4. వెల్లుల్లి యాంటీసెప్టిక్‌గా పనిచేసి గాయాలు త్వరితంగా మానడానికి సహకరిస్తుంది. ఇనఫెక్షన్లతో పోరాడుతుంది. జలుబు, దగ్గులకు ఇది చక్కని ఉపాయం. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రక్తపోటు, కార్డియో వాస్క్యులార్‌ సమస్యలన్ని తగ్గించడంలో దోహదపడుతుంది. చెడు కొలస్ర్టాల్‌ను తగ్గిస్తుంది. 
5. బ్లడ్‌ క్లాటింగ్‌ సమయాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేసేలా చేస్తుంది. యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది.


వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం...
బరువు తగ్గిస్తుంది: రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము. అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.
రక్తానికి ఎంతో మంచిది: 
శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాసు రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది: మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం  మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని పొద్దున్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.
యాంటీ బాక్టీరియల్‌: వెల్లుల్లి రసం బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లను బాగా తగ్గిస్తుంది. అంతేకాదు వైరల్‌, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను అరికడుతుంది. రోజూ వెల్లుల్లి తినడం వల్ల జలుబు,దగ్గు వంటి అనారోగ్యాలు దరిచేరవు. వెల్లుల్లిలోని యాంటిబాక్టీరియల్‌ పదార్థాలు గొంతు ఇన్ఫెక్షన్లను, శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లను పోగొడతాయి. ముఖ్యంగా బ్రోంకైటిస్‌ నివారణకు వెల్లుల్లి మందులా పనిచేస్తుంది.
కాలేయంకు మంచిది: వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్‌, సెలినియం రసాయనాలు ఫ్యాటీ లివర్‌ జబ్బును ట్రీట్‌చేసే బైల్‌ అనే ఫ్లూయిడ్‌(కాలేయం ఈ ఫ్లూయిడ్‌ను ఉత్పత్తిచేస్తుంది. ఇది జీర్ణక్రియ సరిగా జరిగేట్టు సహాయపడుతుంది)ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. వెల్లుల్లిలో యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉన్నాయి. వీటిల్లో అమినోయాసిడ్స్‌, ప్రొటీన్లు కూడా ఉన్నాయని అధ్యయనాల్లో వెల్లడయింది. ఇవి కాలేయాన్ని ప్రకృతిసిద్ధమైన విష పదార్థాల నుంచి రక్షిస్తాయి.
 నొప్పి లేకుండా చేస్తుంది: వెల్లుల్లిలో యాంటి ఆర్ధైటిక్‌ ప్రొపర్టీస్‌ బాగా ఉన్నాయి. ఇవి శరీరంలోని నొప్పిని తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటిబాక్టీరియల్‌, ఎనాలజిస్టిక్‌ గుణాల వల్ల పంటి నొప్పి లాంటివి తగ్గుతాయి.
గుండెను కాపాడతాయి: రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.
బ్లడ్‌ షుగర్‌ని తగ్గిస్తుంది: వెల్లుల్లి గ్లూకోజ్‌ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని గుజ్జులా చేసి గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లతో నోట్లో వేసుకుని మింగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్‌ షుగర్‌ తగ్గుతుంది.
 కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ పది నుంచి ఆరు శాతం వరకూ తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉన్న రసాయనాలకు ఆర్టీరియల్‌ ప్లేక్‌ ఫార్మేషన్‌ కాకుండా ఆపగల సామర్థ్యం కూడా ఉంది.
లైంగిక జీవనానికీ మంచిది: రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యకరమైన లైంగిక జీవనాన్ని కొనసాగించగలుగుతారు.



వెల్లుల్లి..సర్వరోగ నివారిణి. గుండె జబ్బులకు అద్భుతమైన ఔషధం. పక్షవాతాన్ని నయం  చేస్తుంది. నరాల జబ్బులను తగ్గిస్తుంది. ఎన్నో ఉత్తమ ఔషధ గుణాలున్న వెల్లుల్లిని..మామూలుగా కూరల్లో వాడుకునే వస్తువుగానే చూస్తారు. దానికి గల వైద్య సుగుణాలు తెలియక కొందరు..తెలిసినా.. వెల్లుల్లే కదా మరి కొందరు పట్టించుకోరు.
 
ప్రయోజనం ఇలా..
వెల్లుల్లి..నోటి దుర్గంధాన్ని పోగొడుతుంది.
రక్తాన్ని, రుతురక్తాన్ని, గర్భాశయాన్ని శుద్ధి చేస్తుందని వెద్యులు చెబుతున్నారు.
 స్ర్తీలు జాగ్రత్తగా తీసుకుంటే.. నడుము, పొట్ట, ఇతర అవయవాలకు జబ్బులు రావు.
పురుషులు తింటే.. దృఢంగా, మేధావులుగా తయారవుతారు.
దీర్ఘాయుస్సు పొందుతారని చెబుతారు.
శరీరంలోని విష లక్షణాలను పోగొట్టి రక్తా న్ని, నాడీ వ్యవస్థను ఉత్తేజం చేస్తుంది.
పేగు లోపలి పొరలను సరిచేయడం ద్వారా జీర్ణవ్యవస్థను పెంచి విరేచనాలు, టైఫాయిడ్‌ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గ్లాసుడు పాలల్లో.. నాలుగు రెక్కలు వేసి రోజు తాగితే.. ఆస్తమా తగ్గుతుంది. 
న్యుమోనియా  రోగులు క్రమం తప్పకుండా వెల్లుల్లి తీసుకుంటే..  కపం తగ్గి..చక్కగా శ్వాస తీసుకోవచ్చు. ఉబ్బసం, దగ్గు, ఆయాసం తగ్గు తాయి. ఫ వెల్లుల్లితో ఎన్నో ఉపయోగాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.





