Tuesday 26 September 2017

Sunamukhi aku

సునాముఖి ఆకు ప్రయోజనాలు అనేకం. ఏ పదార్థంతో కలిపి తీసుకుంటున్నాం అనే దాని మీద దాని ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. అదెలా అంటే, ఒక స్పూను సునాముఖి ఆకు చూర్ణాన్ని, అరకప్పు వేడి ఆవు పాలతో కలిపి సేవిస్తే రక్తశుద్ధి కలుగుతుంది. శరీరం కూడా కాంతిమంతమవుతుంది. నేతితో సేవిస్తే శరీరంలోని అనేక రుగ్మతలు హరిస్తాయి. పంచదారతో సేవిస్తే వాతం తగ్గుతుంది. తేనెతో సేవిస్తే ధాతుపుష్టి, మేకపాలతో తీసుకుంటే శరీరం బలిష్టమవుతుంది. పాతబెల్లంతో తీసుకుంటే జలుబు తగ్గుతుంది. 
గుంటగలగరాకు రసంతో అయితే తెల్లవెంట్రుకలు నల్లబడతాయి. ద్రాక్షపండ్ల రసంతో తీసుకుంటే కంటి తేజస్సు పెరుగుతుంది.
10 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు వేడినీళ్లతో సేవిస్తే, సుఖ విరేచనం కలుగుతుంది.
3 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణానికి సమానంగా, పటిక బెల్లం కలిపి, రోజూ రెండు పూటలా సేవిస్తే శరీర పుష్టి కలుగుతుంది.
5 గ్రాముల ఆకు చూర్ణానికి 10 గ్రాముల దోస గింజల చూర్ణం కలిపి సేవిస్తే, మూత్రద్వారానికి అడ్డుపడే రాళ్లు కరిగిపోతాయి.
రెండున్నర గ్రాముల సునాముఖి ఆకు చూర్ణానికి సమానంగా ఫిరంగి చెక్క చూర్ణం కలిపి 40 రోజులు వాడితే కండ్ల జబ్బులు నయమవుతాయి.
10 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణాన్ని ఆవు నెయ్యితో కలిపి తింటూ ఉంటే అన్ని రకాల ఒంటి నొప్పులు తగ్గుతాయి.

Monday 18 September 2017

parijatam poolu

పారిజాతం ఆకులను మెత్తగా దంచి, ఆముదం కలిపి వేడి చేసి కడితే, వాతపు నొప్పులు తగ్గుతాయి.రోజుకు ఒక పారిజాతం గింజ చొప్పున తింటూ ఉంటే అర్శమొలలు తగ్గుతాయి.
బాగా పెరిగిన 15 పారిజాతం ఆకులను సన్నని ముక్కలుగా తరిగి, రెండు కప్పుల నీళ్లల్లో వేయాలి. ఆ తర్వాత సన్నని మంట పైన అరకప్పు ద్రావణం మాత్రమే మిగిలేలా మరిగించి, వడబోయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో పావు స్పూను మిరియాల పొడి కలిపి, ప్రతి రోజూ, ఉదయం, సాయంత్రం సేవిస్తే, సయాటికా నొప్పి తగ్గిపోతుంది.
 పారిజాతం ఆకులు, సీతమ్మ నూలు పోగులు (అమర్‌బేల్‌), ఊడుగ ఆకులు ప్రతిదీ పిడికె డు చొప్పున తీసుకుని, వాటిని పావు లీటరు ఆవనూనెలో నీరంతా ఆవిరైపోయే దాకా మరిగించి వడబోసి అందులో ఒక తులం రాతి పువ్వు చూర్ణం కలపాలి. ఆకుల కషాయాన్ని లోనికి సేవిస్తూ, ఈ తైలాన్ని మర్ధనం చేస్తూ, విశ్రాంతి తీసుకుంటే సయాటికా నొప్పి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది.
 ఎండిన పారిజాతం గింజలను మెత్తగా పొడి చేసుకుని, ఆ పొడికి తగినంత నీటిని కలిపి పేస్టులా చేసుకుని తలకు పట్టిస్తూ ఉంటే చుండ్రు, తలపైన వచ్చే పొక్కులు నశిస్తాయి.
గుప్పెడు పారిజాతం ఆకులను ముక్కలుగా కత్తిరించి, లీటరు నీటిలో వేసి, 200 మి.లీ అయ్యేదాకా మరిగించి ఆ కషాయాన్ని 100 మి.లీ మోతాదులో రోజుకు రెండు పూటల 5 రోజుల పాటు తాగితే రక్త శుద్ధి కలుగుతుంది.

