కొత్తిమీరకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు కూడా ఉంటాయి. అవేంటంటే...
- శరీరంలోని విషపూరిత లోహాలను బయటకి వెళ్లగొడుతుంది
- హృదయ కండరాల జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది
- మధుమేహాన్ని తగ్గిస్తుంది
- దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
- ఒత్తిడి, ఆందోళనలను తొలగిస్తుంది
- నిద్ర పట్టేలా చేస్తుంది
- రక్తపోటు తగ్గిస్తుంది
- దీనికి యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలుంటాయి.
కొత్తిమీరలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. కొత్తిమీర ఆకుల్లో, కాడల్లో పీచు పదార్థాలు, విటమిన్లు పుష్కలం. కెలోరీలూ తక్కువే. యాంటీ ఆక్సిడెంట్లు అధికం కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. ఇందులో శరీరానికి ఉపయోగపడే సుగంధ నూనెలు, పోలీఫినాల్స్ అపారం. పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల జీవకణాల ఆరోగ్యానికి, గుండె లయ క్రమబద్ధీకరణకు, రక్తపోటు నియంత్రణకు దోహదం చేస్తుంది. ఇంకా ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లోవిన్, నియాసిన్, విటమిన్-ఎ, బీటా కెరోటిన్, విటమిన్-సి లభిస్తాయి. ముఖ్యంగా మెదడు కణాలు, చర్మకణాల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్-ఎ, శరీర నిర్మాణానికి కీలకమైన విటమిన్-కె పుష్కలం. 100 గ్రాముల కొత్తిమీరలో కేవలం 23 కెలోరీలే ఉంటాయి. కానీ రోజువారీ అవసరాలకు కావాల్సిన మొత్తంలో విటమిన్-సి, విటమిన్-ఎ, విటమిన్-కె లభిస్తాయి. మసాలాలో ప్రధాన దినుసుగా ఉండే ధనియాలు కొత్తిమీర విత్తనాలే. అయితే, మనం ఎంచుకునే కొత్తిమీర తాజాగా ఆకుపచ్చగా ఉండాలి. తక్కువగా ఉడికించాలి. అప్పుడే దానిలోని పోషక ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు.
No comments:
Post a Comment