Wednesday 11 April 2018

Sabja Seeds














  • సబ్జా గింజల్లో ఎన్నో ఔషద గుణా లున్నా యి. సబ్జాగింజ లు శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. మాం సాహారం తిన్నవారికి శరీర తా పం అధికంగా ఉంటుంది. అలాం టప్పుడే సబ్జాగింజలు నీళ్లలో గాని, కొబ్బరి నీళ్లలో గాని నానబెట్టి తాగి తే సత్వర ఉపశమనం కలుగుతుం ది. హానికరమైన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్లలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉం టుంది.
  • అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసు నీళ్లలో సబ్జాగింజల గు జ్జు వేసి రోజుకు మూడు నాలుగు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. వీటి గుజ్జును పైనాపిల్‌, ఆపిల్‌, ద్రాక్షారసాల్లో కలిపి పిల్లలకు తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.
  • మనిషి శరీర బరువును కూడా సబ్జాగింజలు తగ్గిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సబ్జాగింజలతో నానబెట్టిన నీటిని నిద్రపోయేముందు తాగితే చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఈ నీరు యాంటి బయాటిక్‌గా పనిచేస్తుంది.
  • శరీరంలో బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరుసటి రోజుకు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. శరీరంలోని కేలరీలను కరిగించడంలో వీటి పాత్ర అధికం. సబ్జాగింజలు నీటిలో వేసిన తర్వాత ఉబ్బి జల్స్‌గా తయారయ్యే దాకా నానబెట్టాలి. ఈ జెల్స్‌ నీటిని తాగడం వల్ల శరీర జీవక్రియ మెరుగపడటమే కాకుండా శరీర పనితీరుకు ఉపకరించే ప్యాటీఆమ్లాలతో పాటు అధికంగా పీచుని సబ్జాగింజలు కలిగి వుంటాయి.
  • మహిళలకు అవసరమైన ఫోలెట్‌, ఇయాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే ఈ విటమిన్‌ లభించడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాల్ని తొలగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • సబ్జాగింజలు తీసుకుంటే వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. గొరువెచ్చటి నీళ్లలో సబ్జాగింజలను నానబెట్టి అందులో అల్లం రసం, తేనె కలిపి తాగితే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

No comments:

Post a Comment