Saturday 16 September 2017

Juvvi chettu

జువ్వి పండ్లను మధ్యకు రెండుగా కోసి తేనెలో వేసి నెల రోజుల పాటు ఊరనిస్తే లేహ్యంగా తయారవుతుంది. ఈ లేహ్యాన్ని ఒక ఉసిరికాయ పరిమాణంలో రోజుకు రెండు పూటలా తింటే, అన్ని రకాల వాపులూ హరించుకుపోతాయి.
జువ్వి పట్ట చూర్ణంతో గానీ, జువ్వి పుల్లతో గానీ, దంత దావనం చేస్తే దంత వ్యాధులు నశించడంతో పాటు, కదులుతున్న దంతాలు కూడా గట్టిపడతాయి.
జువ్వి చెట్టు పాలు తీసి పుండ్ల మీద పట్టు వేస్తే, తీవ్రమైన రాచపుండ్లు కూడా మానిపోతాయి. జువ్వి పట్ట కషాయంతో పుండ్లను కడిగినా తొందరగా మానిపోతాయి.
100 మి. లీ జువ్వి బెరడు కషాయంలో 10 గ్రాముల చక్కెర కలిపి, రోజూ రెండు పూటలా సేవిస్తే తల తిరుగుడు వ్యాధి (వెర్టిగో) తగ్గిపోతుంది.
మర్రి, రావి, మేడి, గంగరావి, జువ్వి వీటి బెరడులను కషాయంగా కాచి, స్త్రీలు తమ జననాంగాన్ని శుభ్రం చేస్తే, ఆ బాగంలోంచి వచ్చే దుర్ఘంధ స్రావాలు త గ్గిపోతాయి. గర్భాశయ ముఖద్వారంలో వచ్చే పుండ్లు (సర్వికల్‌ ఎరోషన్స్‌) సమూలంగా హరించుకుపోతాయి. లేదా పచ్చి జువ్వి పట్టను మెత్తగా నూరి ఉండలా చేసి జననాంగంలో ఉంచినా ఈ స్రావాలు తగ్గిపోతాయని ఆయుర్వేద వైద్యుల మాట.

