Friday, 29 June 2018

Apples





యాపిల్ తొక్కలో ఉండే దాదాపు పన్నెండురకాల రసాయనాలు కేన్సర్ కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయంటున్నారు కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు. ట్రిటర్‌పెనాయిడ్స్‌గా(Triterpenoid) పిలవబడే ఈపదార్ధాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము కేన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు ధ్వంసమైన కేన్సర్ కణాలను శరీరంలో నుంచి సమర్ధవంతగా బయటకు పంపిస్తాయి.  యాపిల్‌పండు శరీరంలో సహజ యాంటీఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది. యాపిల్‌లోని విటమిన్లు, మినరల్స్ వల్ల శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తాయి. ప్రతిరోజూ ఒక యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. చర్మ సంబంధమైన వ్యాధులు కూడా తగ్గుతాయి. 

Wednesday, 27 June 2018

avise ginjalu


  • అవిసె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వేడిని పుట్టిస్తాయి. ఫలితంగా శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీంతో శరీర బరువు కూడా తగ్గుతుంది.
  • వీటిల్లో ప్రోటీన్‌ అధికంగా ఉంటుంది. ప్రోటీన్‌లు శరీర బరువు తగ్గుదలలో విశేషంగా తోడ్పడుతాయి.
  • అవిసెల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. దాంతో తినే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
  • వీటిల్లో ఒమెగా3 ఫాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవిసెగింజలను రోజువారీ ఆహారంలో తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
  • అవిసె గింజల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు మోకాళ్ల నొప్పులు రాకుండా చేస్తాయి.
  • అవిసెల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల నేరుగా తింటే సరిగ్గా జీర్ణం కాదు.అందుకే సూప్‌, సలాడ్‌ల రూపంలో భోజనంతో పాటుగా వీటిని తీసుకోవాలి.
  • Saturday, 23 June 2018

    vittanala molakalu

    • మొలకలు పోషకాల నిధి. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, ఆర్గానిక్‌ కాంపౌండ్లు బాగా ఉంటాయి. అలాగే ప్రొటీన్లు, డయటరీ ఫైబర్‌ కూడా వీటిల్లో పుష్కలం. విటవిన్‌-కె, ఫొలేట్‌, నియాసిన్‌, విటమిన్‌-సి, ఎ, రిబోఫ్లేవిన్‌లు కూడా వీటిల్లో ఉన్నాయి.
    • మాంగనీసు, కాపర్‌, ఐరన్‌, జింకు, మెగ్నీషియం, కాల్షియం ఖనిజాలు ఉన్నాయి.
    • మొలకల్లో రకరకాల ఎంజైములు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ బాగా జరిగేలా సాయపడతాయి.
    • పోషకాలు శరీరంలో కణాలను ఉత్పత్తిచేయడం, వాటిని ఆరోగ్యంగా ఉంచడం, శరీర భాగాలు దెబ్బతినకుండా కాపాడడం, ఎముకల పెరుగుదలకు తోడ్పడతాయి. చర్మం పునరుత్పత్తికి కూడా ఇవి సహకరిస్తాయి.
    •  ఐరన్‌ లోటు వల్ల రక్తహీనత వస్తుంది. మొలకలు రక్తహీనతను తగ్గిస్తాయి.
    • మొలకల్లో న్యూట్రియంట్లు ఎంత ఎక్కువగా ఉంటాయో.. క్యాలరీలు అంత తక్కువ ఉంటాయి. అందుకే మొలకలు ఎన్ని తిన్నా ఇబ్బంది లేదు. పైగా వీటిని తినడం వల్ల కడుపు నిండుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గుతారు.
    • మొలకలు తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
    • క్యాన్సర్‌, గుండెజబ్బులను నిరోధిస్తాయి.
    •  శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది.
    • మొలకలు కళ్లకు కూడా ఎంతో మంచివి. వీటిని తినడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. కాటరాక్ట్‌, మాక్యులర్‌ డిజెనరేషన్‌లను మొలకలు నిరోధిస్తాయి.
    • రకరకాల ఎలర్జీలను తగ్గిస్తాయి.
    • పిల్లల్లో పుట్టుకతో వచ్చే న్యూరల్‌ ట్యూబ్‌ లోపాల వంటి వాటిని కూడా మొలకలు అరికడతాయి

