Saturday, 17 December 2016

Brown Rice

హె ల్తీ ఫుడ్‌  అనగానే బ్రౌన్‌ రైస్‌ పేరు గుర్తుకు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన ఫుడ్‌ ఇది. ఇందులో ఆర్గానిక్‌ బ్రౌన్‌రైస్‌కు ఎక్కువ ఆదరణ ఉంటోంది. నిజానికి బ్రౌన్‌రైస్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ సందేహాలు తీర్చడానికే  ఈ కథనం.
ఆర్గానిక్‌ ఫుడ్‌ అంటే..
పర్యావరణ అనుకూల పద్ధతుల్లో సేంద్రియ రసాయనాలు ఉపయోగించి పండించే పంటలను ఆర్గానిక్‌ ఫుడ్‌ అంటారు. ఈ పద్ధతిలో కృత్రిమ ఎరువులు, పురుగు మందులను ఉపయోగించడం జరగదు. 
ఆర్గానిక్‌ బ్రౌన్‌రైస్‌ అంటే...
పాలిష్‌ చేయని బియ్యంను బ్రౌన్‌రైస్‌ అంటారు. అంటే బియ్యంపైన ఉండే గ్రేన్‌ పొరను తొలగించడం జరగదు. ఆర్గానిక్‌ బ్రౌన్‌ రైస్‌ అంటే సేంద్రియ రసాయనాలు ఉపయోగించకుండా పర్యావరణ అనుకూల పద్ధతుల్లో పండించిన బియ్యంను పాలిస్‌ చేయకుండా ఉపయోగించడం జరుగుతుంది. 
ఉపయోగం ఏంటి?
 వైట్‌ రైస్‌తో పోల్చితే బ్రౌన్‌రైస్‌లో మాంగనీస్‌, పాస్ఫరస్‌ రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి.
 రెండున్నర రెట్లు ఐరన్‌ ఉంటుంది.
 మూడు రెట్లు విటమిన్‌ బి3 ఉంటుంది.
 విటమిన్‌ బి1 నాలుగు రెట్లు, విటమిన్‌ బి6 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
 డయాబెటిస్‌ రోగులకు సాధారణ బియ్యంతో పోల్చితే బ్రౌన్‌రైస్‌తో చాలా మేలు జరుగుతుంది. హైపర్‌గ్లైసిమిక్‌తో బాధపడుతున్న వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వైట్‌రైస్‌ తీసుకునే వారితో పోల్చితే బ్రౌన్‌ రైస్‌ తీసుకునే వారిలో 16 శాతం ఈ రిస్క్‌ తగ్గుతుంది. 
 వారంలో ఐదు లేక అంతకన్నా ఎక్కువ సార్లు వైట్‌రైస్‌ తీసుకునే వారిలో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. 
ఇందులో లభించే రైస్‌బ్రౌన్‌ ఆయిల్‌ లో బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ చాలా తక్కువగా ఉంటుంది. 
ఇందులో ఇనోసిటల్‌ హెక్సాఫాస్పేట్‌ ఉంటుంది. ఇది కేన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఇది కేన్సర్‌ను నిరోధించడంలోనే కాకుండా చికిత్సలోనూ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పాంక్రియాటిక్‌ కేన్సర్‌ చికిత్సలో బాగా ఉపయోగపడుతుంది.
అధిక రక్తపోటు, అథెరోస్ల్కెరోసిస్‌కు కారణమయ్యే ఎండోక్రైన్‌ ప్రొటీన్‌కు వ్యతిరేకంగా పనిచేయడంలో బ్రౌన్‌రైస్‌ కీలకపాత్ర పోషిస్తుంది. 
బ్రౌన్‌రైస్‌లో సెలీనియం అనే మినరల్‌ ఉంటుంది. ఇది కోలన్‌ కేన్సర్‌ రిస్క్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల కేన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
సెలీనియం, విటమిన్‌ ఇతో కలిసి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి గుండె జబ్బుల రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది. 
ఇందులో ఇన్‌సాల్యుబుల్‌ ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది గాల్‌స్టోన్స్‌ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌(ఐబీఎస్‌)ను తగ్గిస్తుంది. 
జీవక్రియల పనితీరు మెరుగుపడటానికి అవసరమయ్యే థయామిన్‌ బ్రౌన్‌రైస్‌లో పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్‌ లోపించిన వారిలో నరాల సమస్యలు , బెరిబెరి డిసీజ్‌ వచ్చే అవకాశం ఉంటుంది.
స్థూలకాయంతో బాధపడే వారు, బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్న వారు బ్రౌన్‌ రైస్‌ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఫోలసిన్‌ బ్రౌన్‌రైస్‌లో ఉంటుంది. శిశువుల్లో మెదడు ఎదుగుదల, వెన్నెముక ఎదుగుదల సరిగ్గా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. అందుకే గర్భిణిలు బ్రౌన్‌రైస్‌ తీసుకోవడం చాలా మంచిది. గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్న వారు సైతం బ్రౌన్‌రైస్‌ తీసుకోవడం వ్లల ఫలితం ఉంటుంది.
ఒక కప్పు బ్రౌన్‌రైస్‌లో రోజు తీసుకోవాల్సిన మెగ్నీషియం శాతంలో 21 శాతం లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మైగ్రేన్‌ సమస్యను అరికడుతుంది.
ఒక కప్పు బ్రౌన్‌రైస్‌లో రోజు తీసుకోవాల్సిన మాంగనీస్‌ శాతంలో 88 శాతం లభిస్తుంది. కొలెస్ట్రాలన్‌ను తయారుచేసుకోవడానికి శరీరానికి మాంగనీస్‌ అవసరం. అంతేకాకుండా సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తికి అవసరం.
బ్రౌన్‌రైస్‌ తినడం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు లభిస్తాయి. బ్రౌన్‌రైస్‌లో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్‌ యూనిక్‌గా బౌండ్‌ అయి ఉంటాయి. అంటే ప్లాంట్‌ కణాల గోడలకు అతుక్కుని ఉంటాయి. జీర్ణక్రియ జరిగే సమయంలో ఇంటెస్టినల్‌ బ్యాక్టీరియా ద్వారా రిలీజ్‌ అవుతాయి. అంటే పోషకాలు నెమ్మదిగా గ్రహించడం జరుగుతుంది. 
ఎలా తీసుకోవాలి?
బ్రౌన్‌రైస్‌ను రోజులో ఒక సారి తీసుకున్నా సరిపోతుంది. అయితే నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలి. 
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశెకు బదులుగా అరకప్పు బ్రౌన్‌రైస్‌ను తీసుకోవచ్చు. 
లంచ్‌లో సాధారణ మీల్స్‌కు బదులుగా బ్రౌన్‌రైస్‌ పలావు తినవచ్చు.
బ్రౌన్‌రైస్‌ను మష్రూమ్స్‌, వెజిటబుల్స్‌, చికెన్‌తో కలిపి తీసుకోవచ్చు. 
ఒక కప్పు బ్రౌన్‌రైస్‌, రెండు స్సూన్ల ఉప్పు, రెండు స్పూన్ల షుగర్‌, పావు కప్పు వెనిగర్‌, ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌,  ఒక కప్పు తులసి ఆకులు, ఒక కప్పు తరిగిన టొమాటో ముక్కలు, దోసకాయ, నల్లమిరియాల పొడి కొంచెం వేసుకుని సలాడ్‌గా చేసుకోవచ్చు.

No comments:

Post a Comment