Friday 15 September 2017

Kalabanda Aloe vera

శరీరంలోని మాలిన్యాలను తొలగించే లక్షణం కలబంద (అలోవెరా)లో ఉన్నప్పటకీ ఆ రసం తీసుకున్న వెంటనే రక్తంలో ఉన్న డ్రగ్స్‌ ప్రభావం తగ్గుతుందని చెప్పలేమంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముందు హాజరవడానికి ముందు సినీ ప్రముఖులు కలబంద రసాన్ని తీసుకుని కడుపును శుద్ధి చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో.. ఎంతో కాలంగా రక్తంలో కలిసిపోయిన మాదకద్రవ్యాల అవశేషాలను తొలగించే శక్తి కలబందకు ఉందా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీనిపై ఇంతవరకూ శాస్త్రీయమైన అధ్యయనాలేవీ జరగలేదుగానీ.. సప్త ధాతువుల్లో రెండో ధాతువైన రక్తాన్ని శుద్ధి చేసే గుణం కలబందలో కొంత వరకు ఉన్నప్పటికీ ఆ రసాన్ని 30-45 రోజులపాటు తీసుకుంటేగానీ దాని ప్రభావం రక్తం మీద కొంతైనా కనిపించదని కొందరు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి డ్రగ్స్‌ వాడటం వల్ల రక్తంలో కలిసిపోయే అవశేషాలు నాలుగైదు రోజులపాటు అలోవెరా జెల్‌ తాగినంత మాత్రాన రక్తపరీక్షల్లో కనిపించకుండా పోవని వారు స్పష్టం చేస్తున్నారు. మరికొందరు ఆయుర్వేద వైద్యనిపుణులేమో.. కలబంద రసం చర్మం మీద చూపినంత ప్రభావం రక్తంపై చూపుతుందనడానికి ఆధారాలేవీ లేవంటున్నారు.
ఇదీ నేపథ్యం..
కలబంద (అలోవెరా)ను మన పూర్వీకులు ‘కుమారి’ అని పిలిచేవారు. ఇది పూర్వం ప్రతి ఇంటి పెరట్లో, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా లభించేది. జీర్ణశక్తిని పెంచేందుకు, జీర్ణాశయ సంబంధిత సమస్యలకు, ఎముకల వైద్యానికి కలబందను ఉపయోగించేవారు. పాశ్చాత్యులైతే ఐదు దశాబ్దాలుగా కలబందపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. కలబంద రసం, దాని గుజ్జు చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, శరీరాన్ని కాంతిమంతం చేసేందుకు, చర్మరోగాలు నివారించేందుకు, కాలిన గాయాలను మాన్పేందుకు, శరీరంలోని మాలిన్యాలను తొలగించేందుకు ఉపయోగపడుతుందని నిర్ధారించారు. అప్పటి నుంచి కలబందను ప్రపంచవ్యాప్తంగా సౌందర్య సాధనాల్లో ఉపయోగించడం మొదలైంది. అలోవెరాకు అంతర్జాతీయంగా ఊహించనంత డిమాండ్‌ పెరిగింది. అలోవేరా జెల్‌, సబ్బులు, సౌందర్య సాధనాలు.. ఇలా పలురకాల ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.

అలోవెరాను కాలిన గాయాలకు, ఎముకల సమస్యలకు ఉపయోగించేవారు. దీన్ని తీసుకున్న వెంటనే వేగంగా రక్తశుద్ధి జరిగి, రక్తంలోని ఉత్ర్పేరక అవశేషాలు తొలగిపోతాయని చెప్పలేం.


అలోవెరాకు శరీర మాలిన్యాలను తొలగించే గుణం ఉందని నిర్ధారించారు. రక్తంలో పేరుకుపోయిన అవశేషాలను తొలగించే గుణం ఉన్నట్లు నిర్ధారించలేదు. చర్మకణాలపై చూపిన ప్రభావాన్ని అలోవెరా రక్తకణాలపైనా చూపించగలదా లేదా అనేది శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది.




 సాధారణంగా మనకు అందుబాటులో ఉండే కలబంద ఒత్తయిన జుట్టుకు, జుట్టు పొడిబారకుండా ఉండేందుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెంట్రుకల మొదళ్ల నుంచి అమినో ఆమ్లాలు వెలువడుతుంటాయి. ఇదే ఆమ్లం కలబందలో పుష్కలంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని జట్టుకు క్రమం తప్పుకుండా పట్టించడం వల్ల జుట్టు పెరగటంతో పాటు, పొడిబారడం తగ్గుతుంది. చుండ్రును కూడా అరికడుతుంది. వీటిని ఎలా వాడాలో ఓసారి చూద్దాం...
  • తలస్నానం చేసే 10 నిమిషాల ముందు కలబంద గుజ్జును కుదుళ్లకు పట్టించాలి. ఈగుజ్జులోని ఎంజైమ్‌లు తలలోని మృతకాణాలను తొలగించి చండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని తొలిగిస్తుంది. అంతే కాక తేమను అందించి జట్టు పొడిబారకుండా చేస్తుంది.
  • పావు కప్పు కలబంద గుజ్జులో రెండు చెంచాల అలివ్‌ ఆయిల్‌ కలపాలి. ఈ మిశ్ర మాన్ని కుదుళ్ల నుంచి జుట్టంతా పట్టించాలి. 20 నిమిషాల తరువాత కడిగేస్తే చండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
  • తాజాగా తీసిన అరకప్పు కలబంద గుజ్జుకి పెద్ద చెంచా ఆము దం, చెంచా మెంతి పిండి కలిపి రాత్రంతా నానబెట్టాలి. తెల్లవారా క ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతి వారం చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Thursday 14 September 2017