    chittamutti for joint pains

    • చిట్టాముట్టి వేరును నూరి ఆవుపాలు, నువ్వులనూనె కలిపి మరిగించి మర్దన చేస్తూ, ఓ రెండు స్పూన్ల కషాయాన్ని పాలతో రోజూ రెండు పూటలా సేవిస్తే, కీళ్ల నొప్పులు, సయాటికా సమస్య, గౌట్‌ నొప్పులు తగ్గుతాయి.
    • 5 గ్రాముల వేరు చూర్ణాన్ని తేనెతో కలిపి, కప్పు పాలతో రెండు పూటలా సేవిస్తే ఎర్రబట్ట, తెల్లబట్ట సమస్యలు తొలగిపోతాయి.
    • 60 గ్రాముల వేరు ముద్దను ఒక కప్పు పాలు, ఒక కప్పు నీరు కలిపి సగం మిగిలే దాకా మరిగించి, తగినంత చక్కెర వేసుకుని తాగుతూ ఉంటే గర్భ స్రావం కాకుండా ఆగిపోతుంది.
    • 10 గ్రాములు వేర్లను 5 గ్రాముల ఇప్ప బెరడును నలియగొట్టి పావు లీటర్‌ నీళ్లలో వేసి మరిగించి వడబోసి, అందులో 25 గ్రాముల చక్కెర కలిపి రోజూ రెండు పూటలా సేవిస్తే వీర్యం చిక్కబడుతుంది.
    • చిట్టాముట్టి వేర్లు, పల్లేరు వేర్లు సమానంగా నీళ్లలో కలిపి, కాచి చేసిన కషాయాన్ని 30 నుంచి 50 మి. లీ మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తే అర్శమొలలు తగ్గుతాయి.

    Thursday, 21 June 2018

    gurivinda

    • గురివింద గింజలపై ఉండే పెంకును తొలగించి, ఆ పప్పును చూర్ణం చేసి, తగినంత కొబ్బరి నూనె కలపాలి. ఆ ద్రావణాన్ని పేనుకొరికిన చోట రోజూ మూడు పూటలా రాస్తే, ఆ సమస్య తొలగిపోతుంది.
    • ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో వేసి కాచి, వడగట్టి, ఆ తైలాన్ని ప్రతిరోజూ వెంట్రుకల కుదుళ్లకు పట్టిస్తే, రాలడం ఆగిపోవడంతో పాటు జుత్తు బాగా పెరుగుతుంది.,
    • ఆకుల రసాన్ని పూతగా పూస్తూ ఓ 15 నిమిషాల పాటు ఎండలో ఉంటే, కొంత కాలంలో తెల్లమచ్చలు (ల్యూకోడర్మా) తగ్గుతాయి.
    • తెల్ల గురివింద వేరు గంధాన్ని కణతలకు పూస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
    • కొద్దిపాటి పచ్చి ఆకులను నమిలి తింటూ ఉంటే, బొంగురు గొంతు సమస్య తొలగిపోతుంది.
    • మూడు గ్రాముల గురివింద వేరు చూర్ణాన్ని పాలతో కలిపి సేవిస్తూ ఉంటే, వీర్యవృద్ధి కలుగుతుంది.
    • గుప్పెడు ఆకులను ఆముదంతో వెచ్చచేసి కడితే వాపులు తగ్గుతాయి.
    • పావు లీటరు నువ్వుల నూనెకు 1 లీటరు గుంటగలగర ఆకు రసం, 125 గ్రాముల గురివింద గింజల చూర్ణం కలిపి నూనెలో ఉడికించి లేపనంగా వేస్తే, ఎగ్జిమా, దురదలు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, పలురకాల ఇతర చర్మవ్యాధులు నయమవుతాయి.
    • రెండు గ్రాముల ఆకు చూర్ణానికి సమానంగా, చక్కెర కలిపి సేవిస్తే దగ్గు తగ్గిపోతుంది.

