Saturday 2 June 2018

Dates Kharjur

ఖర్జూరాలు ఎంతో మధురంగా ఉంటాయి. చిన్నా, పెద్దా అందరూ వీటిని ఎంజాయ్‌ చేస్తారు. ఎన్నో స్వీట్లల్లో ‘రాణి’ అయిన ఈ ఖర్జూరాల్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవేమిటంటే...
నిత్యం ఖర్జూరాలు తింటే మలబద్ధకం సమస్య పోతుంది.
ఎముకలను దృఢపరిచే ఐదు సూపర్‌ ఖనిజాలు వీటిల్లో ఉన్నాయి.
చిన్నపేగులో తలెత్తే పలు సమస్యలను నివారిస్తాయి.
ఖర్జూరాల్లో ఖనిజాలు ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇవి మంచి డైటరీ సప్లిమెంట్‌.
వీటిల్లో ఆర్గానిక్‌ సల్ఫర్‌ ఉంది. ఇది అన్నింటిలో ఉండదు. దీనివల్ల చర్మ ఎలర్జీలతో పాటు సీజనల్‌గా తలెత్తే ఎలర్జీలు కూడా తగ్గుతాయి.
డైట్స్‌ తినడం వల్ల బరువు పెరుగుతారు. సన్నగా ఉన్నవాళ్లు లావు అవ్వాలంటే వీటిని తినొచ్చు.
వీటిల్లో షుగర్‌, పోషకాలతోపాటు అత్యవసర విటమిన్లు కూడా ఎన్నో ఉన్నాయి.
శరీరానికి తగినంత శక్తినిస్తాయి.
నరాలు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
బ్రెయిన్‌ చురుగ్గా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
లైంగికశక్తిని పెంచుతాయి.
ముక్కు, చెవి, గొంతు సమస్యలను పరిష్కరిస్తాయి.
రేచీకటి సమస్యను నివారిస్తాయి.
మత్తును పోగొడతాయి. ముఖ్యంగా పరిమితి మించి ఆల్కహాల్‌ తాగినవాళ్లకు ఉదయం లేచిన వెంటనే వీటిని తీసుకుంటే హ్యాంగోవర్‌ బాధ ఉండదు.
బాగా పండిన ఖర్జూరం పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. డైటరీ ఫైబర్‌ బాగా ఉంటుంది. ఇవి తింటే డయేరియా తగ్గుతుంది. జీర్ణశక్తిపై కూడా బాగా పనిచేస్తాయి.  
కొలెస్ట్రాల్‌ పరిమాణాలను క్రమబద్ధీకరిస్తాయి.
రక్తపోటును చక్కగా నియంత్రిస్తాయి.
విటమిన్‌-సి, డిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి.
వీటిని తరచూ తినడం వల్ల చర్మం ముడతలు పడకుండా యంగ్‌గా కనిపిస్తారు.
జుట్టు రాలిపోకుండా సంరక్షిస్తాయి. వీటిల్లో ఐరన్‌ పుష్కలంగా ఉండడం వల్ల మాడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
జుట్టు పెరుగుతుంది.
ఇన్ఫ్లమేషన్‌ తగ్గుతుంది.
వీటిల్లో మెగ్నీషియం పాళ్లు ఎక్కువ ఉండడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
గర్భిణీలకు ఇవి ఎంతో మంచి ఫుడ్‌.
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి.

“Date flesh is found to be low in fat and protein but rich in sugars, mainly fructose and glucose. It is a high source of energy, as 100 g of flesh can provide an average of 314 kcal. Ten minerals were reported, the major being selenium, copper, potassium, and magnesium.”

Dates contain Vitamins B-complex and C. By consuming 100 grams of dates can provide over 15 per cent of the recommended daily allowance from selenium, copper, potassium, and magnesium.

The fruit is rich in dietary fibre and antioxidants (mainly carotenoids and phenolics) as well.

No comments:

Post a Comment