Wednesday, 31 January 2018

Jaafraa ginjalu ( anota )

జాఫ్రా గింజలను ఏం చేస్తారు...
జాఫ్రా గింజల నుంచి సహజసిద్ధమైన సింధూర రంగు వస్తుంది. దీనిని ఐస్‌ క్రీమ్‌లు, మాంసాహారం, సుగంధద్రవ్యాలు, వెన్న, జున్ను, మిఠాయిలు, శీతల పానీయాలు, పప్పుధాన్యాలు, బియ్యంతో తయారుచేసే వంటకాల్లో సేంద్రీయ రంగుగా ఉపయోగిస్తారు. అలాగే వస్త్రాలు, సౌందర్య సాధనాలు, సబ్బులు, చెప్పుల పాలిష్‌, నెయిల్‌ పాలిష్‌, హెయిర్‌ ఆయిల్స్‌ తయారీలో కూడా వినియోగిస్తున్నారు. అంతేకాక జాఫ్రాలో మంచి ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్నట్టు నిపుణుల అఽధ్యయనంలో వెల్లడయ్యింది. జాఫ్రా గింజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కెరోటినాయిడ్లు అధికంగా వున్నాయి. ఈ చెట్టు బెరడును ఆయుర్వేద వైద్యంలో గనేరియా వ్యాధి నివారణకు, వితనాల గుజ్జును బంక విరేచనాలను అరికట్టేందుకు, ఆకులను పాముకాటు విషం విరుగుడుకు, పచ్చకామెర్ల నివారణకు ఉపయోగిస్తున్నారు. జాఫ్రా గింజలతో బహుళ ప్రయోజనాలు వుండడంతో పలు దేశాలు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. మన్యంలో వీటిని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసి ఎగుమతి వ్యాపారులకు సరఫరా చేస్తుంటారు. 

No comments:

Post a Comment