    ulli kadalu / onion shoots




    ఉల్లి కాడలను ఆహారపదార్ధాల తయారీలో ఉపయోగించడానికి చాలామంది ఇష్టపడరు. దీన్ని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం వలన పలుఆరోగ్యసమస్యలు తలెత్తుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది తప్పు అంటున్నారు నిపుణులు. వీటిని ఆహారపదార్థాల్లో ఉపయోగించడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని వారు చెబుతున్నారు వీటికి చెడు కొలస్ట్రాల్‌నూ, కాలేయం చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించే గుణముంది.. అంతే కాకుండా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఇది దివ్యమైన ఔషధం. కెలొరీలు కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధికబరువు సమస్య తలెత్తదు.



    • కేన్సర్‌ రిస్కును తగ్గిస్తుంది.
    • ఉల్లికాడల్లో పీచుపదార్థాలు అధికంగా ఉండడంతో జీర్ణక్రియ బాగుంటుంది.
    • ఉల్లికాడల్లో కెరొటనాయిడ్స్‌ ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగు పరుస్తాయి.
    • జలుబు వల్ల తలెత్తే నెమ్మును సైతం తగ్గిస్తుంది.
    • గుండె ఆరోగ్యానికి ఉల్లికాడలు ఎంతో మంచివి.
    • ఇందులోని యాంటాక్సిడెంట్లు డిఎన్‌ఎ, సెల్యులర్‌ టిష్యూలు దెబ్బతినకుండా కాపాడతాయి.
    • ఉల్లికాడల్లోని విటమిన్‌-సి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దాంతో రక్తపోటు సమస్య ఉండదు. రక్తపోటు లేకపోతే గుండెజబ్బుల బారిన తొందరగా పడరు.
    • ఉల్లికాడల్లో విటమిన్‌-సి, కెలు బాగా ఉన్నాయి. ఇవి ఎముకలు శ క్తివంతంగా పనిచేసేలా సహకరిస్తాయి. విటమిన్‌-కె ఎముకల దృఢత్వాన్ని కాపాడుతుంది.
    • దీనిలోని యాంటీ-బాక్టీరియల్‌, యాంటీ-ఫంగల్‌ సుగుణాల వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు.
    • రక్తంలోని బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలను తగ్గిస్తుందని కూడా అధ్యయనాల్లో వెల్లడైంది.
    • గాస్ర్టో ఇంటస్టైనల్‌ సమస్యల నుంచి సాంత్వననిస్తుంది. డయేరియా వంటివాటిని నిరోధిస్తుంది. ఆకలిని పెంచుతాయి.
    • శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగేట్టు చేస్తుంది.
    • డయాబెటి్‌సతో బాధపడేవారికి బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలను తగ్గిస్తుంది.
    • ఆర్రైటిస్‌, ఆస్తమాలను నిరోధిస్తుంది.
    • జీవక్రియ సరిగా జరిగేలా సహకరిస్తుంది.
    • ఉల్లికాడల్లోని అలిసిన్‌ చర్మానికి ఎంతో మంచిది. ముఖ్యంగా చర్మం ముడతలు పడకుండా ఇది కాపాడుతుంది.

    Tuesday, 19 June 2018

    Kottimeera






    కొత్తిమీరకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు కూడా ఉంటాయి. అవేంటంటే...
    •  శరీరంలోని విషపూరిత లోహాలను బయటకి వెళ్లగొడుతుంది
    •  హృదయ కండరాల జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది
    •  మధుమేహాన్ని తగ్గిస్తుంది
    •  దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
    •  ఒత్తిడి, ఆందోళనలను తొలగిస్తుంది
    •  నిద్ర పట్టేలా చేస్తుంది 
    •  రక్తపోటు తగ్గిస్తుంది
    •  దీనికి యాంటీ ఫంగల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి.

