Saturday, 4 March 2017

Alubukara

యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆలుబుకారా పండ్లు తినడం వల్ల కేన్సర్‌ బారినపడే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఉండే బీటాకెరోటెన్‌ అనే యాంటాక్సిడెంట్‌ ఊపిరితిత్తులు, నోటి సంబంధ కేన్సర్లను దరిచేరనీయదు. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమయ్యే పొటాషియం, ఫ్లోరైడ్‌, ఐరన్‌ వంటి ఖనిజాలు కూడా ఆలుబుకారాల్లో ఉంటాయి.  వీటిలో ఉండే ఇతర యాంటాక్సిడెంట్లు, శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. ఆలుబుకారా తింటే జీర్ణాశయ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం, జ్వరానికి మంచి విరుగుడు ఇది మంచి మందులా పని చేస్తుంది. కేలరీలు తక్కువ, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఈ పండ్లను తినడంవల్ల బరువు పెరుగుతామనే చింతే ఉండదు. ఇందులోని విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల దృఢత్వాన్ని కాపాడే విటమిన్‌-కె పాళ్లు కూడా ఈ పండులో ఎక్కువే. 
ఎరుపు, నలుపు, నీలం రంగుల్లో దొరికే ఆలుబుకారా పండ్లతో జామ్‌, జ్యూస్‌, చట్నీలు తయారుచేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టపడే జెల్లీలు, కేకులు కూడా తయారుచేసుకోవచ్చు. చైనాలో వైన్‌ తయారీకి ఎక్కువగా ఈ పండ్లనే ఉపయోగిస్తారు. ఇంగ్లాండ్‌, సెర్బియా వంటి యూరప్‌ దేశాల్లో ఆల్కాహాలిక్‌ డ్రింక్స్‌ను ప్రత్యేకంగా ఆలుబుకారా పండ్లతో తయారుచేస్తారు.
 

Dalchina Chekka - Sinnamom

కొద్ది మందిలో గాయాలు మానినట్టేమాని మళ్లీ తిరగబెడతుంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న గాయాల వల్ల మరి కొందరు శరీర భాగాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇటువంటి గాయాలు పూర్తిగా మానడానికి పరిశోధకులు ఒక మందును కనిపెట్టారు. పుదీనా నూనె, దాల్చిన చెక్క కలిపి ఒక మందును తయారుచేశారు. ఈ మందు గాయాల్లో ఉండే హానికరమైన క్రిములను నాశనం చేస్తుంది. అలాగే గాయాలు అతి త్వరగా మానేలా చేస్తుంది. గాయాల వద్ద ఉండే బ్యాక్టీరియా, క్రిములను సంప్రదాయ పద్ధతుల ద్వారా పూర్తిగా తొలగించలేము. అందువల్ల కొన్నిసార్లు గాయాలు ఏర్పడిన అవయవాలను కూడా తీసేయాల్సి వస్తుంది. పుదీనా నూనె, సిన్నమాల్డిహైడ్‌లున్న ఈ ఔషధం గాయాల్లో ఉండిపోయిన మట్టిని పూర్తిగా తొలగిస్తుంది. ‘‘ఈ క్యాప్సూల్స్‌ చికిత్స ద్వారా నాలుగు రకాల బ్యాక్టీరియాలను, ఇతర క్రిములను నాశనం చేయవచ్చు. అలాగే గాయాలు మానడంలో తోడ్పడే ఫైబ్రోబ్లాస్ట్స్‌ అనే శరీర కణాల ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది’’ అని పరిశోధకులు చెబుతున్నారు.





  • జీర్ణ సంబంధ సమస్యలకు దాల్చిన చెక్క మందుగా పనిచేస్తుంది. దీనిలోని పీచుపదార్థం కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు ఆకలిని పెంచుతుంది.
  • దాల్చిన చెక్కనూనె ఒంటికి రాసుకుంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.
  • దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్త సరఫరా సవ్యంగా జరిగేలా చూస్తాయి.
  • వీటిలోని సిన్నమాల్దిహైడ్‌, నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి, తాజా శ్వాసను ఇస్తుంది. దాల్చిన చెక్కను నీళ్లలో వేసి, మరిగించి, ఆ నీటిని
  • మౌత్‌వా్‌షగా ఉపయోగించొచ్చు.
  • వీటిలోని ప్రొటీన్లు చర్మం మీది ముడతల్ని నివారించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమం ముఖానికి
  • తాజాదనాన్ని ఇస్తుంది.
  • దాల్చినచెక్కను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తపీడనం అదుపులో ఉంటుంది. చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. టైప్‌ 2 డయాబెటీస్‌ ఉన్నవారు ప్రతి రోజు టీ స్పూన్‌ దాల్చిన చెక్క పొడి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  • కొలెస్ట్రాల్‌ ఉత్పత్తికి కారణమయ్యే ఎంజైమ్‌ను నియంత్రించి, రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చూస్తుంది. గుండె సంబంధ
  • జబ్బులను నివారిస్తుంది.
  • పలు రకాల కేన్సర్ల ముప్పును దాల్చిన చెక్క నివారిస్తుంది. వీటిలోని
  • మెగ్నీషియం, కాల్షియంతో కలిసి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ పెంచి, కురులు పెరిగేందుకు తోడ్పడుతుంది. టేబుల్‌ స్పూను దాల్చినచెక్క పొడి, తేనె, కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ నూనె కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.
  • దాల్చిన చెక్క వాసన మెదడును ఉత్తేజితం చేస్తుందని, దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకుంటే పార్కిన్‌సన్స్‌, అల్జీమర్స్‌ వంటి వ్యాధుల ముప్పు తప్పుతుందని పరిశోధనల్లో తేలంది.
  • ఈ సీజన్‌లో వేధించే జలుబు, జ్వరాలను దాల్చినచెక్క నివారిస్తుంది.