Violet colour fruits / vegetables

మన ఆహార పదార్థాల్లో ఊదారంగు పండ్లో, కాయగూరలో ఉండేలా చూసుకోవడం ఎంతో శ్రేయస్కరం. అత్యధిక మొత్తంలో ఉండే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు కేన్సర్‌, పక్షవాతం, గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తాయి.
ఊదా, నీలిరంగు పండ్లు వర్ణాన్ని పెంచడంతో పాటు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ప్రత్యేకించి బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ పండ్లల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ-ర్యాడికల్స్‌ వల్ల కలిగే న ష్టాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.
ఊదా రంగు క్యాబేజీ, బ్లాక్‌ బెర్రీలు, ఊదా రంగు ఉల్లి, ఊదా రంగు ద్రాక్షల్లోని ప్లేవనాయిడ్లు రక్తపోటును తగ్గించడంతో పాటు కొన్ని రకాల కేన్సర్లను ఎదుర్కొనే శక్తినిస్తాయి.
ఊదారంగులో ఉండే చిలగడదుంపల్లో యాంతో సియానిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచడంతో పాటు శరీరంలో ఏర్పడే వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంశాలు సమ్దృద్ధిగా ఉంటాయి. శరీరంలోని కణవిచ్ఛిత్తిని అరికడతాయి.
ఊదా రంగు ఆహార పదార్థాలు శరీర బరువు తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఊదా రంగు క్యారెట్లలో అత్యధిక స్థాయి ఆంథోసియానిన్లతో పాటు కెరోటినాయిడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ దాడిని తిప్పి కొడతాయి. ఇవి రక్తంలోని చక్కెర నిలువల్ని నియంత్రిస్తాయి. బ్లాక్‌ బెర్రీల్లో శరీర క్షయ వేగాన్ని తగ్గించే గుణం ఉంది. జుత్తు రాలిపోయే సమస్య కూడా తగ్గుతుంది. బీట్‌రూట్లలో శరీరంలోని మాలిన్యాలను బయటికి పంపే అంశాలు ఉన్నాయి. సూప్స్‌లోనూ, సలాడ్స్‌లోనూ వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.

Akakarakaya

అన్ని కూరగాయలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. కానీ పండ్లు మాదిరిగా సీజన్‌లోనే లభించే కాయగూర.. ఒక్క బోడకాకరకాయ మాత్రమే. ఈ అడవి కాకర(బోడకాకర) మంచి ఔషధ గుణాలతో పాటు ఎంతో రుచిగా కలిగి ఉంటాయి. జూన్‌ మాసం నుండి జనవరి మాసం వరకు అడవి కాకర మార్కెట్‌లో లభ్యమవుతుంది. మిగతా ఏ కాలంలోనూ ఎంత వెచ్చించి కొందామన్నా లభించదు. అడవి కాకర మంచి రుచితో పాటు ఆరోగ్యానికి సైతం ఉపయోగకరమైన కూరగాయ కావడంతో సీజన్‌లో ఒక్కసారైన తినాలన్న ఉ ద్దేశంతో ప్రజలు ధరకు వెనకాడకుండా అడవి కాకరను కొనుగోలు చేస్తుంటారు.  అడవి కాకర కూరగాయలకు రాజుగా చెప్పుకోవడం మరో విశేషం. మార్కెట్‌లో లభించే కూరగాయల కన్న అడవి కాకరకు డిమాండ్‌తో పాటు ధర సైతం అ ధికంగా ఉంటుంది. కిలో 120రూపాయల నుండి 140రూపాయల వరకు మార్కెట్‌లో పలుకుతోంది. అయినా అడవికాకరకు భలే డిమాండ్‌ ఉంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న అడవి కాకర గురించి తెలిసిన వారు తప్పకుండా కొనుగోలు చేసి తీరు తారు. ధరతో సంబంధం లేకుండా అడవి కాకరకాయను కొనుగోలు చేస్తు న్నారంటే ఎంతటి ఔషధ గుణాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 
 
