Saturday, 6 January 2018

medipallu

మేడి పండ్లను నీడన ఎండించి చేసిన చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి, 10 గ్రాముల చొప్పున ప్రతి రోజూ సేవిస్తూ ఉంటే, రక్తదోషాలు తొలగిపోతాయి. రక్తశుద్ధి, రక్తవృద్ధి కలిగి చ ర్మం కాంతివంతమవుతుంది.
మేడిపండ్ల చూర్ణాన్ని ప్రతి రాత్రి పడుకునే ముందు రెండు స్పూనులు సేవిస్తే మలబద్ధత తొలగిపోతుంది. లేదా తరుచూ మేడిపండ్లను తింటూ ఉన్నా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
60 గ్రాముల మేడి బెరడును నలగగొట్టి, 2 గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత వడబోసి అందులో ఒక స్పూను తేనె కలిపి ప్రతిరోజూ పరగడుపున సేవిస్తూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది
60 మి. లీ మేడి పండ్ల రసంలో అరస్పూను కరక్కాయ పొడి కలిపి ప్రతి రోజూ రెండు పూటలా సేవిస్తూ ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది.
మేడిచెట్టు బెరడు చూర్ణానికి సమంగా పటిక బె ల్లం కలిపి, తులం మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తూ ఉంటే, తెల్లబట్ట సమస్య పోవడంతో పాటు పలురకాల గర్భాశయ వ్యాధులు నయమవుతాయి.
50 - 60 మి. లీ మేడిపండ్ల రసంలో కొద్దిగా తేనె చేర్చి సేవిస్తూ, పాల అన్నం మాత్రమే తింటూ ఉంటే అధిక రకస్రావ సమస్య తొలగిపోతుంది.
10 గ్రాముల మేడి పండ్ల రసాన్ని గానీ, 60 మి. లీ బెరడు కషాయాన్ని గానీ, 40 రోజుల పాటు క్రమం తప్పకుండా సేవిస్తే, అతి మూత్ర వ్యాధితో పాటు, మూత్రంలో రక్తం పడటం కూడా తగ్గుతుంది.
 మేడి చెట్టు జిగురుకు నాలుగు రెట్లు చక్కెర కలిపి 5 గ్రాముల మోతాదులో రెండు పూటలా సేవిస్తూ ఉంటే అధిక వేడి తగ్గుతుంది.
250 మి. లీ చెక్క కషాయంలో 3 గ్రాముల పొంగించిన పటిక చూర్ణం కలిపి రోజుకు మూడు పూటలా పుక్కిలిస్తూ ఉంటే నోటి అల్సర్లు మానిపోతారు.

No comments:

Post a Comment