Herbal Medicines traditionally used in India as per Ayurveda
Wednesday, 19 October 2016
Kakara kaya
కాకరకాయలో హైపోగ్లైసెమిక్ పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తం, మూత్రంలోని షుగర్ లెవల్స్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కాకరకాయ రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్ దరిచేరకుండా ఉంటుంది. లివర్ శుభ్రపడుతుంది. అంతేకాకుండా రక్తంను శుభ్రపరచడంలో కాకరకాయ చాలా తోడ్పడుతుంది. రక్తంలోని మలినాల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇది నివారిస్తుంది. కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే అనారోగ్యం దరిచేరదు. కాకరకాయ ఆకుల నుంచి తీసిన మూడు టీ స్పూన్‌ల రసాన్ని, ఒక గ్లాసు బట్టర్‌మిల్క్‌తో కలిపి ప్రతి రోజు ఉదయం పరగడపున ఒక నెల రోజుల పాటు తీసుకుంటే పైల్స్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. కాకరకాయ చెట్టు వేళ్లను పేస్టులా చేసి పైల్స్ ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కాకరకాయ జ్యూస్ బాగా ఉపకరిస్తుంది. ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడంలోనూ, రక్తంలోని మలినాలను తొలగించడంలోనూ తోడ్పడుతుంది.
అనాదిగా ఆసియాలో ప్రసిద్ధిచెందిన పాదుమొక్క కాకరకాయ. ఈ పేరు వినగానే చాలామంది చేదుగా మొహం పెట్టేస్తారుగానీ కాకరకాయ మనదేశంలో ఎప్పటినుండో ఔషధంగా ఉపయోగపడుతోంది. సంప్రదాయ వంటకాల్లో వారానికి ఒకసారైనా కాకరకాయ కూర, కాకరకాయ పులుపు తినాలని పెద్దలు చెబుతారు ఎందుకంటే ఇది శరీరంలో సుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. మధుమేహ రోగులకు నిలయంగా మారుతున్న మనదేశంలో కాకరకాయరసం ఇప్పుడు ఇంటింటా దివ్యౌషధంగా మారింది. కాకరకాయ జ్యూస్ బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. రోజూ ఉదయంపూట క్రమం తప్పకుండా ఈ రసం తీసుకుంటే శరీరంలోని అల్ఫా గ్లూకోసైడ్స్ తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. కాకరకాయలో ఉండే యాంటీ హైపర్ గ్లిజమిక్స్ బ్లడ్, షుగర్ లెవెల్స్‌ను తగ్గించి, కాలేయం, మూత్రాశయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శ్వాస సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. కాకరకాయలో ఎ,బి,సి విటమిన్లు, బీటా కెరోటిన్, పొటాషియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, మాంగనీసు ఎక్కువుంటాయి. దీని ఆకులు, పండిన కాయలు ఉడికించి తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇది మొటిమలు, మచ్చల నివారిణి కూడా.
Chana boiled
బ్లాక్ బెంగాల్ గ్రామ్ (నల్ల శనగ) డయాబెటిస్, గుండెజబ్బులున్న వారికి ఎంతో మంచిది. బరువు కూడా తగ్గుతారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉన్న సూపర్‌ఫుడ్స్ ఇవి.
పసుపులోని కుర్‌క్యుమిన్‌లో యాంటి-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. ఇది కేన్సర్లు, ఇన్ఫెక్షన్లు, ఆస్తమా, మల్టిపుల్ సిలరోసిస్, గుండెజబ్బులు, కడుపులో మంట, బొవెల్ సిండ్రోమ్‌లపై శక్తివంతంగా పనిచేస్తుంది.
వెల్లుల్లిలో విటమిన్-సి, బి6లతోపాటు మెగ్నీషియం,సెలీనియం వంటివి ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. కొలెసా్ట్రల్ పెరగకుండా నివారిస్తాయి. గుండెజబ్బులు, ఇన్ఫెక్షన్లు, రొమ్ముకేన్సర్, పెద్దప్రేవు కేన్సర్ వంటి కేన్సర్లను సైతం నిరోధిస్తాయి.
మెంతులు డయాబెటిస్‌ను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. కడుపులో మంటను తగ్గిస్తాయి. ధమనులు ముడుచుకుపోకుండా నిరోధిస్తాయి. శరీరంలోని కొలెసా్ట్రల్, బిపిలను తగ్గిస్తాయి
Subscribe to:
Posts (Atom)