Allam Ginger















అల్లం 
ఆహారానికి రుచికలిగించే పదార్థాలలో అల్లం ఒకటని చెప్పొచ్చు. ఈ మొక్క భారతతో సహా చాలా దేశాల్లో పండుతుంది. అల్లం గాఢత కలిగిన స్పైసీ అరోమాకు ప్రసిద్ధిగాంచింది. అల్లంలో మూడు శాతం సహజ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉంటాయి. 
ఆరోగ్య ప్రయోజనాలు: 
1. కడుపునొప్పి ఉబ్బరంకు అల్లం మంచి మందు. వికారం ముఖ్యంగా సముద్ర సిక్‌నె్‌సకు, మార్నింగ్‌ వీక్‌నె్‌సకు సాధారణంగా అల్లంను ఉపయోగిస్తారు. 
2. అల్లంలో యాంటీవైరల్‌, యాంటీ టాక్సిన, యాంటీ ఫంగల్‌లాంటి గుణాలున్నాయి. సాధారణ జలుబుకు చికిత్సగా వాడతారు. ఎలర్జీల చికిత్సలో సహకరిస్తుంది. 
3. యాంటీ ఇనఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఆస్టియో ఆర్థరైటిస్‌ ఇతర కండరాల వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. జీర్ణప్రక్రియలో సాయపడుతుంది. అల్సర్లు ఏర్పడకుండా కాపాడుతుంది. కొలెస్ర్టాల్‌ స్థాయిల్ని తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది.

అల్లం వంటలకు రుచిని తెచ్చిపెట్టడమే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఆ రుచిని తగ్గించటం దగ్గర్నుంచి జీర్ణక్రియ పుంజుకునేలా చేయటం వరకు రకరకాలుగా ఉపయోగపడుతుంది. దీని జౌషధ గుణాల్లో కొత్తగా మరోటి వచ్చి చేరింది. అల్లంలోని రసాయనాలు ఆస్తమా లక్షణాలు తగ్గటానికీ తోడ్పడగలవని తేలింది. ఆస్తమా బాధితుల్లో ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలు సన్నబడి శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. సాధారణంగా వీరికి గాలి గొట్టాల్లోని మృదుకండర (ఎఎస్‌ఎం) కణజాలాన్ని వదులు చేసే మందులు ఇస్తుంటారు. దీంతో శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. అల్లంలోని జింజెరాల్, షాగావోల్ అనే రసాయనాలను శుద్ధిచేసి వాడితే.. ఆస్తమా మందుల మాదిరిగానే పనిచేస్తుందని  పరిశోధకులు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో ఉండే 'పీడీఈ4డీ' అనే ఎంజైమ్ గాలిగొట్టాలు వదులయ్యే ప్రక్రియను అడ్డుకుంటుంది. అల్లంలోని రసాయనాలు ఈ ఎంజైమ్‌ను నిరోధిస్తున్నట్టు కనుగొన్నారు.




ఉల్లిపాయ 
ఉల్లిపాయల్లో చాలా రకాలున్నాయి. ఉల్లిచేసే మేలు అంతా ఇంతాకాదు. కోస్తే కన్నీరు తెప్పిస్తుందేమో కానీ మన ఆరోగ్యానికి రక్షణనిస్తుంది ఉల్లి. ఉల్లికాడలను, ఉల్లిపాయలను వివిధరకాలుగా పదార్థాలలో వాడతారు. అందులో ఉండే గాఢతను బట్టి దాని ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు 
1. జలుబు, దగ్గు, ఆస్త్మా చికిత్సల్లో దీన్ని వాడతారు. ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించే గుణాలు కూడా ఉంటాయి. 
2. వెల్లుల్లిలో ఉన్నటువంటి అనేక సల్పైడ్స్‌, ఉల్లిలోనూ ఉండి బ్లడ్‌ లిపిడ్స్‌ను, బ్లడ్‌ ప్రెజర్‌ను తగ్గిస్తాయి. గుండె సంబంఽధిత రుగ్మతల నుంచి పరిరక్షిస్తాయి. 
3. ఉల్లిపాయల్ని మరీ అతిగా తినడం వల్ల ఉదరంలో అసౌకర్యం, గ్యాస్ర్టో ఇనటెస్టినల్‌ ఇరిటేషనకు దారి తీసి, వికార, డయేరియాలకు కారణం కావచ్చు కాబట్టి మితంగా తినడం మంచిది. 

Wednesday 7 December 2016

Stone apple and its uses

వెలగపండులేని వినాయక చవితిని ఊహించలేం. గణపతికి ప్రీతిపాత్రమైన వెలక్కాయలు పాలవెల్లి అలంకారంగానూ నైవేద్యంగానూ పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే అంతకుమించిన ఔషధ గుణాలెన్నో అందులో దాగున్నాయి. అందుకే ఈ పూజా ఫలం ... అమృత తుల్యం అంటుంటారు.
 
పూజా ఫలం.. అమృత తుల్యం
ఉడ్‌ యాపిల్‌, మంకీ యాపిల్‌, కర్డ్‌ ఫ్రూట్‌.. ఇలా ఇంగ్లీష్‌లో చాలా పేర్లే ఉన్నాయి. ఏనుగులు వీటిని ఎంతో ఇష్టంగా తింటాయి. కాబట్టేనేమో ఎలిఫెంట్‌ యాపిల్‌ అనీ కూడా అంటారు. వినాయక చవితి మొదలుకుని వేసవి వరకూ ఇవి వస్తూనే ఉంటాయి. మిగిలిన పండ్ల మాదిరిగా కాకుండా కొబ్బరికాయలా దీన్ని కూడా పగుకొట్టి తినాల్సిందే. 
 
వగరు రుచి !
‘నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు’ అంటుంటారు. ఎందుకంటే బాగా వగరుగా ఉండే దీని గుజ్జు గొంతు దిగడం చాలా కష్టం. అయినప్పటికీ దీంతో చేసే పెరుగు పచ్చడి, పప్పు కూరని రుచి చూడాల్సిందే. పండిన గుజ్జు అయితే మంచి వాసన వస్తూ తీపీ పులుపూ కలిపిన రుచితో ఉంటుంది. దీన్ని బెల్లం లేదా తేనె అద్దుకుని తింటారు. కొబ్బరిపాలు కలుపుకుని మలయాళీలు అల్పాహారంగా తింటుంటారు. ఇండోనేషియన్లు, మిక్కిలి పండిపోతే జ్యూస్‌లూ, జామ్‌లూ చేస్తుంటారు. వేసవిలో నిమ్మకాయ షర్బత్‌లా ఈ జ్యూస్‌ దాహార్తిని తీరుస్తోంది.
 
