Thursday 21 June 2018

ulli kadalu / onion shoots




ఉల్లి కాడలను ఆహారపదార్ధాల తయారీలో ఉపయోగించడానికి చాలామంది ఇష్టపడరు. దీన్ని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం వలన పలుఆరోగ్యసమస్యలు తలెత్తుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది తప్పు అంటున్నారు నిపుణులు. వీటిని ఆహారపదార్థాల్లో ఉపయోగించడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని వారు చెబుతున్నారు వీటికి చెడు కొలస్ట్రాల్‌నూ, కాలేయం చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించే గుణముంది.. అంతే కాకుండా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఇది దివ్యమైన ఔషధం. కెలొరీలు కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధికబరువు సమస్య తలెత్తదు.



  • కేన్సర్‌ రిస్కును తగ్గిస్తుంది.
  • ఉల్లికాడల్లో పీచుపదార్థాలు అధికంగా ఉండడంతో జీర్ణక్రియ బాగుంటుంది.
  • ఉల్లికాడల్లో కెరొటనాయిడ్స్‌ ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగు పరుస్తాయి.
  • జలుబు వల్ల తలెత్తే నెమ్మును సైతం తగ్గిస్తుంది.
  • గుండె ఆరోగ్యానికి ఉల్లికాడలు ఎంతో మంచివి.
  • ఇందులోని యాంటాక్సిడెంట్లు డిఎన్‌ఎ, సెల్యులర్‌ టిష్యూలు దెబ్బతినకుండా కాపాడతాయి.
  • ఉల్లికాడల్లోని విటమిన్‌-సి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దాంతో రక్తపోటు సమస్య ఉండదు. రక్తపోటు లేకపోతే గుండెజబ్బుల బారిన తొందరగా పడరు.
  • ఉల్లికాడల్లో విటమిన్‌-సి, కెలు బాగా ఉన్నాయి. ఇవి ఎముకలు శ క్తివంతంగా పనిచేసేలా సహకరిస్తాయి. విటమిన్‌-కె ఎముకల దృఢత్వాన్ని కాపాడుతుంది.
  • దీనిలోని యాంటీ-బాక్టీరియల్‌, యాంటీ-ఫంగల్‌ సుగుణాల వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు.
  • రక్తంలోని బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలను తగ్గిస్తుందని కూడా అధ్యయనాల్లో వెల్లడైంది.
  • గాస్ర్టో ఇంటస్టైనల్‌ సమస్యల నుంచి సాంత్వననిస్తుంది. డయేరియా వంటివాటిని నిరోధిస్తుంది. ఆకలిని పెంచుతాయి.
  • శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగేట్టు చేస్తుంది.
  • డయాబెటి్‌సతో బాధపడేవారికి బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలను తగ్గిస్తుంది.
  • ఆర్రైటిస్‌, ఆస్తమాలను నిరోధిస్తుంది.
  • జీవక్రియ సరిగా జరిగేలా సహకరిస్తుంది.
  • ఉల్లికాడల్లోని అలిసిన్‌ చర్మానికి ఎంతో మంచిది. ముఖ్యంగా చర్మం ముడతలు పడకుండా ఇది కాపాడుతుంది.

No comments:

Post a Comment