Saturday, 7 April 2018

Gaddi Chemanthi

  •  తెగిన గాయాలు, అల్సర్లు, ఎగ్జిమా, పలురకాల చర్మవ్యాధులకు గడ్డి చేమంతి ఆకుల రసాన్ని పూస్తే మానిపోతాయి. గాయాల్లోంచి వచ్చే రక్తస్రావాన్ని ఆపి, గాయం అతుక్కుపోయేలా చేసే శక్తి ఈ చేమంతికి ఉంది. దీని వేరును నీడన ఎండబెట్టి పొడి చేసి, ఒక స్పూను మోతాదులో తీసుకుంటూ ఉన్నా, చర్మవ్యాధులు నయమవుతాయి.
  •  ఆకులను ముద్దగా నూరి రసం మింగుతూ ఉంటే శరీరంలో ఏర్పడిన వాపులతో పాటు ఆయాసం, దగ్గు తగ్గిపోతాయి.
  •  రెండు భాగాలు ఆకు రసం, ఒక భాగం నువ్వుల నూనె కలిపి, తైలం మాత్రమే మిగిలే దాకా కాచి, ఆ తైలాన్ని తల మాడుకు పట్టించి, మూడు గంటల తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమూలంగా తొలగిపోతుంది.
  •  గడ్డి చేమంతి ఆకులను ముద్దగా నూరి, వస్త్రంలో ఉంచి పిండి, ఆ రసాన్ని పూస్తూ ఉంటే తామర పూర్తిగా తగ్గిపోతుంది.
  •  ప్రతి రోజూ ఉదయం పరగడుపున 10 పచ్చి ఆకులను నమిలి తింటే కీళ్లనొప్పులు తగ్గుతాయి.
  •  ఆకులను మెత్తగా నూరి పట్టిస్తే, చీము గడ్డలు నయం కావడంతో పాటు, ఇతర కురుపులు కూడా మానిపోతాయి.
  •  పచ్చి ఆకు రసాన్ని రుద్దుతూ ఉంటే, కొద్ది రోజుల్లో పేనుకొరుకుడు తగ్గి, మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి.

No comments:

Post a Comment