నల్ల ద్రాక్షలు వేసవి తాపానికి చల్లదనాన్ని సమకూరుస్తాయి. ద్రాక్షలో ఖనిజలవణాలు ఆరోగ్యానికి రక్షణ కవచాలుగా పని చేస్తాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అజీర్తి, కంటి సమస్యలు, మరెన్నో జబ్బుల నివారణకు ద్రాక్ష పెట్టింది పేరు. ద్రాక్ష చక్కటి రుచితోపాటు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ద్రాక్షను వాడాలని పోషకాహర నిపుణులు తెలుపుతున్నారు. ద్రాక్షలో సీ-విటమిన్, సీ- విటమిన్‌తోపాటు విటమిన్-ఏ, బీ6, ఫోలిక్ ఆమ్లంకూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి.
పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫా స్పరస్, మెగ్నీషియం, సెలీనియంలాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు ద్రాక్షలో స మృద్ధిగా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ద్రాక్షలో ప్లేవ్‌నాయిడ్స్‌లాంటి శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ టంవల్ల వయస్సు మీద పడటం వల్ల కలిగే ముడతలను తగ్గిస్తాయి. ద్రాక్షలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం గుండెకు రక్షణ ఇస్తాయి.
ద్రాక్ష తొక్కలో సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుకున్ని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాక ద్రాక్ష రక్తంలో నైట్రిన్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి, నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి, గుండెపోటు నివారణకు దో హదపడుతాయి.
మలబద్దకం, అజీర్తికి మంచి ఔషధంగా పనిచేస్తాయి, ద్రాక్షలు యూరిక్ ఆమ్లం సాంద్రతను తగ్గిస్తాయి. తద్వారా ఆమ్లం మోతాదు తగ్గుతుంది. అందువల్ల కిడ్నీలపై పనిభారం తగ్గి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతీరోజు ద్రాక్షలు తీసుకుంటే మాక్యులర్ డీజనరేషన్ అవకాశం 36శాతం తగ్గిపోతుంది. నీళ్లు కలపకుండా చిక్కని ద్రాక్షరసం తీసుకుంటే మై గ్రేవ్‌నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండు ద్రాక్షలో రెయిసిన్స్ ఉండి మలబద్దకం, ఆసిడోసిన్, రక్తహీనత జ్వరాలు, లైంగిక సమస్యలను త గ్గించడంతోపాటు కంటి పరిరక్షణలో ద్రాక్ష రక్షణగా కాపాడుతుంది..
No comments:
Post a Comment