Saturday, 6 January 2018

Coconut oil

కొబ్బరి నూనె అనగానే కేవలం కేశాల అందాన్ని ఇనుమడింపజేయటానికే అనుకుంటాం. పగిలిన పెదవులకు ఉపశమనం కోసం, ఆహార పదార్థాల రుచిని ఇనుమడింపజేసే వంటనూనెగా వాడతారని కూడా మనకు తెలుసు. కానీ మనకు తెలియని మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కొబ్బరి నూనెలో దాగున్నాయి.
 కొబ్బరి నూనెలో ఉండే కొన్ని రకాల ఆమ్లాలు, ట్రైగ్లిసరైట్స్‌లు వల్ల అదనంగా 200 కెలోరీల శక్తి శరీరానికి లభిస్తుంది. దీనివల్ల శరీరంలో శక్తి ఉత్పాదకత ఐదుశాతం పెరుగుతుంది.
 హానికారక సూక్ష్మజీవులను, వైర్‌సలను నిర్మూలించే లారిక్‌ యాసిడ్‌, మోనోగ్లిజరైడ్‌లు కొబ్బరి నూనెలో అధిక పాళ్లలో ఉంటాయి. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు.
 కొబ్బరి నూనెలో ఉండే ట్రైగ్లిసరైట్లను కాలేయం జీర్ణం చేసుకొని కెటోన్లను ఉత్పత్తి చే స్తుంది. ఇవి మెదడుకు తక్షణ శక్తిని ఇస్తాయి. సొంతంగా తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో మెదడు ఉన్నప్పుడు అది విధులను నిర్వహించటానికి ప్రత్యామ్నాయ శక్తి వనరుగా ఉపయోగపడతాయి.
 కొబ్బరి నూనెలో నేచురల్‌ సాచ్యూరేటెడ్‌ ఫాట్స్‌ ఉంటాయి. ఇవి గుండె జబ్బులు తగ్గటానికి దోహదం చేస్తాయి. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతాయి.
మతిమరుపుతో సతమతమయ్యేవారికి ట్రైగ్లిసరైట్స్‌ మరచిపోయిన విషయాలను తిరిగి గుర్తుకు తెచ్చుకునేందుకు సహాయపడతాయని పరిశోధనల్లో రుజువైంది. అంతేకాదు ట్రైగ్లిసరైట్స్‌ను మెదడు ఇన్సులిన్‌ లేకుండానే నేరుగా గ్రహిస్తుంది. దీనివల్ల మెదడు కణాలు మరింత చురుగ్గా పనిచేస్తాయి. కొబ్బరి నూనెలో ఉండే ట్రైగ్లిసరైట్స్‌ సులభంగా జీర్ణమవుతాయి. పాంక్రియాస్‌ ఎదుర్కొనే జీవక్రియల ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఆరోగ్యాన్ని దెబ్బతీసే హార్మోన్ల అసమతుల్యతను కొబ్బరినూనె నివారిస్తుంది. ఇందులో ఉండే లారిక్‌ యాసిడ్‌, ఈస్ట్రోజన్‌ హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి.
నోట్లో కొబ్బరి నూనెను పోసుకొని పుక్కిలించటం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
విటమిన్‌, క్యాల్షియం, మెగ్నీషియాలను గ్రహించటానికి కొబ్బరినూనె శరీరానికి సహకరిస్తుంది. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు రెట్టింపు ప్రభావంతో పనిచేస్తాయి. జీర్ణాశయంలో చెడు బ్యాక్టీరియాను నిర్మూలించి, శిలీంధ్ర సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి.