పోషక భరితం..
మిగిలిన పళ్లలో మాదిరిగానే ఇందులోనూ పోషకాలకూ లోటు లేదు. 100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. 31 గ్రా. పిండిపదార్థాలూ, 2 గ్రా. ప్రొటీన్లు, బీటా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లోవిన్‌, నియాసిస్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, ఆక్సాలిక్‌, మాలిక్‌, సిట్రిక్‌ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండే మంచి మందు. వాస్కోడిగామా బృందం ఓసారి కలరా, డయేరియాలతో బాధపడుతుంటే ఈ పళ్ల గుజ్జునే మందుగా ఇచ్చారట.
 
వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది. రక్తహీనత లేకుండా చేస్తుంది. గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధికీ మంచిది.
 
ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి. 
 
అలసట, నీరసం ఆవహించినప్పుడు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. 
 
మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లకి తరుచూ ఈ పండ్లు తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. రాళ్లు కూడా తొలగిపోతాయి. 
 
బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల కాలేయ సమస్యలనూ నివారిస్తోంది. హృద్రోగులకూ మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కంటికీ మంచిది.
 
స్త్రీలు ఈ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 
 
వెలగపండు గుజ్జు వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది. ఈ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది. నోటి పుండ్లనీ తగ్గిస్తుంది. పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది. 
 
పండే కాదు.. ఈ చెట్టు బెరడూ, పూలూ, వేళ్లూ, ఆకులూ అన్నీ ఔషధభరితమే. కానీ వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన వెలక్కాయని కేవలం పూజాఫలంగా చూస్తామే తప్ప అమృత తుల్యమైన దాని ఔషధ గుణాల్ని అంతగా పట్టించుకోం. ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించం. అందుకే ఇవి చవితి సమయంలో మాత్రమే మార్కెట్లో సందడి చేస్తుంటాయి. కానీ వేసవి వరకూ ఇవి దొరుకుతూనే ఉంటాయి. మరి ఇప్పటికైనా ఈ చెట్లను చేను గట్లమీదా, బీడుపొలాల్లోనూ వేద్దాం.. మెలగపండ్ల రుచుల్నీ ఆస్వాదిద్ధాం!

Tuesday 29 November 2016

Coconut water


కొబ్బరిబొండం..... 
కొబ్బరి నీరు తాగడం ద్వారా శరీరానికి కావల్సిన పోషకాలు తొందరగా లభిస్తాయి. దీనిలో సోడియం, పొటాషియం సరైన శాతంలో ఉండటం వల్ల విరోచనాలు, వాంతులు, నీరసం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకొక్క కొబ్బరి బొండంలో సుమారు250ఎమ్‌ఎల్‌ నుంచి 500ఎమ్‌ఎల్‌ వరకు నీరు ఉంటుంది. కొబ్బరి నీటితో పాటు కొబ్బరి గుజ్జులో కూడా మనకు కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. కొబ్బరి నీరు తాగిన వెంటనే అందులో గుజ్జును సుమారు అర్ధగంట తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెపుతున్నారు.
250ఎంఎల్‌... నీటిలో ఉండే ఖనిజాలు, పోషకాలు 
ఎనర్జీ-44 క్యాలరీలు
గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌-6.25 ఎంజీ
కాల్షియం-48ఎంజీ
పొటాషియం-600ఎంజీ
సోడియం-250ఎంజీ
మెగ్నీషియం-60ఎంజీ,
సెలీనం-2-4ఎంజీ,
ఐరన్‌-0.4ఎంజీ,
విటమిన్‌ సి-5.8ఎంజీ,
ఫోలేట్స్‌-7మైక్రోగ్రామ్స్‌



  • కొబ్బరి అనగానే దాని నూనె కేశ సంరక్షిణిగా ఉపయోగపడుతుంది అన్న విషయం ఒక్కటే ఎక్కువగా స్పురిస్తుంది. కానీ, కొబ్బరికి సంబంధించిన వివిధ భాగాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా....
  • కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని (కల్కం) చిన్న కరక్కాయ పరిమాణంలో రెండు పూటలా పెరుగుతో కలిపి సేవిస్తే, మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.
  • ఐదారు చెంచాల కొబ్బరి పెంకు చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని రోజుకు రెండు సార్లు సేవిస్తే, తరుచూ మూత్రం వచ్చే దీర్ఘకాలిక ప్రవాహిక సమస్య తగ్గిపోతుంది.
  • కాస్తంత కొబ్బరి పెంకు చూర్ణాన్ని కొంచెం వాముతో కలిపి నూరి సేవిస్తే కడుపులోని పాములు విసర్జన ద్వారా పడిపోతాయి.
  • కొబ్బరి నీరు తొందరగా శక్తినివ్వడంతో పాటు ర క్తాన్ని శుద్ది చేస్తుంది. నేత్ర రోగాలను నయం చేస్తుంది.
  • కొబ్బరి పెంకు నుంచి తీసిన తైలంతో మర్థన చేస్తే పలు రకాల చర్మ వ్యాధులు తగ్గుతాయి. కొబ్బరి కోరు, కొబ్బరి పాలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి.


