Saturday, 3 February 2018

lavangalu cloves




మసాలాల్లో లవంగాలు ఎంతో ముఖ్యమైనవి. 
వంద గ్రాముల లవంగాల్లో 65 గ్రాముల కార్బోహైడ్రేట్లు, ఆరు గ్రాముల ప్రొటీన్లు, 13 గ్రాముల టోటల్‌ లిపిడ్స్‌, 2 గ్రాముల చక్కెర, 33 గ్రాముల డయటరీ ఫైబర్స్‌ ఉన్నాయి. ఇక ఖనిజాల విషయానికి వస్తే క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, సోడియం, జింకులు లవంగాల్లో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్‌-సి, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, ఫోలేట్‌, విటమిన్‌-బి6, విటమిన్‌-బి12, విటమిన్‌-ఎ, ఇ, డి, కెలు వీటిల్లో ఉన్నాయి.
లవంగాల వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. జీర్ణశక్తి సమస్యలు తలెత్తినపుడు నూనె లేకుండా లవంగాలను వేగించి పొడి చేసి తేనెలో వేసుకుని తీసుకుంటే మంచిది.
గ్యాస్ట్రిక్‌ సమస్యలను ఇవి తగ్గిస్తాయి.
యాంటీబ్యాక్టీరియల్‌ సుగుణాలు వీటిల్లో ఉన్నాయి. కలరాకు కారణమైన బాక్టీరియాపై లవంగాలు శక్తివంతమైన ప్రభావం చూపుతాయి.
క్యాన్సర్‌ను అడ్డుకునే గుణాలు ఉన్నాయి. ప్రారంభదశలో ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నిరోధించడంలో లవంగాలు సహాయపడతాయని వైద్య పరిశోధనల్లో వెల్లడైంది.
లవంగాల్లో భారీగా యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని కాపాడతాయి.
మధుమేహ నియంత్రణలో కూడా లవంగాలు బాగా పనిచేస్తాయి.
లవంగాల్లోని ఫ్లెవోన్స్‌, ఐసోఫ్లెవోన్స్‌, ఫ్లేవనాయిడ్స్‌ ఎముకల దృఢత్వాన్ని పరిరక్షిస్తాయి.
లవంగాల్లో రోగనిరోధకశక్తిని పరిరక్షించే సుగుణాలు ఉన్నాయి ఇవి శరీరంలో తెల్లరక్తకణాలను పెంచడం ద్వారా రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
యాంటిఇన్‌ఫ్లమేటరీ, పెయిన్‌కిల్లింగ్‌ గుణాలు కూడా లవంగాల్లో ఉన్నాయి.
దంత సంబంధమైన జబ్బులను సైతం నివారిస్తాయి. పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు కూడా లవంగాలు వాడతారు. అలాగే నోటిదుర్వాసన తలెత్తకుండా ఉండేందుకూ లవంగాలు వాడతారు.
బాగా తలనొప్పి ఉంటే లవంగాలు తింటే తగ్గుతుంది. కొన్ని లవంగాలు తీసుకుని కాస్త రాళ్ల ఉప్పుతో కలిపి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసు పాలల్లో కలిపి తాగితే తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు లాభాలు ఉన్నాయి.




No comments:

Post a Comment