    కొత్తిమీరలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. కొత్తిమీర ఆకుల్లో, కాడల్లో పీచు పదార్థాలు, విటమిన్లు పుష్కలం. కెలోరీలూ తక్కువే. యాంటీ ఆక్సిడెంట్లు అధికం కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. ఇందులో శరీరానికి ఉపయోగపడే సుగంధ నూనెలు, పోలీఫినాల్స్‌ అపారం. పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం, ఐరన్‌ ఎక్కువగా ఉండటం వల్ల జీవకణాల ఆరోగ్యానికి, గుండె లయ క్రమబద్ధీకరణకు, రక్తపోటు నియంత్రణకు దోహదం చేస్తుంది. ఇంకా ఫోలిక్‌ యాసిడ్‌, రిబోఫ్లోవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-ఎ, బీటా కెరోటిన్‌, విటమిన్‌-సి లభిస్తాయి. ముఖ్యంగా మెదడు కణాలు, చర్మకణాల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్‌-ఎ, శరీర నిర్మాణానికి కీలకమైన విటమిన్‌-కె పుష్కలం. 100 గ్రాముల కొత్తిమీరలో కేవలం 23 కెలోరీలే ఉంటాయి. కానీ రోజువారీ అవసరాలకు కావాల్సిన మొత్తంలో విటమిన్‌-సి, విటమిన్‌-ఎ, విటమిన్‌-కె లభిస్తాయి. మసాలాలో ప్రధాన దినుసుగా ఉండే ధనియాలు కొత్తిమీర విత్తనాలే. అయితే, మనం ఎంచుకునే కొత్తిమీర తాజాగా ఆకుపచ్చగా ఉండాలి. తక్కువగా ఉడికించాలి. అప్పుడే దానిలోని పోషక ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు.



    Tuesday, 12 June 2018

    Gorinta Mehandi

















































    ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా అతివల అందాన్ని... ఆకర్షణను పెంచేది గోరింటా కే..
    తొలకరి జల్లులకు లేలేత ఆకులతో గోరింట విరగపూస్తుంది. ఈ గోరింటాకును యువతులు ఎంతో ఇష్టంగా చేతులకు పెట్టుకుంటారు.
    చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదిగా అయుర్వేద వైద్యులు సూచిస్తారు. కొత్తగా పెళ్లయిన యువతులు సంప్రదాయంగా గోరింటాకును పెట్టుకుంటారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గోరింటాకు పెట్టుకొని మురిసిపోతారు. గోరింటాకు పెట్టుకోవడం అయిదోతనంగా మహిళలు భావిస్తారు. పెళ్లికాని అమ్మాయిలకు గోరింటా బాగా పండితే మంచి మొగుడు వస్తాడని విశ్వసిస్తారు.
    ఇందుకోసం మహిళలు గోరింటాకుతో ప్రత్యేక డిజైన్లు వేసుకుంటారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా మహిళలు గోరింటాకుతో ఆకర్షనీయమైన డిజైన్లను వేసుకోవడానికి పోటీ పడుతారు. కొత్తగా పెళ్లైన యువతులు గోరింటాకుతో సంబరాలు జరుపుకుంటారు. డిజైన్లు వేయడానికి ప్రత్యేకంగా బ్యూటీపార్లర్లు కూడా వెలుస్తున్నాయి.మరోవైపు అందంతోపాటు గోరింటాకు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది. గోరింటాకు స్వయంగా తయారు చేసుకోవడానికి మహిళలు ఎక్కువగా ఇష్టపడుతారు.
    పల్లెల్లో లేలేతని ఆకులు తెచ్చుకొని రోటిలో మెత్తగా రుబ్బుకొని చింతపండు,
    పెరుగు కలుపుకొని చేతులకు అందంగా పెట్టుకుంటారు. పాదాలకు పారాణిగా పూసుకుంటారు. పట్టణాల్లో గోరింటాకు కోన్‌లతో రకరకాల డిజైన్లను వేసుకుంటారు. పల్లెల్లో కూడా కోన్‌లను ఉపయోగిస్తారు.
    గోరింటాకు ఆరోగ్యానికీ మంచిదే...
    గోరింటాకు కేవలం అందం కోసమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉందని ఆయుర్వేదులు చెబుతున్నారు.
    అతివల చేతులు ఎక్కువగా నీటిలో నానడంతో పుండ్లు, ఎలర్జీ వస్తాయి. దీని నివారణకు గోరింటాకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.
    గోరింటాలో యాంటీబ యాటిక్‌ లక్షణా లు ఉండడం వల్ల కాళ్లకు, చేతు లకు క్రిములు దరి చేరనీయ కుండా రక్షణగా నిలుస్తుంది.