Sugarcane juice


రసమైనా ఇంట్లో తయారుచేసుకోగలం...ఒక్క చెరకు రసం తప్ప. దీన్ని తాగాలంటే చెరకు బండి దగ్గరికి వెళ్లాల్సిందే! కానీ రోడ్డు మీద అమ్మే చెరకురసమా! అని దీన్ని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే ఈ రసంతో ఆరోగ్యానికి ఒరిగే లాభాలు లెక్కలేనన్ని. అవేంటంటే.... 
  • దీన్లో సింపుల్‌ షుగర్స్‌ ఉండవు. కాబట్టి మధుమేహ రోగులతో సహా అందరూ నిక్షేపంగా చెరకురసం తాగేయొచ్చు.
  •  వేసవి అలసటను పారదోలుతుంది. దీన్లోని పొటాషియం, ప్రొటీన్‌, ఐరన్‌, కార్బొహైడ్రేట్లు ఇతర పోషకాలు ఎండ వల్ల కోల్పోయిన లవణాలను భర్తీ చేసి తక్షణ శక్తినిస్తాయి. 
  •  చెరకురసానికి లాక్సేటివ్‌ గుణాలుంటాయి. కాబట్టి మలబద్ధకం వదలాలంటే చెరకురసం తాగాలి. 
  •  చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి. 
  • కామెర్ల వ్యాధి తగ్గించటంలో చెరకురసం మహత్తరంగా పని చేస్తుంది. 
  •  జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్‌ను చెరకు రసం భర్తీ చేయటంలో తోడ్పడుతుంది. 
  •  మూత్రసంబంధ సమస్యలను పరిష్కరిస్తుంది. విసర్జక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 
  •  కేన్సర్‌తో పోరాడే శక్తినిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ల చికిత్సకు ఎంతో ఉపకరిస్తుంది. 
  •  శరీర బరువును తగ్గిస్తుంది. 
  •  గొంతు నొప్పి, ఫ్లూ, జలుబులను తగ్గిస్తుంది. 
  • మూత్ర విసర్జన సమయంలో మంటతో కూడిన మూత్రనాళ సంబంధ ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను పరిష్కరిస్తుంది.
  • చెరుకు 
    వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించి శరీరానికి కావాల్సిన పోషకాలను ఇవ్వడంలో చెరుకు ఎంతో తోడ్పడుతుంది. వడదెబ్బ తగిలిన వారికి, జ్వరంతో ఉన్నవారికి చెరకు రసాన్ని ఇస్తే శరీరానికి కావాల్సిన షుగర్‌, ప్రోటీన్స్‌, ఎలక్ర్టోలైట్స్‌ అందించి ఉపశమనం కలుగుతుంది. శొంటితో కానీ అల్లంతో కానీ చెరకు రసం కలిపి ఇస్తే వెక్కిళ్లు,జాండిస్‌ తగ్గుతాయి. చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల కడుపు, కిడ్నీ, గుండె, కళ్లు, బ్రెయిన్‌కు ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా చెరకు గడ తినడం వల్ల పళ్లు, దవడలు గట్టిపడతాయి.ఒక్కగ్లాసు చెరకు రసంలో 75 శాతం నీరు ఉంటుంది.
    చెరుకులో పోషకాలు 
    సుక్రోజ్‌ 11నుంచి16శాతం,
    రెడ్యూసింగ్‌ షుగర్‌ 0.4 నుంచి 2శాతం,
    మినరల్స్‌ 0.5 నుంచి1శాతం,
    ఫైబర్‌ 10 నుంచి 16 శాతం వరకు ఉంటాయి. వీటితో పాటు ప్రోటీన్‌, ఫేట్‌, కార్బోహైడ్రేట్స్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ ఉంటాయి.

Margosa or Neem ( In Telugu : Vepa) leaves, flowers, oil and shade (Botanical Name : Azadirachta indica )






































Margosa or Neem tree has played a key role in Ayurvedic medicine and agriculture since time immemorial.

 The seed contains substantial amount of essential oil, known as Margosa or neem oil.

 The bitter constituents sepearted from this oil are  nimbin, nimbinin and nimbidin.

  The main active constituent of these is nimbidin which contains Sulphur.

 The blossoms yield a glucoside, nimbosterin and a highly pungent essential oil , nimbosterol  nimbecetin and fatty acids.

 The flowers contain  a bitter substance and an irritant bitter oil.

 Then fruits contain a bitter principle, baka yanin and the trunk bark yields nimbin, nimbidin, nimbinin and an essential.

 The gum discharged by the stem/trunk of the tree is a stimulant and tonic with a soothing effect on the skin and mucous membranes.

 Skin Disorders:

The leave applied externally, are very useful in skin diseases. They are especially beneficial in the treatment of boils, chronic ulcers, eruptions of smallpox, syphilitic sores, grandular swellings and wounds. They can be used either as a poultice, decoction or liniment.

 

An ointment prepared from neem leaves is also is very effective in healing ulcers and wounds. This ointment is prepared by frying 50 grams of leaves in 50 grams of pure cow ghee and mashing the mixture thoroughly in the same ghee till an ointment consistency is obtained.

 

A paste prepared from   the neem tree bark, by rubbing it in water, can also be applied on wounds.

 

వేప చెట్టు నీడ ఎంత చల్లగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నీడతోపాటు వేప చెట్టు గాలి, పూత, కాయలు, ఆకులు, బెరడు...ఇలా వేప చెట్టుకు సంబంధించిన ప్రతిదీ ఆరోగ్యకరమే! కాబట్టి చేదుగా ఉంటుంది కదా అని తేలికగా చూడకుండా వేప కాయలు, విత్తనాల నుంచి తీసిన నూనెను ఆరోగ్య ప్రయోజనాల కోసం వినియోగించాలి.