Mullangi

ముల్లంగిలో నీటిశాతం ఎక్కువ. సి-విటమిన్‌తో పాటు జింక్‌, పాస్ఫర్‌సలు ఇందులో ఉంటాయి. ముల్లంగి వల్ల ఉపయోగాలేంటీ.. 
 ముల్లంగి తరచు తింటే ఇన్ఫెక్షన్లు మన జోలికి రావు. 
జీర్ణాశయంలోని వ్యర్థపదార్థాల్ని శుభ్రపరిచే గుణం వీటికి ఉంది. 
 ముక్కు, గొంతునొప్పి, దగ్గు-జలుబు లాంటివి దరిచేరకుండా ఉండాలంటే ముల్లంగి తినాలి. 
కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా ఉండి, నీటిశతం అధికంగా ఉండే ముల్లంగిని డైట్‌లో చేరిస్తే త్వరగా బరువు తగ్గుతారు. 
 గుండె, కిడ్నీ, జీర్ణాశయం సమస్యలు రాకుండా చేస్తుంది. 
 ముల్లంగిని తింటే రక్తశుద్ధి జరుగుతుంది. దీంతోపాటు శరీరంలోని వ్యర్థాల్ని పారద్రోలుతుంది. ముఖ్యంగా ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. దీనివల్ల జాండీస్‌లాంటి వ్యాధితో బాధపడేవారికి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

Friday, 3 March 2017

Jonnalu

జొన్నలు ఆరోగ్యానికి మంచివని చాలామంది అంటుంటారు. అయితే అవి తినడం వల్ల ఎటువంటి పోషకాలు లభిస్తాయో చాలామందికి తెలియదు. 
జొన్నల్లో ప్రొటీన్లే కాకుండా పాస్పరస్‌, మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, జింక్‌, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, నేరేడు పండు వంటి వాటిల్లో ఉండే వాటికన్నా రెట్టింపు యాంటాక్సిడెంట్లు జొన్నల్లో ఉంటాయి. గుండెజబ్బులు, కేన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరకుండా ఈ యాంటాక్సిడెంట్లు కాపాడతాయి. మెరుగైన జీర్ణక్రియకి తోడ్పడే ఫైబర్‌ జొన్నల్లో ఎక్కువగా లభిస్తుంది. వీటిల్లో నియాసిన్‌ అనే బి-6 విటమిన్‌ కాంపౌండ్‌ ఉంటుంది. అది తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణం అయి శక్తిలా మారడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోకుండా ఉంటాయి.
 

Lavanga Tulasi

ఆహారపానీయాలలోనూ, ఔషధంగానూ ఈ మొక్కను ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కలో ప్రతీ భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క నుంచి సుగంధ పరిమళభరితమైన వాసన వస్తుంటుంది. దీనికి కారణం యూజెనాల్‌, మిథైల్‌ యూజెనాల్‌, కారియోఫిల్లీన్‌, సిట్రాల్‌, కేంఫర్‌, థైమాల్‌ వంటి ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌ ఉండటమే. ఇలాంటి అరోమాటిక్‌ తైలాల మిశ్రమాలు యాంటిసెప్టిక్‌గా పనిచేస్తాయి. లవంగ తులసి మొక్కలు ఎక్కువగా పెంచితే ఆ పరిసరాలు పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా ఉంటాయి. దోమలను పారదోలుతాయి. 
ప్రయోజనాలు
లవంగ తులసి ఆకులను కషాయంగా చేసుకుని తాగితే దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీర్ణశక్తిని కలిగించుటకు, శరీరానికి సత్తువ చేకూర్చుటకు ఉపయోగపడుతుంది.
కీళ్ల సమస్యలను, రక్తస్రావాలను నిరోధించుటకు ఉపకరిస్తుంది.
తలనొప్పి, పంటి నొప్పి, చెవిపోటు బాధలకు నివారిణిగా పనిచేస్తుంది.
చిన్న పిల్లల ఉదర సమస్యలకు దివ్యౌషధం. తేనెతో కలిపి తీసుకుంటే వాంతులు కావు.
దీని విత్తన ఔషధం విరేచనాలు, నరాల బలహీనతలు, మూత్ర సమస్యలు, చంటి పిల్లల్లో వాంతుల నివారణకు పనిచేస్తుంది.
 ఆకుల రసం వీర్యవృద్ధికి, ఎర్రరక్తకణాల పెంపుకు తోడ్పడుతుంది. 
కాలేయ వ్యాధుల నివారణకు, కాలేయ పనితనాన్ని మెరుగుపరుచుటకు ఉపయోగపడుతుంది.
దోమలను వికర్షించు శక్తి అధికంగా ఉండటం వల్ల రకరకాల ఉత్పత్తుల్లో దీనిని విస్తృతంగా వాడుతున్నారు.
షుగర్‌ వ్యాధికి తీసుకును ఔషధాల పనితనాన్ని మెరుగుపరచడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది.

