Friday, 29 June 2018

Apples





యాపిల్ తొక్కలో ఉండే దాదాపు పన్నెండురకాల రసాయనాలు కేన్సర్ కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయంటున్నారు కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు. ట్రిటర్‌పెనాయిడ్స్‌గా(Triterpenoid) పిలవబడే ఈపదార్ధాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము కేన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు ధ్వంసమైన కేన్సర్ కణాలను శరీరంలో నుంచి సమర్ధవంతగా బయటకు పంపిస్తాయి.  యాపిల్‌పండు శరీరంలో సహజ యాంటీఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది. యాపిల్‌లోని విటమిన్లు, మినరల్స్ వల్ల శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తాయి. ప్రతిరోజూ ఒక యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. చర్మ సంబంధమైన వ్యాధులు కూడా తగ్గుతాయి. 

No comments:

Post a Comment