Tuesday 12 June 2018

Gorinta Mehandi

















































ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా అతివల అందాన్ని... ఆకర్షణను పెంచేది గోరింటా కే..
తొలకరి జల్లులకు లేలేత ఆకులతో గోరింట విరగపూస్తుంది. ఈ గోరింటాకును యువతులు ఎంతో ఇష్టంగా చేతులకు పెట్టుకుంటారు.
చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదిగా అయుర్వేద వైద్యులు సూచిస్తారు. కొత్తగా పెళ్లయిన యువతులు సంప్రదాయంగా గోరింటాకును పెట్టుకుంటారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గోరింటాకు పెట్టుకొని మురిసిపోతారు. గోరింటాకు పెట్టుకోవడం అయిదోతనంగా మహిళలు భావిస్తారు. పెళ్లికాని అమ్మాయిలకు గోరింటా బాగా పండితే మంచి మొగుడు వస్తాడని విశ్వసిస్తారు.
ఇందుకోసం మహిళలు గోరింటాకుతో ప్రత్యేక డిజైన్లు వేసుకుంటారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా మహిళలు గోరింటాకుతో ఆకర్షనీయమైన డిజైన్లను వేసుకోవడానికి పోటీ పడుతారు. కొత్తగా పెళ్లైన యువతులు గోరింటాకుతో సంబరాలు జరుపుకుంటారు. డిజైన్లు వేయడానికి ప్రత్యేకంగా బ్యూటీపార్లర్లు కూడా వెలుస్తున్నాయి.మరోవైపు అందంతోపాటు గోరింటాకు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది. గోరింటాకు స్వయంగా తయారు చేసుకోవడానికి మహిళలు ఎక్కువగా ఇష్టపడుతారు.
పల్లెల్లో లేలేతని ఆకులు తెచ్చుకొని రోటిలో మెత్తగా రుబ్బుకొని చింతపండు,
పెరుగు కలుపుకొని చేతులకు అందంగా పెట్టుకుంటారు. పాదాలకు పారాణిగా పూసుకుంటారు. పట్టణాల్లో గోరింటాకు కోన్‌లతో రకరకాల డిజైన్లను వేసుకుంటారు. పల్లెల్లో కూడా కోన్‌లను ఉపయోగిస్తారు.
గోరింటాకు ఆరోగ్యానికీ మంచిదే...
గోరింటాకు కేవలం అందం కోసమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉందని ఆయుర్వేదులు చెబుతున్నారు.
అతివల చేతులు ఎక్కువగా నీటిలో నానడంతో పుండ్లు, ఎలర్జీ వస్తాయి. దీని నివారణకు గోరింటాకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.
గోరింటాలో యాంటీబ యాటిక్‌ లక్షణా లు ఉండడం వల్ల కాళ్లకు, చేతు లకు క్రిములు దరి చేరనీయ కుండా రక్షణగా నిలుస్తుంది.

అంతేకాకుండా రక్తపోటు కూడా తగ్గిస్తుందని చెబుతారు.

నువ్వుల నూనె లో గోరింటాకు వేసి మరి గించి తలకు రాసు కుంటే కాలేయ రోగాలకు, నోటిపూతను తగ్గిస్తుందని చెబుతా రు.

కీళ్ల నొప్పులు, వాపు కూడా గోరింటాకుతో తగ్గి పోతుందని కొన్ని పరిశోధనల్లో నిరూపితమైంది

No comments:

Post a Comment