Sunday 7 January 2018

Regu pandu

మనిషికి అవసరమైన 24 రకాల ఆమైనో ఆమ్లాలలో 18 రకాలు రేగు పండ్లలో లభిస్తాయి. ఈ పండులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలం. దీంతో ఆజీర్తి, కడుపుమంట, గొంతునొప్పి, అస్తమా కండరాల నొప్పి దూరమవుతాయి. చర్మ సౌందర్యం లభిస్తుంది. ఎర్ర రక్త కణాలను శుభ్రపరిచి, గుండె సంబంధిత వ్యాధులను దరి చేరనీయదు. క్యాన్సర్‌ రక్త కణాలను నిలువరిస్తుంది. కాలేయాన్ని కాపాడుతుంది. గర్భిణుల్లో వాంతులు, వికారాలను తగ్గిస్తుంది. మూత్రపిండాలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటకి పంపి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.
  •  రేగు చెట్టు ఆకు కషాయంతో అర్శమొలలు, భగందరం, పిషర్‌ ఉన్న వారికి ఊరట లభిస్తుంది.
  •  బెరడును ఎండబెట్టి, పొడి చేసుకొని గాయాలు, పుండ్లపై చల్లుకుంటే తగ్గుతాయి. ఆయుర్వేదంలో ఈ బెరడును డయేరియాకు ఔషధంగా వాడతారు.
  •  వేరు కషాయం నీళ్ల విరోచనాలు, జ్వరాలు, సాధారణ నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

విశిష్ట ఫలం - సంప్రదాయం పదిలం
శబరికి తోబుట్టువులా ఎంగిలి పండ్లు తిన్నా వు.. అంటు రామాయణ గాథలో భక్తరామదాసు రామచంద్రుడిని గురించి పాడిన పాట తెలిసిందే. పూర్వకాలంలో రామ భక్తురాలు అయిన శబరి శ్రీరాముడికి రుచి చూసి కొసి రి, కొసిరి తినిపించినవి ఈ బదరీ ఫలాలే. నాటి నుంచి నేడు మనం సంక్రాంతి సందర్భంగా భోగి రోజు రేగు పండ్లను పూజించ డం చూస్తే మన సాంప్రదాయంలో ఈ పం డ్లకు ఎంత ప్రత్యేకత ఉందో తెలుసోతంది.

వంద గ్రాముల రేగు పండ్లలో    పోషకాలు ఇలా..
కొవ్వు -                             0.2 గ్రాములు
కాల్షియం -                        25.6 మిల్లీ గ్రాములు
క్యాలరీలు -                       79
ప్రొటీన్లు -                         1.2 గ్రాములు
సోడియం -                      3.5 మిల్లీ గ్రాములు
పాస్ఫరస్‌ -                     26.8 మిల్లీ గ్రాములు
విటమిన్‌-ఏ -                  10 మైనో - గ్రాములు
విటమిన్‌-సీ -                 70 మిల్లీ గ్రాములు
పిండి పదార్థాలు -            20.2 గ్రాములు

No comments:

Post a Comment