కొబ్బరి తీయటి కొబ్బరి నీళ్లు, మీగడలాంటి కొబ్బరి, కొబ్బరిముక్కలు, కొబ్బరి పాలు, కొబ్బరినూనె , కొబ్బరి చక్కెర..  సైతం కొబ్బరి రారాజు.  కొబ్బరిలో ఆరోగ్య లాభాలు కూడా తక్కువేమీ లేవు. అవేమిటంటే...
  • కొబ్బరి బ్రెయిన్‌ ఫుడ్‌! కొబ్బరినీళ్లు, కొబ్బరినూనెలతో స్వల్పకాలంలో డెమెన్షియా, అల్జీమర్స్‌ వంటివాటిని నిరోధించవచ్చు.
  • ఇది యాంటి-ఇన్ఫ్లమేటరీ.
  • రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • పోషకాలు, విటమిన్లు, ఖనిజాలను శరీరానికి అందజేస్తుంది.
  • జీర్ణక్రియ బాగా జరిగేలా సహాయపడుతుంది.
  • ఫ్రీరాడికల్స్‌ లేకుండా చేసి ప్రిమెచ్యూర్‌ ఏజింగ్‌ నుంచి రక్షిస్తుంది.
  • గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
  • గుడ్‌ కొలెస్ట్రాల్‌(హెచ్‌డిఎల్‌)ను పెంచుతుంది.
  • కొబ్బరి తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ పనితీరు బాగుంటుంది.
  • కిడ్నీ జబ్బులు, బ్లాడర్‌ ఇన్ఫెక్షన్లు రాకుండా సంరక్షిస్తుంది.
  • బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
  • కొబ్బరి వాడకం వల్ల వెంట్రుకలు, చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.
  • చర్మం ముడతలు పడదు. సాగదు. చర్మాన్ని సూర్యకాంతి నుంచి సైతం సంరక్షిస్తుంది.
  • కొబ్బరిలో డయటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉంది.
  • మధుమేహాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
  • పొట్టచుట్టూ చేరిన ప్రమాదకర ఫ్యాట్‌ను తగ్గిస్తుంది.
  • రోజూ 200 గ్రాముల కొబ్బరి చొప్పున పన్నెండు వారాల పాటు క్రమం తప్పకుండా తింటే బిఎంఐతో పాటు నడం చుట్టుకొలత కూడా తగ్గుతుంది.
  • శరీరంలోని ఫ్యాట్‌ను కరిగించి ఎనర్జీని పెంచుతుంది.
  • శరీరాన్ని ఎల్లవేళలా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
  • పాలలో కన్నా కొబ్బరి నీళ్లల్లో పోషకవిలువలు, ఆరోగ్య సుగుణాలు అధికంగా ఉన్నాయి. 
  • మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
  • బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ని పెంచి గుండెజబ్బులు రాకుండా తగ్గిస్తుంది.
  • ఎసిడిటీ, గుండెల్లో మంటలను నిరోధిస్తుంది.
  • ఎన్నో పోషకవిలువలు ఉన్న కొబ్బరినీళ్లు గర్భిణీలకు చాలా మంచిది. కడుపులోని బిడ్డతో పాటు తల్లికి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • రోజూ కొబ్బరి తినడం వల్ల ఎముకలు పటిష్టంగా పెరగడంతో పాటు దంతాలు దృఢంగా తయారవుతాయి.
  • చర్మంలోని పొడారిపోయే గుణాన్ని కొబ్బరి నూనె నిరోధిస్తుంది.
  • కొబ్బరి వాడకం వల్ల శరీరంలోని విషపదార్థాలు శుభ్రం కావడంతో పాటు చర్మం పై పొరలోని ఫంగస్‌, బ్యాక్టీరియాలు అచేతనమవుతాయి.
  • కొబ్బరి తినడం వల్ల చర్మ కాన్సర్‌ రిస్కు తగ్గుతుంది.
  • రోజూ కొబ్బరి తినడం వల్ల చర్మంలో ఆక్సిజన్‌ పాళ్లు పెరిగి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. టానింగ్‌ను తగ్గిస్తుంది.
  • జిడ్డు చర్మంపై కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయి. చర్మంలోని అదనపు ఆయిల్‌ని పోగొట్టడం వల్ల చర్మం టోనింగ్‌ సమతుల్యంగా ఉంటుంది.
  • చక్కెర, కొబ్బరి నూనె కలిపి శరీరానికి స్క్రబ్బర్‌గా వాడొచ్చు.
  • స్వచ్ఛమైన కొబ్బరినూనె వాడడం వల్ల జుట్టు రాలదు. కొబ్బరినీళ్ల వల్ల కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. కొబ్బరిలోని యాంటీ-బ్యాక్టీరియల్‌, యాంటి- ఫంగల్‌ సుగుణాలు తలలో చుండ్రు, పేలు చేరడాన్ని నిరోధిస్తుంది.

No comments:

Post a Comment