వేసవిలో వేడి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి కొన్ని సూచనలు :-
- ఎండాకాలం ఉదయం లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేయడం మంచిది. తాజా పళ్లు, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నిమ్మరసానికి బదులుగా కొబ్బరినీళ్లు, పుచ్చకాయల జ్యూస్, కీరాజ్యూస్ తీసుకుంటే శరీరాన్ని చల్లబరుస్తాయి.
- సమ్మర్‌లో ఉదయం అల్పాహారం తక్కువగా తీసుకుంటారు కాబట్టి లంచ్ మాత్రం హెవీగానే ఉండాలి. పెరుగుకు బదులు మజ్జిగ బెటర్ ఛాయిస్ అవుతుంది. ఆహారపదార్థాల్లో మసాలాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ద్రవాహారాలు హాయిగా ఉంటాయి.
- చల్లటి ఫ్రిజ్ వాటర్‌ను దూరం పెట్టాలి. కూల్‌డ్రింక్స్ కూడా మంచిది కాదు. అవి జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. చక్కెర, ఐస్‌క్రీమ్‌లు వేసవిలో ఇబ్బంది కలిగిస్తాయి. చల్లటి పండ్లు తింటే ఏమీ కాదు.
- ఆవాలు, అల్లం, మిరపకాయలు, కారంతో పాటు టోమాటో, వెల్లుల్లి, మిరియాలను కూడా దూరం పెట్టాలి.
- కూలింగ్ హెర్బ్స్‌గా చెప్పుకునే పుదీనా, మెంతికూర, కరివేపాకు, సోంపులను వంటల్లో ఎంత ఉపయోగిస్తే అంత మంచిది. వీటితో పాటు కావాలంటే జీలకర్ర, దాల్చినచెక్క, పచ్చ యాలకులను వాడొచ్చు. బ్రకోలీ, పొట్లకాయ, ములక్కాయలు, కీర, తెల్ల గుమ్మడికాయలు శరీరానికి కావాల్సినంత చల్లదనాన్ని ఇస్తాయి.
- పాలు, కొబ్బరి, వెన్న, నెయ్యి... ఏవైనా సరే కొద్ది పరిమాణంలో వాడితే మంచిది. అయితే వీటిని తప్పకుండా వేడి చేయాలి. వేపుళ్లను దూరం పెడితే జీర్ణక్రియ సరిగ్గా జరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయలు, మామిడి పండ్లు, చెరుకు, పనసపండ్లను రోజంతా అప్పుడప్పుడు తింటూ ఉండాలి.
No comments:
Post a Comment