- మామిడి టెంకలోని జీడిని ఎండబెట్టి, ఆ తర్వాత చూర్ణం చేసి, 3 గ్రాముల చొప్పున రోజుకు రెండు సార్లు తేనెతో సేవిస్తే, ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. ఇతరమైన పలు దగ్గు సమస్యలు హరిస్తాయి.
- జీడి చూర్ణాన్ని 2 గ్రాముల పంచదారతో రోజూ రెండు సార్లు సేవిస్తే, తెల్లబట్ట (లుకోరియా)తో పాటు, కడుపులోని మంట తగ్గుతాయి.
- జీడి పొడిని జుట్టుకు రాస్తే చుండ్రు తగ్గిపోతుంది.
- లేత మామిడి చిగుళ్లు నూరి, 5 నుంచి 15 గ్రాముల ముద్దను పెరుగులో కలిపి రోజుకు మూడు సార్లు సేవిస్తే అతిసార సమస్య ఆగిపోతుంది.
- రెండు చెంచాల మామిడి పట్ట రసాన్ని గానీ, ఒక చెంచా మామిడి పట్టా పొడిని గానీ సేవిస్తే, వాంతి ద్వారా లేదా, మల విసర్జన ద్వారా వచ్చే రక్తస్రావం ఆగిపోతుంది.,
- మామిడి ఆకుల కషాయంతో పుక్కిలి పడితే, దంత చిగుళ్ల వాపు, నోటి పూత తగ్గుతాయి.
మామిడి ఆకులో మాంగిఫెరిన్, కాటెచిన్స్ , క్వెర్సెటిన్ వంటి పాలీఫెనోలిక్ సమ్మేళనాల సమృద్ధిలో ఉన్నాయి. ఈ సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది జ్ఞాపకశక్తి క్షీణత, మానసిక అలసట, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారకం. వీటి నుంచి రక్షణ ఇస్తాయి మామిడి ఆకులు . అంతేకాదు ఈ ఆకులలో పుష్కలంగా లభించే మాంగిఫెరిన్, ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా సహజ కవచంగా పనిచేస్తుంది. వీటిల్లో ఉన్న పాలీఫెనోలిక్ సమ్మేళనాల శోథ నిరోధక స్వభావం మెదడులోని మైక్రోఇన్ఫ్లమేషన్‌ను శాంతపరచడంలో సహాయపడుతుంది. మామిడి ఆకులో ఉన్న ఈ లక్షణాలు నాడీ వ్యవస్థ ఆరోగ్యం , పనితీరుకు మద్దతు ఇస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.


No comments:
Post a Comment