ఆరోగ్యపరమైన ప్రయోజనాలు 
  • పరగడుపునే రోజుకి 10 వేపాకులు తింటే మధుమేహం అదుపులోకి వస్తుంది.
  • వేప నూనెతో మర్దన చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
  • నాలుగు కప్పుల నీళ్లలో ఒక కప్పు వేప బెరడును మరిగించి ఆ నీళ్లను కాలిన మచ్చలపై పూస్తే కొద్ది రోజులకు మచ్చలు మటుమాయమవుతాయి.
  • వేప పూలను నూరి ఆ ముద్దతో తలకు పట్టు వేస్తే తలనొప్పి తగ్గుతుంది.
  • కొన్ని చుక్కల వేప ఆకుల రసం చెవిలో పోస్తే చెవి పోటు తగ్గుతుంది.
  • ఒక టీస్పూను వేప బెరడుకు రెండు టీస్పూన్ల బెల్లం కలిపి తీసుకుంటే మొలలు తగ్గుతాయి.
  • ఒక టీస్పూను వేపాకు పొడిని తింటే అసిడిటీ తగ్గుతుంది.
  • సౌందర్య సాధనాలలో...
  • వేప నూనె యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి వెంట్రుకల సమస్యలున్నవాళ్లు వేప నూనెలో కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి వెంట్రుకల కుదుళ్లకు పట్టించి తలస్నానం చేయాలి.
  • ఎగ్జీమా, రింగ్‌ వార్మ్‌, సోరియాసిస్‌ మొదలైన చర్మ వ్యాధులకు చక్కని విరుగుడు వేప నూనె. ఈ సమస్యలున్నవాళ్లు ప్రతిరోజూ వేప నూనెను సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి.
  • వేప నూనె చుండ్రును నివారిస్తుంది. కాబట్టి తలస్నానానికి ముందు ఈ నూనెను తలకు పట్టించి మర్దనా చేయాలి.
  • మొటిమలు తగ్గాలంటే వాటిమీద వేప నూనె పూయాలి.



మనదేశంలో సులువుగా, విరివిగా దొరికే చెట్లలో వేపచెట్టు అగ్రస్థానం. వేపచెట్టు బెరడు, ఆకులు, విత్తనాలు, జిగురు, వేర్లు .. ఇలా అన్నీ ఉపయోగకారకాలే. అందుకే వేపచెట్టును సర్వరోగ నివాణి  అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఉపయోగాలేంటంటే...
వేపచెట్టుది ఆయుర్వేదంలో ప్రథమస్థానం. ‘ఒన్‌ ట్రీ ఫార్మసీ’ అని కూడా అంటారు. ఈ చెట్టు ద్వారా ఎక్కువ శాతం  అనారోగ్యసమస్యలను పారద్రోలవచ్చు.
వేపపుల్లతో పండ్లుతోమటం అనాదిగా వస్తున్న ఆచారం. భారతదేశంలో ఇప్పటికీ చాలా చోట్ల ఈ పద్ధతి కనిపిస్తుంది. చేదు వేప పుల్లతో రోజు ఆరంభిస్తే తీపి ఫలితాలే.
వేపాకు యాంటీ బ్యాక్టీరియల్‌. సబ్బుల్లో విరివిగా ఉపయోగిస్తారు. దీని వల్ల బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు శరీరానికి హానిచేయవు.
వేపాకు ఫంగస్‌ నివారిణిగా పనిచేస్తుంది.
వేపాకు తల్లోని చుండ్రుని తొలగిస్తుంది. వేపాకు పేస్టు జుట్టు కుదుళ్ళలోకి వెళ్ళి స్ట్రాంగ్‌ హెయిర్‌తో పాటు జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది.
అంతెందుకూ రోజూ రెండు లేదా మూడు వేపాకులు తినటం వల్ల కడుపులో హానికలిగించే సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి.
 వేపాకు వాడటం వల్ల చర్మసంబంధ వ్యాధులు రావు. శరీరంపై పొక్కులు, మంటపుట్టడం ఉంటే  వేపాకుతో చక్కటి ఉపశమనం లభిస్తుంది.
దీని వ్లల గాయాలు, ఇన్‌ఫెక్షన్స్‌ నయమవుతాయి.
చర్మం ఎర్రబడటం, ఇరిటేషన్‌, దురద ఉంటే వేపనూనె వాడితే సమూలంగా తగ్గిపోతాయి. వేపాకుతో మొటిమల్ని   నిర్మూలించవచ్చు.
వేపాకు చక్కటి గ్యాస్ట్రో ప్రొటిక్టివ్‌గా పనిచేస్తుంది.
వేపాకు, వేపకాయల్ని సహజ ఎరువుగా ఉపయోగించవచ్చు. మొక్కల తెగుళ్ళని అంతమొందించి, మంచి పంటను తీయవచ్చు.
రోగనిరోధకశక్తిని మెరుగుపరిచే అత్యద్భుతమైన ఔషధంగా వేపాకు పనిచేస్తుంది.



నలభై రకాల వ్యాధుల నివారిణి.. వేప. సమ శీతోష్ట వాతావరణం కలిగి ఉండే భరతఖండమే దీని పుట్టిల్లు. వేప బెరడు, ఆకు, పువ్వు, పండు.. ఇలా తన సర్వస్వాన్ని మనిషి ఆరోగ్యం కోసం ధారపోసే సర్వరోగ నివారిణి. మనిషికి, వేప చెట్టుకు ఉన్న బంధం ఈ నాటిది కాదు. ‘పగటిపూట వేపచెట్టు కింద నిద్రించినవాళ్లు ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తారు.’ అని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలోనే వేప గొప్పతనాన్ని చెప్పాడు చరకుడు. పళ్లు తోముకునే పుల్ల నుంచి సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీ దాకా వేప ఉండాల్సిందే. అంతేనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కేన్సర్‌ మహమ్మారిని సైతం మట్టుబెట్టే సుగుణవంతురాలు వేప అని హైదరాబాదీ శాస్త్రవేత్తలు తేల్చారు.
వేపాకుల్లో, పువ్వుల్లో ఉండే నింబోలైడ్‌ అనే రసాయనం.. పలు రకాల కేన్సర్‌ కణితులను తుత్తునీయలు చేస్తుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ పరిశోధకులు తెలిపారు. నింబోలైడ్‌కు కేన్సర్‌ను అంతమొందించే లక్షణాలు ఉన్నాయని 2014లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రసాయానాన్ని కేన్సర్‌ ఉన్న ఎలుకలకు నోటి ద్వారా అందించగా ఫలితం అందలేదని, అదే మందు రూపంలో నరాల్లోకి ఎక్కించి పరీక్షించగా కేన్సర్‌ కణితులు మాయమైనట్లు వివరించారు. దీన్ని మనుషుల్లోనూ పరీక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు


చర్మసంరక్షణలో: వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి. ఇవి ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చలను, మొటిమలను నివారిస్తాయి. వర్షాకాలంలో దద్దుర్లు, దురద, మంటతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల బారి నుంచీ చర్మానికి రక్షణ కల్పిస్తాయి.
చుండ్రుకు చెక్‌: వర్షాకాలంలో తలలో పీహెచ్‌ సమతుల్యత దెబ్బతిని జుట్టు ఆయిలీగా, జిడ్డుగా తయారవుతుంది. ఫలితంగా చుండ్రు పెరుగుతుంది. ఇలా చుండ్రుతో బాధపడు తున్నవారు వేప ఆకుల చూర్ణాన్ని తలకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. జుట్టు బలంగా అవుతుంది. జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది.
రక్తాన్ని శుద్ధిచేస్తుంది: వేపలో సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధిచేయడంలో తోడ్పడుతాయి. కాలేయం, మూత్రపిండాల నుంచి వ్యర్థపదార్థాలను, హానికర పదార్థాలను బయటకు పంపించడంలోనూ సహాయపడుతాయి. రోజూ కొద్ది మోతాదులో వేప కషాయాన్ని తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవడమే కాకుండా రక్తంలో చక్కెర నిల్వలు, బీపీ కూడా నియంత్రణలో ఉంటాయి.
జీర్ణవ్యవస్థ పనితీరులో: కడుపులో దేవినట్లవడం, తేన్పులు రావడం వంటి సమస్యలతో బాధ పడుతున్నవారు వేప కషాయాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
చిగుళ్ల రక్షణలో: చాలా టూత్‌పేస్టులలో, మౌత్‌వాష్‌లలో వేప ఉంటున్న విషయం తెలిసిందే. వర్షాకాలంలో చల్లటి గాలుల వల్ల దంతాలు సున్నితంగా మారుతాయి. అయితే వేపలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ గుణాలు ఉంటాయి. ఇవి చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని నిరోధించడమే కాకుండా చిగుళ్లకు సంబంధించిన ఇతర సమస్యలను నివారిస్తాయి.




Miriyalu



  • మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది.

  •  వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం.. రొమ్ము కేన్సర్‌ కణితి ఉన్న వారిలో అది పెరిగే వేగాన్ని నియంత్రిస్తుంది. 
  •  ఆహార పదార్థాల్లో వీటి పొడిని చే రిస్తే, చెమట, మూత్ర విసర్జన బాగా జరిగి శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటికి వె ళ్లిపోతాయి.

  •  మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి. 
  • వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది. 
  •  మిరియాలకు జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆసిడ్‌ను వృద్ధి చేసే శక్తి ఉంది. దీనివల్ల జీర్ణశక్తి చక్కబడుతుంది. 
  •  కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలా వరకు త గ్గుతుంది. 
  •  విశేషించి వీటిల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్‌ అంశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌, బ్యాక్టీరియాల కారణంగా వచ్చే పలు వ్యాధులకు అడ్డుకట్ట వేస్తాయి. 
  • దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది.సాధారణంగా గొంతు ఇన్ఫెక్షన్‌, దగ్గుతో బాధపడుతున్నప్పుడు మిరియాల కషాయం చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఆ బాధలను తొలగించడంతోపాటు మెటబాలిజమ్‌ను మెరుగుపరిచే శక్తి కూడా మిరియాలకు ఉందట. ఇందులో ఉండే పైపెరీన్‌ అనే రసాయన సమ్మేళనం చెడు కొవ్వును కరిగిస్తుందట.



మిరియాల చారు కాచారా? గారెల్లో మిరియాలు నూరి వేశారా? దద్దోజనంలో మిరియాలు నల్లగా మెరిసిపోతుంటాయే? ‘పొంగల్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! ముద్ద ముద్దకూ రెండు మిరియాలు పంటి కింద నలగాల్సిందే! పండగపూట పొద్దున్నే ఈ మిరియాల గోలేమిటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం! పండగక్కే కాదు... ప్రతి రోజూ ఆహారంలో మిరియాలు ఏదోరూపంలో తినండి. ఇది ఊబకాయాన్ని దూరం చేసే దివ్యౌషధం! కొవ్వును కరిగించే మహత్తరమైన మందు! తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది.
ఎస్వీయూ బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ విభాగాలతోపాటు హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సంయుక్తంగా ఈ అధ్యయనం చేశాయి. ఆ విశేషాలు లండన్‌కు చెందిన ‘న్యూట్రిషన్‌ అండ్‌ మెటబాలిజం’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అధిక బరువు ఒంటరిగా ఉండలేదు. కొన్నాళ్లకు షుగర్‌, రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌ను తోడు తెచ్చుకుంటుంది. అందుకే... బరువు ఎక్కకూడదు. ఎక్కిన బరువును వెంటనే దించేసుకోవాలి. దీనికి సంబంధించి ఎస్వీయూ పరిశోధకులు అల్బినో ఎలుకలపై మిరియాల ప్రయోగం చేశారు. కొన్ని ఎలుకలకు ఊబకాయం వచ్చేలా చేశారు. వాటిని మూడు బృందాలుగా విభజించి... మొదటి గ్రూపులోని ఎలుకలను అలా వదిలేశారు. రెండో గ్రూపులోని ఎలుకలకు మిరియాలను నిర్దిష్ట పరిమాణంలో ఆహారంతోపాటు ఇచ్చారు.


