Friday 26 January 2018

Mokka Jonnalu Corn Flakes







మక్క కంకులు
 మక్క కంకులు అతి చౌకగా లభించే బలమైన ఆహారం. వీటి గింజలను పచ్చిగా, ఉడక బెట్టు కుని, కాల్చుకుని తినవచ్చు. మక్క గింజల్లో లినోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ ఈ, బి1, బి6, నియాసిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, రిబోఫ్లోవిన్‌  ఎక్కువగా లభిస్తాయి. మొక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా ఉపకరిస్తుంది. పీచు అధికంగా ఉండడంతో మలబద్ధకాన్ని నిలువరించి, మొలలు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ను అరికడుతుంది. మక్క ల్లో కావల్సినన్ని మినరల్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, పాస్ప రస్‌లాంటివి ఎక్కువగా ఉండి ఎము కలకు బలాన్నిస్తాయి.  మక్క కంకు ల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. కంకులు అధికంగా తినేవారిలో రక్తహీనత కనపడదు. విటమిన్‌ సీ, కెరోటియాయిడ్లు, మయో ప్లేమినాయిడ్లు చెడు కొలెస్టాల్‌ లేకుండా చేసి గుండెకు బలాన్ని ఇస్తాయి. మొక్కజొన్నలో ఉం డే ఫోలిక్‌ యాసీడ్‌ గర్భిణులకు ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్లు చేతు లు వాపులు రాకుండా ఉపయోగపడుతుంది

రక్తహీనతను తగ్గిస్తుంది
మొక్కజొన్నలో విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహంలో ఎర్రరక్త కణాలను ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి. రక్తహీనత (ఎనీమియా) ముప్పు రాకుండా తగిన మోతాదులో న్యూట్రియంట్లను సరఫరా చేయడంలో మొక్కజొన్న దోహదం చేస్తుంది. ఒక కప్పు మొక్కజొన్న గింజల ద్వారా 125 క్యాలరీలు, 27 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 4 గ్రాముల ప్రొటీన్లు, 9 గ్రాముల సూక్రోజు,  రెండు గ్రాముల కొవ్వు, 75 మిల్లీగ్రాముల ఐరన్‌ లభిస్తుంది.

శక్తికారకం
అథ్లెటిక్‌ క్రీడాకారులకు, జిమ్‌లో చెమటలు చిందించేవారికి ఇది శక్తిదాయకంగా పనిచేస్తుంది. మొక్కజొన్నలో బి విటమిన్‌ కుటుంబానికి చెందిన బి1, బి5లతో పాటు విటమిన్‌ సి కూడా ఉంటుంది.  మొక్కజొన్నలో ఉండే కార్బొహైడ్రేట్లు జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది. దీంతో ఎక్కువ సేపు శక్తిదాయకంగా ఉంటుంది. ఒక కప్పు గింజల ద్వారా లభించే  కార్బొహైడ్రేట్లు కేవలం శారీరక శక్తిని పెంపొందించడానికే కాదు మెదడు, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా తోడ్పడుతుంది. అందువల్ల తరచూ ఆహారంలో మొక్కజొన్నతో చేసిన ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. మొక్కజొన్నలో ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, ఐరన్‌, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు పొటాషియం, కాల్షియం కూడా తగు పరిమాణంలో లభిస్తాయి. అందువల్ల బీపీ, గుండె జబ్బులు, అల్జీమర్స్‌ వంటి వ్యాధులను నివారిస్తుంది. సోడియం (ఉప్పులో ఒక భాగం) తక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు ఉన్నవారికి, రక్తపోటు ఉన్నవారికి మొక్కజొన్న ఎంతో ఆరోగ్యకరమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. 

బరువు పెరగడానికి
వయసు, ఎత్తుకు తగ్గ బరువు లేనివారి విషయంలో మొక్కజొన్న దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. బరువు తక్కువ ఉన్నవారు ఆందోళన చెందనవసరం లేదు. జంక్‌ ఫుడ్‌ తింటే వచ్చే బరువు దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీస్తుంది. మొక్కజొన్నతో అటువంటి పరిస్థితి రాదు. తరచూ ఆహారంలో మొక్కజొన్న ఉండేలా చూసుకుంటే ఆరోగ్యకరమైన క్యాలరీలతో పాటు విటమిన్లు, తగిన పరిమాణంలో ఫైబర్‌ కూడా శరీరానికి అందుతాయి.