    అంతేకాకుండా రక్తపోటు కూడా తగ్గిస్తుందని చెబుతారు.

    నువ్వుల నూనె లో గోరింటాకు వేసి మరి గించి తలకు రాసు కుంటే కాలేయ రోగాలకు, నోటిపూతను తగ్గిస్తుందని చెబుతా రు.

    కీళ్ల నొప్పులు, వాపు కూడా గోరింటాకుతో తగ్గి పోతుందని కొన్ని పరిశోధనల్లో నిరూపితమైంది

    Dalchina Chekka Cinnamom bark

    దాల్చిన చెక్క పరిష్కరించే శారీరక రుగ్మతలు ఇవే!
    • మధుమేహంలో హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది.
    • చెడు కొలెస్ట్రాల్‌ను క్రమబద్ధం చేస్తుంది.
    • దీన్లో ఇన్‌ఫెక్షన్లతో పోరాడే సహజసిద్ధమైన ఎలిమెంట్లు ఉంటాయి.
    • ఆర్థ్రరుటిస్‌ నొప్పులను తగ్గిస్తుంది.
    • పదార్థాలు పాడవకుండా కాపాడుతుంది.
    • దీన్లో పీచు, కాల్షియం, ఐరన్‌, మాంగనీసు ఉంటాయి.
    • నెలసరి నొప్పులకు విరుగుడుగా పని చేస్తుంది.
    • వంధత్వాన్ని నివారించి, శరీరంలోని హార్మోన్లలో హెచ్చుతగ్గులను సరి చేస్తుంది.
    • అల్జీమర్‌, పార్కిన్‌సన్‌, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌, మెనింగ్జయిటిస్‌, బ్రెయిన్‌ ట్యూమర్‌ లాంటి మెదడు కణాల మరణంతో తలెత్తే వ్యాధులను అదుపు చేస్తుంది.