నల్ల మిరియాల (బ్లాక్‌పెప్పర్‌)ను మసాలాగానే కాకుండా వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల అవి కేలరీలు బర్న్‌ చేసి, కొత్త ఫ్యాట్‌ సెల్స్‌ రాకుండా చూస్తాయని’ అంటున్నారు న్యూట్రిషనిస్టులు. నల్ల మిరియాల్లో విటమిన్‌ ఎ, సి, కెలతో పాటు మినరల్స్‌, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్‌ సహజసిద్ధమైన మెటబాలిక్‌ బూస్టర్‌గా పనిచేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. క్లినికల్‌ డైటీషియన్‌, న్యూట్రిషనిస్టులైన మామీ అగర్వాల్‌, మెహర్‌ రాజ్‌పుత్‌ వీటిని ఎలా వాడొచ్చో వివరిస్తున్నారు.
  • సాధారణంగా మిరియాలు ఘాటుగా ఉంటాయి. ఆ ఘాటును భరించగలం అనుకునేవాళ్లు ప్రతీరోజూ ఉదయం ఒకటీ రెండు నల్ల మిరియాలను నేరుగా నోట్లో వేసుకుని చప్పరించవచ్చు. ఇలా చేస్తే శరీరంలోని మెటబాలిజం క్రమబద్ధం అవుతుంది.
  • నల్ల మిరియాల పొడిని టీలో వేసుకుని తాగొచ్చు.
  • రోజూ తినే వెజిటబుల్‌ సలాడ్స్‌పైన వీటిని చల్లాలి. దీనివల్ల సలాడ్‌ రుచితో పాటు ఆరోగ్యం బాగుంటుంది.
  • చల్లదనం కోసం చేసే మజ్జిగపైన, పుదీనా, నిమ్మరసంతో చేసే జ్యూస్‌పై కూడా కొద్దిగా బ్లాక్‌పెప్పర్‌ను చిలకరించి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • గ్లాసు నీటిలో ఒక చుక్క ఒరిజినల్‌ బ్లాక్‌పెప్పర్‌ ఆయిల్‌ను వేసుకుని ఉదయం అల్పాహారానికి ముందు తాగితే బరువు తగ్గాలనుకునేవారికి ఫలితం కనిపిస్తుంది. ఈ ఆయిల్‌ను సలాడ్‌ డ్రెస్సింగ్‌గా కూడా వాడొచ్చు.
  • ఇవి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను పెంపొందించి, శరీరంలో కొత్త ఫ్యాట్‌ సెల్స్‌ను తగ్గిస్తాయి. అందుకే సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను డైట్‌లో చేరిస్తే మంచిది.

Pine apple



పులపుల్లగా, తీయగా అదోరకమైన రుచిని అందించే పైనాపిల్‌ను తినడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇందులోని విశేషాలు తెలుసుకుంటే మాత్రం ఈ సమ్మర్‌లో కూల్‌గా లాగించేయాలనిపిస్తుంది. ఇంట్లో చేసుకునే స్మూతీలు, జ్యూస్‌లలో పైనాపిల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. వేసవిలో ఎండలవేడికి జీర్ణవ్యవస్థ అదుపు తప్పుతుంది. అటువంటి పరిస్థితులను చక్కదిద్దే ఎంజైమ్‌లను వృద్ధి చేసే మంచి గుణం పైనాపిల్‌కు ఉంది. బ్లడ్‌క్లాట్స్‌ను రాకుండా కాపాడేందుకు ఉపకరిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్‌గాను ప్రముఖపాత్ర పోషిస్తుంది. శరీరంలోని వాపులను తగ్గించే శక్తి దీనికి ఉంది. ఇందులోని అత్యధిక పీచు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. తద్వార కొవ్వు బాగా తగ్గుతుంది. 




పైనాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ శాతం ఎక్కువ. ఫైబర్‌, కార్బొహైడ్రేట్స్‌ ఉండే పైనాపిల్‌ తింటే సులువుగా జీర్ణమవుతుంది. ఇంతకీ పైనాపిల్‌ వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకుందాం.
కాల్షియం, మాంగనీస్‌ అధికంగా ఉండే ఈ పండు తింటే దంతాలు, ఎముకలకు బలం.
వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.
కీళ్లనొప్పులు తగ్గిపోతాయి. చర్మంపై ఉండే గాయాలు త్వరగా మానిపోతాయి.
విటమిన్‌ ఎ అధికంగా ఉండటం వల్ల పైనాపిల్‌ కళ్లకూ మంచిదే.
దగ్గు, జలుబు దరికి చేరవు.
శరీరంలోని కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు పైనాపిల్‌ తింటే చర్మసౌందర్యం కూడా వస్తుంది.

రోజుకు వందగ్రాములు మాత్రమే పైనాపిల్‌ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ లాగిస్తే మాత్రం వాంతులు, తలనొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశముంది.





Jeera



ప్రతీరోజూ మనం వండుకునే పప్పు లేదా ఇతర కాయగూర వంటల్లో జీలకర్రను కలుపుతాం. కేవలం ఫ్లేవర్‌ కోసమే దీనిని కలుపుతారని చాలా మంది అనుకుంటారు. కాని దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యం కలగడం ఖాయం. ముఖ్యంగా బరువు తగ్గించడంలో జీలకర్ర గణనీయమైన పాత్ర పోషిస్తుందట.
శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించ గల సత్తా జీలకర్రకు ఉందట. జీలకర్రలో ‘థైమోల్‌’ అనే రసాయనంతోపాటు ఉండే కొన్ని ముఖ్యమైన ఆయిల్స్‌ శరీరంలో ఉండే కొవ్వును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయట. అలాగే జీర్ణప్రక్రియను సులభతరం చేస్తాయట.
ఒక గ్లాస్‌ నీటికి ఒక టీ స్పూన్‌ జీలకర్ర కలిపి వేడి చేయాలి. ఆ నీరు బ్రౌన్‌ కలర్‌లోకి మారిన తర్వాత దాన్ని తిరిగి చల్లబర్చి తాగాలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగితే డైజేషన్‌ సులభంగా అవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడం కూడా సులభమవుతుంది.


