Thursday, 21 June 2018

gurivinda

  • గురివింద గింజలపై ఉండే పెంకును తొలగించి, ఆ పప్పును చూర్ణం చేసి, తగినంత కొబ్బరి నూనె కలపాలి. ఆ ద్రావణాన్ని పేనుకొరికిన చోట రోజూ మూడు పూటలా రాస్తే, ఆ సమస్య తొలగిపోతుంది.
  • ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో వేసి కాచి, వడగట్టి, ఆ తైలాన్ని ప్రతిరోజూ వెంట్రుకల కుదుళ్లకు పట్టిస్తే, రాలడం ఆగిపోవడంతో పాటు జుత్తు బాగా పెరుగుతుంది.,
  • ఆకుల రసాన్ని పూతగా పూస్తూ ఓ 15 నిమిషాల పాటు ఎండలో ఉంటే, కొంత కాలంలో తెల్లమచ్చలు (ల్యూకోడర్మా) తగ్గుతాయి.
  • తెల్ల గురివింద వేరు గంధాన్ని కణతలకు పూస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
  • కొద్దిపాటి పచ్చి ఆకులను నమిలి తింటూ ఉంటే, బొంగురు గొంతు సమస్య తొలగిపోతుంది.
  • మూడు గ్రాముల గురివింద వేరు చూర్ణాన్ని పాలతో కలిపి సేవిస్తూ ఉంటే, వీర్యవృద్ధి కలుగుతుంది.
  • గుప్పెడు ఆకులను ఆముదంతో వెచ్చచేసి కడితే వాపులు తగ్గుతాయి.
  • పావు లీటరు నువ్వుల నూనెకు 1 లీటరు గుంటగలగర ఆకు రసం, 125 గ్రాముల గురివింద గింజల చూర్ణం కలిపి నూనెలో ఉడికించి లేపనంగా వేస్తే, ఎగ్జిమా, దురదలు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, పలురకాల ఇతర చర్మవ్యాధులు నయమవుతాయి.
  • రెండు గ్రాముల ఆకు చూర్ణానికి సమానంగా, చక్కెర కలిపి సేవిస్తే దగ్గు తగ్గిపోతుంది.

No comments:

Post a Comment