    Sunday, 10 June 2018

    Eetha pallu / fruits


    Jackfruit Seeds




















    • పనస పండులో ఎ, సి, ఈ, కె, బి6, నియాసిన్‌ విటమిన్లతో పాటు రక్తం తయారీకి అవసరమైన కాపర్‌, మాంగనీస్‌, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనత ముప్పును అడ్డుకుంటాయి.
    • పనస గింజల్లో ప్రొటీన్లు మెండు. అందుకే వీటిని పలురకాల వంటకాల్లో రుచికోసం వాడతారు. పప్పు ధాన్యాలలో లభించే పోషకాల్లో దాదాపు ఈ గింజల్లో లభిస్తాయి.
    • తల భాగంలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేందుకు పనస పండు తోడ్పడుతుంది. ఫలితంగా శిరోజాలు ఏపుగా పెరుగుతాయి.
    • వీటి గింజల్లోని విటమిన్‌ ఎ కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు పొడిజుట్టు, వెంట్రుకలు కొస భాగంలో చిట్లిపోవడం వంటి సమస్యలను నివారించి, శిరోజాలను సంరక్షిస్తుంది.
    • పనస పండులోని సి విటమిన్‌ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూను అడ్డుకుంటుంది..
    • తక్కువ క్యాలరీలు ఉన్నప్పటికీ, ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌ చక్కెరలు శరీరానికి వెంటనే శక్తినందిస్తాయి. ఈ పండులో కొలెస్ట్రాల్‌ ఉండదు. అందుకే దీన్ని ‘హెల్తీఫుడ్‌’గా తీసుకోవచ్చు.
    • పనస గింజల్ని నిమిషం పాటు పాలలో నానబెట్టాలి. వీటిని పొడి చేసుకొని చర్మ ముడతల మీద రాసుకోవాలి. ఇలా 6 వారాలు అప్లై చేస్తే ముడతలు తగ్గి, అందంగా కనిపిస్తారు.
    • ఎండిన పనస గింజల్ని పాలు, తేనెలో నానబెట్టి, మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాదనంతో వెలిగిపోతుంది.
    • ుఽ వీటి గింజల్ని నేరుగా తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గిపోతుంది. ఈ గింజల్లోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
    • ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫ్లేవనాయిడ్స్‌, ఫైటో న్యూట్రియెంట్స్‌ ఫ్రీరాడికల్స్‌ బయటకు పంపిస్తాయి. దాంతో కేన్సర్‌ వ్యాధి నుంచి రక్షణనిస్తాయి.
    • వీటి గింజల్లోని పొటాషియం, రక్తంలోని సోడియం నిల్వల్ని నియంత్రిస్తుంది. అధిక, అల్ప రక్తపీడనం, గుండెపోటు వచ్చే ముప్పును నివారిస్తుంది.
    • పనసలోని కొవ్వులు పెద్దపేగులోని విషపదార్థాలను తొలగిస్తాయి. పెద్దపేగు కేన్సర్‌ నుంచి కాపాడుతాయి.
    • ఎముకల దృఢత్వానికి అవసరమైన కాల్షియం వీటిల్లో లభిస్తుంది. ఆస్టియోపోరోసిస్‌ ముప్పును తగ్గిస్తుంది. అస్తమాతో బాధపడేవారు పనసపండు తింటే ప్రయోజనం ఉంటుంది.
    • థైరాయిడ్‌ గ్రంథి పనితీరుకు అవసరమైన కాపర్‌ పనసలో లభిస్తుంది.
    • దీనిలోని విటమిన్‌ బి6, రక్తంలో హోమోసిస్టిన్‌ అమినో ఆమ్లం నిల్వల్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పనసలోని కెరోటినాయిడ్స్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, టైప్‌ 2 డయాబెటీస్‌, గుండె జబ్బుల్ని నివారిస్తుంది. 

    Saturday, 9 June 2018

    Baniyan tree leaves and fruits

    వటపత్ర శాయి కి వరహాల లాలి ..... 
    శ్రీ కృష్ణుడు వట పాత్ర శాయి .... మహా విష్ణువు వటపత్ర శాయి.

    అలాంటి వట వృక్షం క్రింద  
    సదా  శివుడు , దక్షిణా మూర్తి రూపం లో ఉండి , శిష్యులకు , మౌనo గా జ్ఞాన బోధ చేస్తుంటాడు. 


    "చిత్రం వటతరో ర్మూలే వృద్ధా శ్శిష్యా గురుర్యువా
    గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్న సంశయాః "


    దక్షిణామూర్తి స్వరూపాన్ని మహర్షులు ప్రత్యక్షంగా దర్శనం చేసిన కాలాన ఆయన గురించి చెప్పిన శ్లోకమిది. అక్కడ గురువు వటవృక్షమూలాన చిన్ముద్రధారియైు, మౌనియైు, శిష్యపరివేష్టితుడై కూర్చుని ఉన్నాడట.