ఆహరమే ఔషదమని మన పెద్దవాళ్లు చెప్పారు. రోజు మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. కానీ, మనం తీసుకునే ఆహారంపై మనం ఏమాత్రం శ్రద్ధపెట్టకుండా ఏది దొరికితే దాంతో ఆ పూటకి కడుపునింపుకోవాలని చూస్తుంటాం. ఈ ఆధునిక కాలంలో ఇంతకన్నా గత్యంతరం లేదన్నట్టుగా భావిస్తాం. కానీ, తీసుకునే ఆహారం మీద శ్రద్ధలేకపోయినా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, అలాంటివి తిన్న కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని బెంగుళూరు చెందిన డాక్టర్ అంజుసూద్ చెబుతున్నారు. రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒక గ్లాసు జీలకర్ర కలిపిన గోరువెచ్చని నీటిని తాగమని ఆమె సూచిస్తున్నారు. ఎందుకంటే జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియని ఉత్తేజపరుస్తాయని ఆమె చెప్పారు. దాని వల్ల ఇంకా చాలా ఉపయోగలున్నాయంటున్నారమే. ముఖ్యంగా గర్భిణులు ఇలా తాగడం వల్ల క్షీర గ్రంథులు ఉత్తేజం చెందుతాయంటున్నారు. అంతేకాకుండా మలబద్ధక సమస్య నుంచి కూడా బయటపడవచ్చని ఆమె చెప్పారు. అలాగే డయాబెటిక్ పెషెంట్లు ఇలా తాగడం షుగర్ అదుపులో ఉంటుందంటున్నారు. అంతేకాదు బి.పి.ని కూడా అదుపు చేసే గుణాలు జీలకర్రకు ఉన్నాయంటున్నారు. జీలకర్రలో ఐరన్, ఫైబర్‌లు అధికంగా ఉండటం వల్ల గర్భిణులు ఇలాంటివి తాగడం మంచిందంటున్నారు. అలాగే రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుందంటున్నారు. మూత్రపిండాలు ఎక్కువగా ప్రభావం చెందుతాయని అందువల్ల అనవసరమైన టాక్సిన్లు బయటకు పంపేందుకు సహాయపడుతుందని  చెప్పారు. 

బరువు తగ్గడానికి కొందరు భారీ కసరత్తులు చేస్తుంటారు. ఇంకొందరు అనేకానేక డైట్‌ ప్లాన్‌లు ఆచరిస్తూ ఉంటారు. అయితే ‘వెయిట్‌ లాస్‌’ మెనూలో జీలకర్ర (జీరా) కూడా ఒకటని అంటున్నారు డైటీషియన్లు. ప్రతిరోజూ తప్పకుండా ఏదో ఒక రూపంలో జీరాను తీసుకుంటే బరువు తగ్గొచ్చంటున్నారు. వంటింటి మసాలాల్లో కామన్‌గా కనిపించే ఈ దినుసుతో ఎన్నో లాభాలున్నాయి. అవేమిటంటే...
జీరాలో పొటాషియం, మాంగనీస్‌, ఐరన్‌, ఫైబర్‌ అధికంగా లభిస్తుంది. ‘‘అధిక న్యూట్రీషన్లు ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు వాటితో జీరా కూడా జతకలిస్తే, త్వరగా జీర్ణం అవుతుంది. ఒకరకంగా ఇది చ్యవన్‌ప్రాశ్‌లాగా పనిచేస్తుంది’’ అంటున్నారు హెల్త్‌కేర్‌కు చెందిన మహేష్‌ జయరామన్‌. జీర్ణప్రక్రియ సరిగా ఉంటే శరీరానికి ఎలాంటి ఇబ్బందులుండవు. అందుకు జీరా చక్కగా తోడ్పడుతుంది కాబట్టి కొవ్వు నియంత్రణలో ఉంటుంది.
జీరాలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అది శరీరంలోని అన్ని కణాల కదలికకు తోడ్పడుతుంది. శరీరంలో ఉండే అత్యధిక నీరు వల్ల ఊబకాయం వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ఈ నీటి నిల్వలను జీలకర్ర చక్కగా నియంత్రిస్తుంది.
జీరాలో ‘థైమోల్‌’ అనే కాంపౌండ్‌ ఉంటుంది. ‘ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మెటబాలిజాన్ని, బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ)ని ఒక క్రమపద్ధతిలో ఉంచడానికి థైమోల్‌ ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది’ అని ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయి అంబానీ హాస్పిటల్‌ చీఫ్‌ డైటీషియన్‌ భక్తి సామంత్‌ అంటున్నారు.
ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే కడుపులో మంట తగ్గినట్టే, జీరా రసాన్ని తాగినా కూడా అదే ఫలితం ఉంటుంది. కడుపులోని రసాయనాలు మనం తిన్న ఆహారాన్ని వేగంగా షుగర్‌గా మారుస్తాయి. అయితే జీరా తీసుకుంటే అది రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ను నియంత్రిస్తుంది.
డైట్‌లో ఎలా తీసుకోవాలి?
సహజంగానే భారతీయ వంటకాలలో జీరాను వాడతారు. రెగ్యులర్‌ డ్రింకింగ్‌ వాటర్‌కు బదులుగా జీరా నీటిని కూడా తీసుకోవచ్చు. ఒక స్పూను జీరాను గ్లాసు నీటిలో ఉడికించాలి. గ్లాసు నీళ్లు అరగ్లాసు అయ్యేదాకా ఉడికించవచ్చు. ఆ నీటిని ఉదయమే తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుచి కోసం ఆ నీటిలో కాస్త తేనె కూడా కలపొచ్చు. కడుపులో గ్యాసును పెంచే ఆలూ వంటివి వండినప్పుడు ఆ వంటకాలలో కాస్త జీరా కలిపితే మంచిది.

చల్లటి మజ్జిగపై జీరా పొడిని చిలకరించి తాగొచ్చు. భోజనంలో తీసుకునే పెరుగులో వేగించిన జీలకర్రను చల్లి తినొచ్చు. పిండిలో జీలకర్ర పొడిని కలిపి చేసిన చపాతీలు కూడా ఆరోగ్యకరమే.