- మొలకలు పోషకాల నిధి. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, ఆర్గానిక్ కాంపౌండ్లు బాగా ఉంటాయి. అలాగే ప్రొటీన్లు, డయటరీ ఫైబర్ కూడా వీటిల్లో పుష్కలం. విటవిన్-కె, ఫొలేట్, నియాసిన్, విటమిన్-సి, ఎ, రిబోఫ్లేవిన్‌లు కూడా వీటిల్లో ఉన్నాయి.
- మాంగనీసు, కాపర్, ఐరన్, జింకు, మెగ్నీషియం, కాల్షియం ఖనిజాలు ఉన్నాయి.
- మొలకల్లో రకరకాల ఎంజైములు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ బాగా జరిగేలా సాయపడతాయి.
- పోషకాలు శరీరంలో కణాలను ఉత్పత్తిచేయడం, వాటిని ఆరోగ్యంగా ఉంచడం, శరీర భాగాలు దెబ్బతినకుండా కాపాడడం, ఎముకల పెరుగుదలకు తోడ్పడతాయి. చర్మం పునరుత్పత్తికి కూడా ఇవి సహకరిస్తాయి.
- ఐరన్ లోటు వల్ల రక్తహీనత వస్తుంది. మొలకలు రక్తహీనతను తగ్గిస్తాయి.
- మొలకల్లో న్యూట్రియంట్లు ఎంత ఎక్కువగా ఉంటాయో.. క్యాలరీలు అంత తక్కువ ఉంటాయి. అందుకే మొలకలు ఎన్ని తిన్నా ఇబ్బంది లేదు. పైగా వీటిని తినడం వల్ల కడుపు నిండుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గుతారు.
- మొలకలు తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
- క్యాన్సర్, గుండెజబ్బులను నిరోధిస్తాయి.
- శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది.
- మొలకలు కళ్లకు కూడా ఎంతో మంచివి. వీటిని తినడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. కాటరాక్ట్, మాక్యులర్ డిజెనరేషన్‌లను మొలకలు నిరోధిస్తాయి.
- రకరకాల ఎలర్జీలను తగ్గిస్తాయి.
- పిల్లల్లో పుట్టుకతో వచ్చే న్యూరల్ ట్యూబ్ లోపాల వంటి వాటిని కూడా మొలకలు అరికడతాయి
Herbal Medicines traditionally used in India as per Ayurveda
Saturday, 23 June 2018
vittanala molakalu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment