Wednesday 25 October 2017

Nela Vemu

నేలవేము?
ఇంటి పెరట్లో, అటవీ ప్రాంతాల్లో చిన్న తెల్లని పువ్వులు పూచే ఓ రకమైన మొక్క నేలవేము. ఈ మొక్క కాండము, ఆకులు చాలా చేదుగా ఉంటాయి. దీనికి ఔషధ గుణాలు ఎక్కువని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. తీవ్రమైన జ్వరం, డెంగీ, మలేరియా జ్వరాలు, చికున్‌ గున్యా, స్వైన్‌ఫ్లూ, చర్మరోగాలు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, మధుమేహం, సుఖ వ్యాధులకు ఔషధంగా పని చేస్తుందని చెబుతారు.
 
9 మూలకాల మిశ్రమం...
నేలవేము ఆకుల పొడితోపాటు... సొంఠి, మిరియాలు, వట్టివేర్లు, పర్పాటకం, చందనపు పొడి తదితర తొమ్మిది రకాల మూలికలు, పదార్థాలతో కషాయాన్ని తయారు చేసి తమిళనాట పంపిణీ చేస్తున్నారు. ఈ కషాయం తయారైన నాలుగు గంటల్లోపు తాగితేనే ఫలితముంటుందని వైద్యులు చెబుతున్నారు. నేలవేము కషాయంతో తెల్లరక్త కణాలు పెరిగి, రోగ నిరోధక శక్తి అధికమవుతుందని తిరునల్వేలి ప్రభుత్వ సిద్ధ వైద్య కళాశాల ఆచార్యులు, నేలవేముపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన సుభాష్‌ చంద్రన్‌ తెలిపారు.
 
ఈ నేలవేము కషాయాన్ని వారానికి మూడుసార్లు పుచ్చుకుంటే మధుమేహం నియంత్రణలోకి వస్తుందని... సిద్ధ వైద్య పద్ధతిలో తయారైన ఈ కషాయం వల్ల ఎలాంటి హాని ఉండదని ఆయన స్పష్టం చేశారు. నేలవేము డెంగీకి సరైన ఔషధమని చెన్నైలోని అన్నానగర్‌ ప్రభుత్వ సిద్ధవైద్య విభాగం ప్రత్యేక అధికారి డాక్టర్‌. పి. మల్లిక కూడా ధ్రువీకరించారు.

Tuesday 24 October 2017

kakarakaya








అనాదిగా ఆసియాలో ప్రసిద్ధిచెందిన పాదుమొక్క కాకరకాయ. ఈ పేరు వినగానే చాలామంది చేదుగా మొహం పెట్టేస్తారుగానీ కాకరకాయ మనదేశంలో ఎప్పటినుండో ఔషధంగా ఉపయోగపడుతోంది. సంప్రదాయ వంటకాల్లో వారానికి ఒకసారైనా కాకరకాయ కూర, కాకరకాయ పులుపు తినాలని పెద్దలు చెబుతారు ఎందుకంటే ఇది శరీరంలో సుగర్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. మధుమేహ రోగులకు నిలయంగా మారుతున్న మనదేశంలో కాకరకాయరసం ఇప్పుడు ఇంటింటా దివ్యౌషధంగా మారింది. కాకరకాయ జ్యూస్‌ బ్లడ్ సుగర్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. రోజూ ఉదయంపూట క్రమం తప్పకుండా ఈ రసం తీసుకుంటే శరీరంలోని అల్ఫా గ్లూకోసైడ్స్‌ తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. కాకరకాయలో ఉండే యాంటీ హైపర్ గ్లిజమిక్స్‌ బ్లడ్‌, షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించి, కాలేయం, మూత్రాశయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శ్వాస సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. కాకరకాయలో ఎ,బి,సి విటమిన్లు, బీటా కెరోటిన్‌, పొటాషియం, ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం, మాంగనీసు ఎక్కువుంటాయి. దీని ఆకులు, పండిన కాయలు ఉడికించి తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇది మొటిమలు, మచ్చల నివారిణి కూడా.

Friday 20 October 2017

beerakayalu

బీరకాయ రుచి అమోఘం. దీనిలో పోషకవిలువలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకొనే వారికి ఇది పరమౌషధం. బీరకాయను వివిధ కాంబినేషన్లతో కూరలు చేయడంతో పాటు చట్నీకూడా చేస్తుంటారు. బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, పైల్స్ తదితర సమస్యలకు చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. దీనిలో వుండే బీటాకెరోటిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కామెర్ల వ్యాధి నివారణకు రోజూ ఒక గ్లాసు బీరకాయ జ్యూస్ తాగితే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రోజువారీ డైట్‌లో దీనిని చేర్చుకోవడం వలన పలు అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంటారు.

Tamara ginjalu

తామర గింజలు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కాని పూల్‌ మఖని అంటే చాలా మంది గుర్తుపడతారు. మఖని అంటే హిందీలో ఎండినవి అని అర్థం. వీటిని ఫాక్స్‌నట్స్‌ అని కూడా అంటారు. ఈ పంటకు బీహార్‌ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ గింజలు తామర పువ్వు నుంచి వస్తాయి. వీటిని పచ్చివిగా, వేయించుకొని, ఉడకబెట్టి ఇలా రకరకాలుగా తింటుంటారు. ముదురు గోధుమ, తెలుపు రంగుల్లో ఉండే ఇవి ఎంతో ఆకర్షణీయంగా కన్పిస్తాయి. ఉత్తర భారతదేశంలో వీటితో స్వీట్స్ కూడా చేస్తారు.
తామర గింజల్లో ఎండిన వాటికంటే పచ్చివాటిలోనే పోషక విలువలు ఎక్కువ. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్‌ కారకమయ్యే ఫ్రీరాడికల్స్‌‌ను దూరంగా ఉంచుతాయి. ఇందులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. సోడియం తక్కువ.. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారంలో తీసుకుంటే బీపి నియంత్రణలో ఉంటుంది. గర్భిణుల, బాలింతలు వీటిని తినడం వల్ల నీరసం దరిచేదరు. రక్తహీనత గల రోగులకు దీనిని మందుగా ఇస్తారు. ఇది ఆకలిని పెంచుతుంది. డయేరియాను నివారిస్తుంది. కాగా ఈ తామర గింజలు చాలాకాలం పాటు తాజాగా ఉండటం విశేషం.

Monday 16 October 2017

Puttagodugulu

కుంగుబాటు, నిరాశ, నిస్పృహలతో బాధపడుతున్నారా! అయితే, పుట్టగొడుగులు తినాలని పరిశోధకులు అంటున్నారు. అవి మెదడులోని కీలక నాడులను ఉత్తేజితం చేసి నాడీ సంబంధ రుగ్మతలు దరిచేరకుండా అడ్డుకుంటాయట. పుట్టగొడుగుల్లో ఉండే సిలొసిబిన్‌ కుంగుబాటుతో బాధపడేవారిని ఆరోగ్యవంతులుగా చేసినట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని యూకేలోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

Wednesday 11 October 2017

Till Oil

నువ్వుల సాధారాణంగా అందరికి తెలిసినవే. అందరికీ అందుబాటులో ఉండే నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొంచే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి కావున వీటిని 'పవర్ హౌసెస్' అంటారు. ఇవి మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్ మరియు విటమిన్ 'E'లను కలిగి ఉంటాయి, అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిని కలిగించే చాలా రకాల మూలాకాలు వీటిలో ఉంటాయి. అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని ఆయుర్వేదం చెబుతుంది. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇవి తెల్లనువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా బాగా వాడుకలోనున్నవి. నువ్వులనూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తారు.
చర్మాన్ని సంరక్షించడంలో....
చర్మాన్ని సంరక్షించడంలో నువ్వులనూనె ప్రాధాన్యత చాలానే ఉంది. నువ్వల నూనెలో ఉన్న ఇ మరియు బి విటమిన్ లు చర్మానికి సంబంధిచిన అన్నిరకాల సమస్యలను దూరం చూసే గుణం ఇందులో పుష్కలంగా ఉంది. నువ్వులన నూనెను చర్మ సంరక్షణలో ఉపయోగించడం ద్వారా ముఖంను ఫ్రెష్ గా, యవ్వనంగా మెరుస్తూ ఉండేట్లు చేస్తుంది.
చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచడంలో....
చిన్నారుల అందం, ఆరోగ్యం విషయంలో నువ్వుల నూనెది కీలక పాత్ర. దీనిలోని విటమిన్స్, మినరల్స్ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచుతాయి. ఈ నూనెలో విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు చిన్నారుల్లో కొవ్వు స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, ఐరన్, విటమిన్ బి36.. లాంటివి ఇందులో సమృద్ధిగా ఉంటాయి. స్నానానికి ముందు పసిపిల్లల మాడుకు, శరీరానికి నువ్వులనూనెతో మర్దనా చేస్తే హాయిగా నిద్రపోతారు. ఈ నూనె చిన్నారుల్లో మెదడు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. వెన్నెముక, కండరాలు బలపడేందుకు సహాయకారిగా ఉంటుంది. నిత్యం స్నానానికి, పడుకునేందుకు ముందు నువ్వుల నూనెతో ఒళ్లంతా రుద్దితో పిల్లల చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మాయిశ్చరైజర్‌లాగా పనిచేస్తుంది.
బీపీ నియంత్రణలో...
ఈ నూనెలో ఒమెగా-3 ఫాటీ ఆమ్లాలు పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడంతో పాటు... బీపీ స్థాయి ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో ఉన్న పెద్దవారికి బీపీని సమస్థాయికి తీసుకొస్తుంది. అంతేగాకుండా, వయసు పైబడ్డవారు ఈ నూనెతో చేసిన పదార్థాలను తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఉంటారు.
కీళ్లనొప్పుల నివారణలో...
నువ్వులు కాపర్ వంటి మూలకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన శక్తివంతంగా కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే మూలకాలు, మినరల్స్ రక్తనాళాలకు, కీళ్ళను దృడంగా ఉండేలా చేస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడే మెగ్నీషియం... పేగు క్యాన్సర్, మైగ్రేన్ లాంటి సమస్యలను అరికట్టే కాల్షియం.. ఎముకలు గట్టిపడేందుకు సాయపడే జింక్... తదితరాలన్నీ ఈ నువ్వుల నూనెలో ఉండటం ప్రకృతి ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు.
మధుమేహ వ్యాధి నివారణకు..
నువ్వులలో ఉండే మెగ్నీషియం వంటి ఇతరేతర పోషకాలు మధుమేహ వ్యాధి తగ్గించుటలో సహాయడతాయి. నువ్వు విత్తనాల నుండి తీసిన నూనెలు శక్తివంతమగా శరీర రక్త పీడనాన్ని తగ్గించటమే కాకుండా, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను మరియు రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..
జుట్టు మృదువుగా ఉండాలన్న, చుండ్రు మాయం కావాలన్న నువ్వుల నూనే బెస్ట్‌ అంటున్నారు సౌంధర్య నిపుణులు. నువ్వుల నూనేతో జుట్టుకి కావల్సిన పోషకాలు అందుతాయి. నువ్వుల నూనె ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నువ్వుల నూనెతో కేశాలకు మరియు తలకు బాగా పట్టిస్తే , హెయిర్‌ సెల్స్‌ యాక్టివ్‌ గా ఉండే హెయిర్‌ గ్రోత్‌ ను ప్రోత్సహిస్తుంది. అల్ట్రా వైలెట్‌ కిరణాల ప్రభావం జుట్టు మీద పడకుండా నువ్వుల నూనే రక్షిస్తుంది. చాలా వరకూ జుట్టు సమస్యలు చుండ్రువల్లనే ఎదురవుతాయి. చుండ్రు సంబంధిత సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గం నువ్వుల నూనె.