Saturday 23 June 2018

chittamutti for joint pains

  • చిట్టాముట్టి వేరును నూరి ఆవుపాలు, నువ్వులనూనె కలిపి మరిగించి మర్దన చేస్తూ, ఓ రెండు స్పూన్ల కషాయాన్ని పాలతో రోజూ రెండు పూటలా సేవిస్తే, కీళ్ల నొప్పులు, సయాటికా సమస్య, గౌట్‌ నొప్పులు తగ్గుతాయి.
  • 5 గ్రాముల వేరు చూర్ణాన్ని తేనెతో కలిపి, కప్పు పాలతో రెండు పూటలా సేవిస్తే ఎర్రబట్ట, తెల్లబట్ట సమస్యలు తొలగిపోతాయి.
  • 60 గ్రాముల వేరు ముద్దను ఒక కప్పు పాలు, ఒక కప్పు నీరు కలిపి సగం మిగిలే దాకా మరిగించి, తగినంత చక్కెర వేసుకుని తాగుతూ ఉంటే గర్భ స్రావం కాకుండా ఆగిపోతుంది.
  • 10 గ్రాములు వేర్లను 5 గ్రాముల ఇప్ప బెరడును నలియగొట్టి పావు లీటర్‌ నీళ్లలో వేసి మరిగించి వడబోసి, అందులో 25 గ్రాముల చక్కెర కలిపి రోజూ రెండు పూటలా సేవిస్తే వీర్యం చిక్కబడుతుంది.
  • చిట్టాముట్టి వేర్లు, పల్లేరు వేర్లు సమానంగా నీళ్లలో కలిపి, కాచి చేసిన కషాయాన్ని 30 నుంచి 50 మి. లీ మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తే అర్శమొలలు తగ్గుతాయి.

No comments:

Post a Comment