అడవి కాకరలో ఉన్న ఔషధ గుణాలు..
అడవి కాకరను  ప్రతీ సీజన్‌లో తినడం వల్ల సీజన్‌లో వచ్చే రోగాలను నిరో ధిస్తుంది. అంతటి గొప్ప ఔషధంగా అడవి కాకర పని చే స్తుందన్నమాట. అడవి కాకరలో విటమిన్స్‌ ఏ, సీలతో పాటు ప్రొటీన్లు, పీచుపదార్ధం అధికంగా ఉంటా యి.  కేలరీలు తక్కువగా ఉండే కూరగాయలలో అడవి కాకరదే మొదటి స్థానంగా చెప్పవచ్చు. శరీరంలోని మధుమేహన్ని, చక్కెరశాతాన్ని తగ్గిస్తుంది. ర క్తంలోని క్యాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది. కంటి, గుండె సంబంధిత వ్యాధుల వారికి ఇది మంచి ప్రకృతి ఔషధంగా పని చేస్తుందంటే అడవి కాకర ఎంత చ క్కటి గుణాలను కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా గర్భిణీలు అడవి కాకరకాయను తీసుకోవడం ద్వారా పిండం ఆరోగ్యంగా ఉండ టంతో పాటు శిశువు వృద్ధికి దోహదపడుతుంది. అర్షమొలల తో బాధపడే వారికి సైతం అడవికాకర ఉపశమనా న్ని కలిగిస్తుంది. గ్యాస్‌, మలబద్దకాన్ని నియ ంత్రిస్తుంది. మిగత కాకరలా ఇది చే దుగా ఉండకుండా తినడా నికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇన్ని ఔషధ గుణాలు ఉన్న అడవి కాకర ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇంకెం దుకు ఆలస్యం.. మీరు కూడా ఒక్కసారి అడవికాకర రుచిని ఆస్వాదించండి ఆరోగ్యంగా ఉం డండి.
 

Jaji kaya ( Nut meg)

జాజి ఆకులను నమిలి మింగుతూ ఉంటే నోటి అల్సర్లు తగ్గుతాయి. ఓ 20 ఆకులను కషాయంగా కాచి దానితో పుక్కిలించినా ఈ అల్సర్లు తగ్గుతాయి. జాజి ఆకుల రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి, సన్నని మంటపై రసం ఇగిరే దాకా కాచి తయారు చేసిన తైలాన్ని చెవిలో వేస్తే, చెవిలో రంధ్రం కారణంగా తలెత్తే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
20 తాజా జాజి పూలను మెత్తగా రుబ్బి, ప్రతి రోజూ ముఖానికి పట్టిస్తే, ముఖం క్రమక్రమంగా కాంతి వంతంగా తయారవుతుంది.
జాజి ఆకుల రసాన్ని పగిలిన కాళ్లకు ప్రతి రోజూ పట్టిస్తే, పగుళ్లు మానడంతో పాటు పాదాలు మృదువుగా మారతాయి.
జాజి పూల యుక్తంగా కొమ్మలను ముక్కలుగా కత్తిరించి ఆరలీటర్‌ నీటిలో వేసి, పావులీటరు మిగిలేదాకా కాచి, ఆ తర్వాత వడబోయాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం తయారు చేసుకుని సేవిస్తే, రుతుక్రమం చక్కబడుతుంది. స్త్రీ జననాంగానికి సంబంధించిన పలు వ్యాధులు తొలగిపోయి సంతాన యోగ్యత కలుగుతుంది.
చీము పట్టి దీర్ఘకాలికంగా వేధిస్తున్న మొండి వ్రణాలను జాజి ఆకుల కషాయంతో కడిగితే చాలా త్వరితంగా మానిపోతాయి.
30 మి.లీ జాజి ఆకుల కషాయాన్ని కొద్ది రోజుల పాటు తాగితే మూత్రాశయం నొప్పి తగ్గుతుంది.

