పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇందులో డి-విటమిన్ బాగా ఉండడం వల్ల చర్మంపై మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు.
ముఖానికి రాసుకునే సీరమ్స్‌లో పుట్టగొడుగుల నుంచి తీసిన పదార్థాలు ఉంటాయి.
బి1, బి2, బి3, బి5, బి9లు వీటిల్లో ఉన్నాయి. ఇందులోని విటమిన్-బి ప్రధానంగా ఒత్తిడి, యాంగ్జయిటీలను తగ్గిస్తుంది.
ఎలర్జీలు, ఆర్థరైటిస్ వంటి జబ్బుల నివారణలో శక్తివంతంగా పనిచేస్తాయి.
ఇవి సహజసిదఽ్ధమైన మాయిశ్చరైజర్ గుణాన్ని కలిగివుంటాయి.
పుట్టగొడుగుల్లో చర్మానికి కావలసిన హైడ్రైటింగ్ గుణాలున్నాయి. అందువల్ల చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది.
పుట్టగొడుగులు తీసుకోవడంవల్ల వయసు కనపడదు. ముఖ్యంగా చర్మం కాంతి విహీనం కాదు. స్కిన్‌టోన్ దెబ్బతినదు. వయసు మీదపడ్డం వల్ల తలెత్తే మచ్చలను కూడా ఇవి నివారిస్తాయి. పుట్టగొడుగుల్లో విటమిన్-డితో పాటు యాంటి-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వాతావరణ కాలుష్యం వల్ల చర్మంపై తలెత్తే ముడతలు, ఎగ్జిమా వంటి సమస్యలను తగ్గిస్తాయి.
యాంటి-ఇన్‌ఫ్లమేటరీ, యాంటి-ఆక్సిడెంట్ల సుగుణాలు వీటిల్లో బాగా ఉన్నాయి.
వీటిల్లో ఫ్యాట్, కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ.
వీటిల్లోని పీచుపదార్థాలు, ఎంజైములు కొలెస్ట్రాల్ ప్రమాణాన్ని తగ్గిస్తాయి.
ఇవి రక్తహీనతను కూడా తగ్గిస్తాయి.
రొమ్ము, ప్రొస్టేట్ కాన్సర్లను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయి.
మధుమేహవ్యాధిగ్రస్థులకు లైట్ డైట్ ఇవి.
పుట్టగొడుగుల్లో కాల్షియం శాతం అధికం. అందుకే వీటిని తరచూ తినడం వల్ల ఆస్టియోపొరాసిస్ తలెత్తదు.
రోగనిరోధక శక్తిని ఇవి పెంపొందిస్తాయి.
పుట్టగొడుగుల్లో సహజసిద్ధమైన యాంటిబయోటిక్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.
పుట్టగొడుగుల్లో పొటాషియం ఎక్కువ ఉంది. ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి వృద్ధిచెందుతుంది.
ఐరన్ ప్రమాణాలు కూడా వీటిల్లో బాగా ఉన్నాయి.
శరీర బరువును తగ్గించడంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయి.
గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి.
No comments:
Post a Comment