- పనస పండులో ఎ, సి, ఈ, కె, బి6, నియాసిన్ విటమిన్లతో పాటు రక్తం తయారీకి అవసరమైన కాపర్, మాంగనీస్, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనత ముప్పును అడ్డుకుంటాయి.
- పనస గింజల్లో ప్రొటీన్లు మెండు. అందుకే వీటిని పలురకాల వంటకాల్లో రుచికోసం వాడతారు. పప్పు ధాన్యాలలో లభించే పోషకాల్లో దాదాపు ఈ గింజల్లో లభిస్తాయి.
- తల భాగంలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేందుకు పనస పండు తోడ్పడుతుంది. ఫలితంగా శిరోజాలు ఏపుగా పెరుగుతాయి.
- వీటి గింజల్లోని విటమిన్ ఎ కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు పొడిజుట్టు, వెంట్రుకలు కొస భాగంలో చిట్లిపోవడం వంటి సమస్యలను నివారించి, శిరోజాలను సంరక్షిస్తుంది.
- పనస పండులోని సి విటమిన్ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూను అడ్డుకుంటుంది..
- తక్కువ క్యాలరీలు ఉన్నప్పటికీ, ఫ్రక్టోజ్, సుక్రోజ్ చక్కెరలు శరీరానికి వెంటనే శక్తినందిస్తాయి. ఈ పండులో కొలెస్ట్రాల్ ఉండదు. అందుకే దీన్ని ‘హెల్తీఫుడ్’గా తీసుకోవచ్చు.
- పనస గింజల్ని నిమిషం పాటు పాలలో నానబెట్టాలి. వీటిని పొడి చేసుకొని చర్మ ముడతల మీద రాసుకోవాలి. ఇలా 6 వారాలు అప్లై చేస్తే ముడతలు తగ్గి, అందంగా కనిపిస్తారు.
- ఎండిన పనస గింజల్ని పాలు, తేనెలో నానబెట్టి, మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాదనంతో వెలిగిపోతుంది.
- ుఽ వీటి గింజల్ని నేరుగా తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గిపోతుంది. ఈ గింజల్లోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
- ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఫైటో న్యూట్రియెంట్స్ ఫ్రీరాడికల్స్ బయటకు పంపిస్తాయి. దాంతో కేన్సర్ వ్యాధి నుంచి రక్షణనిస్తాయి.
- వీటి గింజల్లోని పొటాషియం, రక్తంలోని సోడియం నిల్వల్ని నియంత్రిస్తుంది. అధిక, అల్ప రక్తపీడనం, గుండెపోటు వచ్చే ముప్పును నివారిస్తుంది.
- పనసలోని కొవ్వులు పెద్దపేగులోని విషపదార్థాలను తొలగిస్తాయి. పెద్దపేగు కేన్సర్ నుంచి కాపాడుతాయి.
- ఎముకల దృఢత్వానికి అవసరమైన కాల్షియం వీటిల్లో లభిస్తుంది. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గిస్తుంది. అస్తమాతో బాధపడేవారు పనసపండు తింటే ప్రయోజనం ఉంటుంది.
- థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అవసరమైన కాపర్ పనసలో లభిస్తుంది.
- దీనిలోని విటమిన్ బి6, రక్తంలో హోమోసిస్టిన్ అమినో ఆమ్లం నిల్వల్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పనసలోని కెరోటినాయిడ్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బుల్ని నివారిస్తుంది.
Herbal Medicines traditionally used in India as per Ayurveda
Sunday, 10 June 2018
Jackfruit Seeds
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment