Saturday, 17 December 2016

Anjeera

కొన్ని పండ్లు తాజాగా తీసుకుంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ, కొన్ని పండ్లలో తాజాగా కన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపవుతాయి. అలాంటి పండ్లలో అంజీర ఒకటి. ఇవి రక్తహీనత నుంచి విముక్తి కలిగిస్తాయి. పైగా ఎండు పండ్లను ఎంతకాలమైనా నిలువ చేసుకోవచ్చు. దూర ప్రయాణాల్లోనూ వాడుకోవచ్చు. ప్రత్యేకించి అంజీర పండులో  పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం,  ఐరన్‌తో పాటు కావలసినంత  పీచుపదార్థం కూడా ఉంటుంది. పలురకాల పోషకాలతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫైటో కెమికల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇటీ వలి ‘జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్‌ కాలెజ్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌’లో ఎండు పండ్లలో అత్యధికంగా పోషకాలు ఉన్నది  అంజీరలోనేనని స్పష్టం చేశారు. తాజా పండుగా చూసినా మిగితా వాటితో పోలిస్తే అంజీరాలో ఎక్కువ పోషకాలు, ఎక్కువ కేలరీలు ఉన్నాయి.  అయితే  ప్రతి మూడు తాజా పండ్లల్లో  65 కేలరీలు ఉంటే,  ప్రతి మూడు ఎండు పండ్లల్లో 215 కేలరీలు ఉన్నట్లు తేలింది. అంజీర పండ్లను  విడిగానే కాకుండా  ఇతర పండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చు. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహర ణకు, అంజీరను, ఓట్‌మీల్‌, సల్లాడ్‌, చట్నీలు, సల్సా, బియ్యం, పాస్తా,  కలిపి తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ప్రత్యేకించి  రక్తహీనత ఒక ప్రధాన సమస్యగా సతమతం అవుతున్న వారికి అంజీర పండ్లు గొప్ప  ఔషధంగా పనిచేస్తాయి. రక్తహీనత అనగానే  ఐరన్‌ ట్యాబ్లెట్లకు సిద్ధమయ్యే వారికి ఇవి  ప్రకృతి సహజమైన అంజీర పండ్లు పరమౌషధాలే.


ప్రతి రోజూ అంజీర్‌ తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేమంటే..
 
రోగనిరోధకశక్తి: అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
 
ఇన్సులిన్‌: ఈ పండ్లలో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తంలోని ఇన్సులిన్‌ స్రావం విడుదలను సమం చేస్తుంది. దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది.
 
మొటిమలు: అత్తిపండ్లు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, చర్మం ఎర్రబారకుండా చేస్తాయి. మొటిమల్ని తగ్గిస్తాయి.
 
ఎముకలు దృఢం: వీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి.
 
అధిక బరువు: అంజీర్‌లోని పీచు ఆకలిని నియంత్రించి, అధిక బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
 
కేన్సర్‌ నుంచి రక్ష: ఈ పండ్లలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి రొమ్ము, పెద్దపేగు, ప్రోస్టేట్‌లలో కేన్సర్‌ కణాల అభివృద్ధిని అడ్డుకుంటాయి.


No comments:

Post a Comment