మధుమేహులకూ మంచిదే
మొక్కజొన్నలో స్వీట్‌ కార్న్‌ రకం ఉంటుంది. స్వీట్‌ కార్న్‌, స్వీట్‌ కార్న్‌ ఆయిల్‌ రెండూ శరీరంలో రక్త సరఫరా సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు రక్తంలో కొలెస్టారాల్‌ శోషణను తగ్గిస్తుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.  అందువల్ల మధుమేహంతో బాధపడేవారికి మొక్కజొన్న ఉత్తమ ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ కూడా మధుమేహం సమస్య ఉన్నవారికి మొక్కజొన్న మేలు చేస్తుందని ప్రకటించింది. రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో మొక్కజొన్న ఉండేలా చూడాలని వైద్యులు చెబుతున్నరు. విటమిన్‌ బి1, బి5, విటమిన్‌ సి సమృద్ధిగా ఉండటంవల్ల వ్యాధులపై పోరాడటంలో ఉపయోగం ఉంటుంది. కొత్త రక్త కణాల ఉత్పత్తికి  కూడా దోహదం చేస్తున్నందున రక్తంలో షుగర్‌ స్థాయులు తగ్గిపోతాయి. మధుమేహులకు ఇది మేలు చేస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.

గర్భిణులకు మేలు
గర్భందాల్చినవారికి మొక్కజొన్న చేసే మేలు ఇంతా అంతా కాదు. గర్భిణికి, గర్భస్త శిశువుకు కూడా మొక్కజొన్న వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నలో ఫోలిక్‌ యాసిడ్‌, జిక్సాన్‌తిన్‌, పాథోజెనిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఉండటం వల్ల శిశువుకు పుట్టుకతో వచ్చే లోపాలను నివారించవచ్చు. మొక్కజొన్నలో పీచు అధికంగా ఉండటం వల్ల సాధారణంగా గర్భిణులకు వచ్చే మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది.‍

చర్మం ఆరోగ్యంగా
మొక్కజొన్నలో విటమిన్లు, లైకోపిన్‌ (యాంటి ఆక్సిడెంట్లు) పుష్కలంగా ఉంటాయి. దీంతో కొలిజిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా యూవీ కిరణాల జనిత ఫ్రీ రాడికల్స్‌తో చర్మానికి హాని కలుగకుండా నివారిస్తుంది. సౌందర్య కారక ఉత్పత్తుల్లో మొక్కజొన్న గింజల నుంచి తయారు చేసే నూనెను వినియోగిస్తారు. అందువల్ల మొక్కజొన్నను చిరుతిండిగా, ఛాట్‌, సూప్‌ తదితరాల్లో చేర్చుకుని హాయిగా తినొచ్చు.

క్యాన్సర్‌ రాదు
మొక్కజొన్న గింజల్లో సమృద్ధిగా కెరొటినాయిడ్స్‌ ఉంటాయి. దీని వల్ల నేత్ర సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.   దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ ఫోలిక్‌ యాసిడ్‌ అన్నిరకాల క్యాన్సర్లకు నిరోధకంగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక, మొండి వ్యాధుల నివారణ మందుల తయారీలోనూ మొక్కజొన్న వినియోగం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును నివారించేందుకు ఉపయోగపడే ఎమినో యాసిడ్స్‌  తూతెయిన్‌, జీక్జాన్‌డిన్‌ మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అంతేకాదు లినోలిక్‌ యాసిడ్, రిబోఫ్లావిన్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ మీద ప్రభావం చూపుతాయి. రక్తలేమిని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. చిన్న ప్రేగుల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. మలబద్ధకం రానీయదు. కొలెస్టారాల్‌ నియంత్రిస్తుంది. అంతేకాదు మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.  వయసు పెరుగుదలతో వచ్చే దుష్ప్రభావాలను  నివారిస్తుంది.




No comments:

Post a Comment