Ulavalu

పాతకాలంలో వేసవి వచ్చిందంటే చాలు ఉలవ గుగ్గిళ్లు పొయ్యిల మీద సలసల ఉడికేవి. రెండు దోసిళ్ల గుగ్గిళ్లు తిని, గ్లాసుడు నీళ్లు తాగితే.. ఆ రోజుకు అదే మంచి పౌష్టికాహారం. ఇక, మరుసటిరోజు ఉలవచారు తాగితే.. ఆహా.. ఆ సంతృప్తే వేరు. ఉలవలు ఎక్కువగా తిన్నవాళ్ల ఆరోగ్యం గుర్రంలా దౌడు తీసేది అందుకే! వాటి బలం మరే గింజలకు రాదు. ప్రస్తుతం ఉడికించిన గింజలను తినే అలవాటున్న వాళ్లు.. ఏ శనగలనో, పెసరగింజలనో తినడానికి ఇష్టపడుతున్నారు కాని.. ఉలవల జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే వాటిని ఉడికించడం అంత సులభం కాదు. కాని వారానికి ఒకసారైనా మీ మెనూలో ఉలవల్ని ఎందుకు చేర్చాలో చూద్దాం. వంద గ్రాముల పిజ్జా తింటే.. అందులో పన్నెండు గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే వంద గ్రాముల ఉలవల్ని తింటే కొవ్వులు అస్సలు ఉండవు. వంద గ్రాముల ఉలవగుగ్గిళ్లలో 321 కేలరీలశక్తితోపాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు పీచుపదార్థమూ లభిస్తుంది. అదే పిజ్జాలలో అయితే - ఇంతేసి మోతాదులో పోషకవిలువలు శూన్యం. అందుకే ఉలవల విలువను ఆయుర్వేదం ఏనాడో గుర్తించింది. జ్వరం, జలుబు, గ్యాస్ట్రిక్‌, పెప్టిక్‌ అల్సర్లు, కాలేయ, మూత్రపిండ సమస్యలను తగ్గిస్తుంది ఉలవ. మహిళలలో వచ్చే బహిష్టు సమస్యకు చక్కటి పరిష్కారం వీటితో సాధ్యం. 
 
ఇక, కండరాలను పటిష్టంగా ఉంచడంతోపాటు నరాలబలహీనత రానివ్వవు ఉలవలు. వీటిని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పలు పద్ధతుల్లో వినియోగిస్తారు. ఉలవచారు, గుగ్గిళ్లు, కూరలు, లడ్డూలు, సూప్‌లు ఇలా ఈ మధ్య కాలంలో అందరినీ వేధించే అధిక బరువు సమస్యకు ఉలవలు భేషైన పరిష్కారం. నాణ్యమైన ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేగించి.. చల్లారిన తరువాత మెత్తటి పౌడర్‌లా చేయాలి. రోజూ   పరకడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే బరువు తగ్గుతారు. ఉలవల మీద ఇదివరకే బోలెడన్ని పరిశోధనలు వచ్చాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ అధ్యయనం ప్రకారం ఉలవల్లో మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉన్నట్లు తేలింది.

Thursday, 2 March 2017

Cherries

చెర్రీ పండు జ్యూస్‌ను తాగడం వలన కీళ్లనొప్పులను చాలా వరకూ తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. వ్యాయామం సమయంలో వచ్చే కీళ్లనొప్పులకు మంచి ఉపశమనంగా ఈ జ్యూస్‌ పనిచేస్తుందని వారు చెబుతున్నారు. అయిుతే ఒక్కసారిగా కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉండదనీ, కనీసం నాలుగైదు వారాలపాటు ఈ జ్యూ్‌స్‌ను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలకు ఈ జ్యూస్‌చాలా బాగా ఉపయోగపడుతుందని వారు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఊబకాయాన్ని తగ్గించుకునేవారికి ఇది మందులాగా కూడా పని చేస్తుంది అని వారు అంటున్నారు.