Tuesday 5 September 2017

Velaga Pandu ( Wood Apple)













బాగా పండిన వెలగ పండును నిప్పులో కాల్చి లోపలి గుజ్జును తీసి, దానికి కొంచెం శొంఠి, మిరియాల చూర్ణం కలిపి బఠాణీ గింజ అంత మాత్రలు చేసుకుని రోజూ పూటకు రెండు చొప్పున రెండు పూటలా వేసుకుంటే ఆకలి పెరుగుతుంది.
 కాయలోని గుజ్జులో పిప్పళ్ల పొడిని క లిపి చప్పరిస్తే వెక్కిళ్లు తగ్గుతాయి. వెక్కిళ్లు మరీ ఎక్కువగా ఉంటే, వెలగాకు రసానికి సమానంగా ఉసిరిక ఆకు రసాన్ని కలిపి అందులో పిప్పలి చూర్ణం, తేనె కలిపి ఇస్తే వెక్కిళ్లు తగ్గుతాయి.
 వెలగ గింజ చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి ఒక స్పూన్‌ మోతాదులో రోజూ రెండు పూటలా కొద్ది రోజులు వాడితే వీర్యవృద్ధి కలుగుతుంది.
 20 గ్రాముల వెలగ చెట్టు బెరడును దంచి రసం తీసి, కొద్ది రోజులు వాడితే కీళ్లనొప్పులు తగ్గుతాయి.
 3 స్పూన్ల వెలగ ఆకు రసంలో ఒక గ్రాము పిప్పలి చూర్ణం, తేనె కలిపి బాగా వాంతులు అవుతున్న వారికి తాగిస్తే వెంటనే తగ్గుతాయి.
 రెండు గ్రాముల వెలగ గింజల చూర్ణాన్ని నీళ్లలో కలిపి తాగిస్తే కడుపు నొప్పితో వచ్చే అజీర్ణ విరేచనాలు తగ్గుతాయి.




వెలగ పండులో రిబోఫ్లావిన్ ,నియాసిన్ , విటమిన్ C పుష్కలం గా ఉంటాయి.  కడుపు లోని నట్టలు, క్రిములను , వెలగ పండు గుజ్జు తొలగిస్తుంది . రక్త హీనత ను తొలగిస్తుంది . నోటికి రుచిని పుట్టిస్తుంది . దీనిలోని జిగురు పేగులకు మంచిది . పేగుల్లో వాపుని , నోటి పూతను తగ్గిస్తుంది . సంవత్సరానికి ఒక్క సారైనా తినాల్సిన ఆహారం ఇది.

వెలగ పండు తో పచ్చడి చేసుకోవచ్చును. వెలగ పండు గుజ్జు, బెల్లం , చింత పండు , పచ్చి మిరప కాయలు, కొత్తి మీర, మినప్పప్పు , మెంతులు, ఆవాలు , జీలకర్ర , ఇంగువ , పసుపు , ఉప్పు , నువ్వుల నూనె , ఎండు మిరప కాయలు పచ్చడి కోసం కావాలి.