మనం తినే ప్రతీ కూరలో పసుపు కచ్చితంగా ఉంటుంది. సూక్ష్మజీవి నాశనిగా, శోథ నిరోధకంగా పనిచేసే పసుపుతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు. ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్-సీ.. ఇలా బోలెడన్ని పోషకాలు దీని సొంతం. దెబ్బ తాకి రక్తం కారితే ప్రథమ చికిత్సగా పసుపునే వాడతాం. ఈ ఉపయోగాలే కాదు.. అల్జీమర్స్ వ్యాధిని కూడా దూరం చేసి జ్ఞాపకశక్తిని పెంచే దివ్యౌషధంగా పసుపు పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. మనసు ప్రశాంతంగా ఉండటానికీ దోహదం చేస్తుందట. పసుపుపై పరీక్షలు చేసిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు.. దానిలోని పోషకాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయని గుర్తించారు.
No comments:
Post a Comment