Saturday 17 December 2016

Lemons

నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది. వంటల్లో అయితే పక్కాగా నిమ్మకాయ పడితేనే రుచి. అంతేనా మన దైనందిన జీవితంలో నిమ్మకాయ అవసరం చాలా ఉంది. ఇంతకీ నిమ్మ వల్ల కలిగే ఉపయోగాలేంటీ?
నిమ్మరసాన్ని వంటకాల్లో ఉపయోగించటం, నిమ్మకాయలతో ఊరగాయలు చేయటం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. 
నిమ్మ రసంలో ఉండే విటమిన్ల కంటే నిమ్మతొక్కలో ఎక్కువ విటమిన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  అందుకే తొక్కే కదా అని తీసి పారేయకండి. అలా చేస్తే చాలా ఆరోగ్యపరంగా చాలా కోల్పోయినట్లే. నిమ్మకాయ నుంచి రసం తీశాక ఆ తొక్కతో చర్మాన్ని క్లీన్‌ చేసుకోవచ్చు. దీని వల్ల శరీరానికి హానిచేసే ట్యాక్సిన్లు అంతమవుతాయి. ముఖ్యంగా టాక్సిక్‌ మెడిసన్స్‌కు బదులుగా నిమ్మకాయలను వాడటం ఉపయోగమని రీసెర్చ్‌లో తేలింది. నిమ్మతొక్కతో ముఖాన్ని రబ్‌ చేస్తే మట్టి తొలగిపోవటంతో పాటు చర్మం కాంతివంతమవుతుంది. కురుల ఆరోగ్యానికి నిమ్మకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది...ఇది చుండ్రు నివారిణి. 
నిమ్మకాయ క్యాన్సర్‌ నివారిణి అంటున్నారు పరిశోధకులు. ఊపిరిత్తులు, ప్రొస్టేట్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్సతో పాటు మరో తొమ్మిది రకాల క్యాన్సర్స్‌ను తరిమేసే అద్భుత ఔషధం నిమ్మపండే అని వారు అంటున్నారు. కీమోథెరపీ కంటే సమర్థవంతంగా నిమ్మకాయ పని చేస్తుందని పరిశోధనలో తేలింది. 
బాక్టీరియా, శిలీంధ్రాల నాశినిగా నిమ్మకాయ పనిచేస్తుంది. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్స్‌ను రాకుండా చేస్తుంది. నిమ్మరసం వల్ల బ్లడ్‌ ప్రెషర్‌ను క్రమబద్ధీకరించవచ్చు. అందుకే నిమ్మకాయల్ని దైనందిన ఆహారంలో భాగంగా చేస్తే సరి ఆరోగ్యమూ మీ సొంతం అవుతుంది.

నిమ్మ రసానికున్న సుగుణాలను లెక్కపెడితే రెండు చేతులకున్న వేళ్లు సరిపోవు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలోకి కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.
మానసిక ఒత్తిళ్లను తగ్గించి, కొత్త ఉత్సాహాన్నిచ్చే శక్తి నిమ్మకు పుష్కలం.  
కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగిస్తుంది. కాలేయ జీవితకాలాన్ని పెంచుతుంది. 
నిమ్మలో దొరికినంత ‘సి’ విటమిన్‌ మరే పండులోను లభించదు. వయసుపెరుగుతున్నా చర్మాన్ని ముడుతలు పడనీయదు. మేనిఛాయ మెరుగవుతుంది. ఇది యాంటీసెప్టిక్‌గా పనిచేయడం వల్ల చర్మ సమస్యలూ దరిచేరవు. 
ఎప్పుడైనా కలుషిత నీటిని తాగినప్పుడు గొంతువాపు వస్తుంది. దీనికి సరైన విరుగుడు నిమ్మరసం. వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. 
పంటినొప్పిని తగ్గించే శక్తీ నిమ్మకు ఉంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. లెమన్‌ వాటర్‌ గమ్‌ నమిలినా ఈ ఫలితం కనిపిస్తుంది. 
నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్‌ దండిగా ఉంటాయి. చౌకధరలో దొరికే నిమ్మ ద్వారా విలువైన వీటిని పొందవచ్చు.


నిమ్మ

 రోజూ ఉదయమే గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. శరీరంలో ఏర్పడ్డ మలినాలు తొలగిపోతాయి. ముత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. మూత్రం సాఫీగా రావడానికి తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి లెమన్‌ జ్యూస్‌ అద్భుత ఔషధం. పలు రోగాలు దూరమవుతాయి. శరీరానాకి కీలక పోషకాలు లభిస్తాయి. రోజూ నిమ్మరసం తాగితే ఎలాంటి మందుల అవసరం రాదని వైద్యులు చెబుతున్నారు. నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు, సీ విటమిన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సహజసిద్ధమైన యాంటీబయెటిక్‌, యాంటీ ఫంగల్‌, యాంటి వైరల్‌ లక్షణాలు ఉండడం వల్ల పలు రకాల ఇన్‌ఫెక్షన్లు నయం అవుతాయి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం పిండి తాగితే శరీరంలో పొటాషియం లెవల్స్‌ పెరుగుతాయి. సిట్రేట్‌ స్థాయిలు కూడా మెరుగుపడతాయి. దీంతో నెమ్మదిగా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. కడుపు నొప్పి బాధించదు. శరీరంలో చేరే విషపదార్ధాలను బయటకు వెళ్లిపోతాయి. ప్రధానంగా జీర్ణాశయ సంబంధ సమస్యలు రావు, గ్యాస్‌ అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణంలాంటివి దరిచేరవు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఔషధగుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. కీళ్ల నొప్పలు ఉన్నవారికి ఇది బాగా ఉపకరిస్తుంది. మధుమేహం ఉన్న వారు నిమ్మరసం క్రమం తప్పకుండా తాగితే గ్లూకోస్‌ లెవల్స్‌ అదుపులోకి వస్తాయి. నిమ్మ ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్‌ సీ, బీ, కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. నిమ్మ రసంలో ఉప్పు కలుపుకుని పళ్లు తోముకుంటే మెరుస్తాయి. దంత సమస్యలను దూరం చేస్తుంది.



No comments:

Post a Comment