జాజికాయను నీటితో మెత్తగా నూరి లేపనంగా వేస్తే, ముఖం మీది నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
జాజికాయ, చందనం, మిరియాలు కలిపి నీటితో నూరి, పై పూతగా వేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
జాజికాయలో ఫంగ్‌సను నిరోధించే గుణం ఉంది. అందువల్ల జాజికాయను నీటితోనూరి పూస్తే తామర వంటి వ్యాధులు తగ్గిపోతాయి.
నీటిలో గంటల పర్యంతం నానడం వల్ల కాలివేళ్ల మధ్య చర్మం దెబ్బతిన్న వారు, జాజికాయను నూరి వేళ్ల సందుల్లో పెడితే చాలా తొందరగా చర్మం చక్కబడుతుంది.
జాజికాయ గంధాన్ని అరగ్లాసు పాలలో కలిపి తాగితే శీఘ్ర స్కలన సమస్య తొలగిపోతుంది
కడుపు నొప్పి వచ్చి, విరే చనాలు అవుతూ ఉంటే, కాస్తంత జాజికాయ పొడి, కొంచెం అల్లం రసం, బెల్లం, నెయ్యి కలిపి సేవిస్తే చాలు. నొప్పి, విరేచనాలు వెంటనే తగ్గుతాయి.
No comments:
Post a Comment