    Saturday, 2 June 2018

    Dates Kharjur

    ఖర్జూరాలు ఎంతో మధురంగా ఉంటాయి. చిన్నా, పెద్దా అందరూ వీటిని ఎంజాయ్‌ చేస్తారు. ఎన్నో స్వీట్లల్లో ‘రాణి’ అయిన ఈ ఖర్జూరాల్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవేమిటంటే...
    నిత్యం ఖర్జూరాలు తింటే మలబద్ధకం సమస్య పోతుంది.
    ఎముకలను దృఢపరిచే ఐదు సూపర్‌ ఖనిజాలు వీటిల్లో ఉన్నాయి.
    చిన్నపేగులో తలెత్తే పలు సమస్యలను నివారిస్తాయి.
    ఖర్జూరాల్లో ఖనిజాలు ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇవి మంచి డైటరీ సప్లిమెంట్‌.
    వీటిల్లో ఆర్గానిక్‌ సల్ఫర్‌ ఉంది. ఇది అన్నింటిలో ఉండదు. దీనివల్ల చర్మ ఎలర్జీలతో పాటు సీజనల్‌గా తలెత్తే ఎలర్జీలు కూడా తగ్గుతాయి.
    డైట్స్‌ తినడం వల్ల బరువు పెరుగుతారు. సన్నగా ఉన్నవాళ్లు లావు అవ్వాలంటే వీటిని తినొచ్చు.
    వీటిల్లో షుగర్‌, పోషకాలతోపాటు అత్యవసర విటమిన్లు కూడా ఎన్నో ఉన్నాయి.
    శరీరానికి తగినంత శక్తినిస్తాయి.
    నరాలు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
    బ్రెయిన్‌ చురుగ్గా పనిచేస్తుంది.
    గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
    లైంగికశక్తిని పెంచుతాయి.
    ముక్కు, చెవి, గొంతు సమస్యలను పరిష్కరిస్తాయి.
    రేచీకటి సమస్యను నివారిస్తాయి.
    మత్తును పోగొడతాయి. ముఖ్యంగా పరిమితి మించి ఆల్కహాల్‌ తాగినవాళ్లకు ఉదయం లేచిన వెంటనే వీటిని తీసుకుంటే హ్యాంగోవర్‌ బాధ ఉండదు.
    బాగా పండిన ఖర్జూరం పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. డైటరీ ఫైబర్‌ బాగా ఉంటుంది. ఇవి తింటే డయేరియా తగ్గుతుంది. జీర్ణశక్తిపై కూడా బాగా పనిచేస్తాయి.  
    కొలెస్ట్రాల్‌ పరిమాణాలను క్రమబద్ధీకరిస్తాయి.
    రక్తపోటును చక్కగా నియంత్రిస్తాయి.
    విటమిన్‌-సి, డిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి.
    వీటిని తరచూ తినడం వల్ల చర్మం ముడతలు పడకుండా యంగ్‌గా కనిపిస్తారు.
    జుట్టు రాలిపోకుండా సంరక్షిస్తాయి. వీటిల్లో ఐరన్‌ పుష్కలంగా ఉండడం వల్ల మాడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
    జుట్టు పెరుగుతుంది.
    ఇన్ఫ్లమేషన్‌ తగ్గుతుంది.
    వీటిల్లో మెగ్నీషియం పాళ్లు ఎక్కువ ఉండడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
    గర్భిణీలకు ఇవి ఎంతో మంచి ఫుడ్‌.
    పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి.

    “Date flesh is found to be low in fat and protein but rich in sugars, mainly fructose and glucose. It is a high source of energy, as 100 g of flesh can provide an average of 314 kcal. Ten minerals were reported, the major being selenium, copper, potassium, and magnesium.”

    Dates contain Vitamins B-complex and C. By consuming 100 grams of dates can provide over 15 per cent of the recommended daily allowance from selenium, copper, potassium, and magnesium.

    The fruit is rich in dietary fibre and antioxidants (mainly carotenoids and phenolics) as well.