Sunday, 5 February 2017

Pop Corn

ఆహార పదార్థాల్లో ఔషధ విలువలున్న వాటినే ఎవరైనా ప్రత్యేకంగా చూస్తారు.  అయితే ఆ ప్రత్యేకతలు మనం అతి మామూలుగా తీసుకునే పదార్థాల్లోనే ఉంటాయని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలగక ఏమవుతుంది? చాలా మందిలో ఇప్పటిదాకా ముడిధాన్యాల్లో పీచు పదార్థం తప్ప పెద్దగా ఏమీ ఉండవనే అభిప్రాయమే ఉంటూ వచ్చింది. కానీ, స్కాన్రేటన్‌ యూనివర్సిటీ వారు చేసిన పరిశోధనల్లో ఈ ధాన్యాల్లో పాలీఫెనాల్స్‌ అనే  యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయనే సత్యం వెలుగు చూసింది. పండ్లల్లో, కూరగాయల్లో మాత్రమే ఉంటాయనుకుంటున్న ఈ యాంటీ ఆక్సిడెంట్లు ముడిధాన్యాల్లో ప్రత్యేకించి పాప్‌కార్న్‌లో ఉన్నట్టు రుజువయ్యింది, అమెరికన్‌ కెమికల్‌ సొసైటీకీ పరిశోధకులు అందచేసిన ఒక నివేదికలో అందచేశారు. శరీరానికి హాని కలిగించే ఫ్రీ-రాడికల్స్‌ బారిన పడకుండా కాపాడేవి యాంటీ-ఆక్సిడెంట్లే. అయితే అవి కేవలం పండ్లు, కూరగాయల్లో మాత్రమే ఉంటాయనుకునే వారు. కానీ, ముడిధాన్యాల్లో ప్రత్యేకించి మొక్కజొన్నల్లో చాలా ఎక్కువగా ఉంటాయని తేలింది. ఫైౖబర్‌ ఒక్కటే అని కాకుండా మిగతా ఎన్నో యాంటీ-ఆక్సిడెంట్లు సైతం ఈ ముడిదాన్యాల్లో ఉంటాయని, పోల్చిచూస్తే మిగతా వాటికన్నా పాప్‌కార్న్‌లో ఐదు రెట్లు ఎక్కువగా ఉంటాయని తేలడం పరిశోధకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. పాప్‌ కార్న్‌ అంటే కేవలం కాలక్షేపం కోసం తినే స్నాక్స్‌గానే వాటిని చూస్తూ ఉండిపోయాం. కానీ, శరీరాన్ని పలు రకాల వ్యాధులకు గురిచేసే  ఫ్రీ-రాడికల్స్‌ను అంతమొందించే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం ఎవరికైనా అమితానందం కలిగించే విషయమే.





పాప్‌కార్న్‌ని టైమ్‌పాస్‌ స్నాక్‌ అయినప్పటికీ దీనిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.ఆర్గానిక్‌ పాప్‌కార్న్‌ తింటే మరీ మంచిది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.. అవేమిటంటే...
  • జీర్ణక్రియలో సహాయపడతాయి. బరువుతగ్గడంలో ఉపయోగపడతాయి.
  • బ్లడ్‌ షుగర్‌, ఇన్సులిన్‌ పరిమాణాలను క్రమబద్ధీకరిస్తుంది.
  • ఎనర్జీ పెరుగుతుంది. డయటరీ ఫైబర్‌ కూడా ఇందులో ఉంది.
  • ఫ్యాట్‌ తక్కువ. విటమిన్‌ బి కాంప్లెక్స్‌, మాంగనీసు, మెగ్నీషియం, ఐరన్‌లు బాగా ఉన్నాయి.
  • ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది.
  • మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది.
  • ఇది పూర్తిగా హెల్దీ స్నాక్‌. గ్లూటెన్‌-ఫ్రీ. మనం తీసుకునే డైట్‌కు హానిచేయదు.
  • ఇవి తింటే ఆకలి తొందరగా వేయదు.
  • ఇన్ఫమ్లేషన్‌ తగ్గిస్తుంది.
  • మలబద్దకం నుంచి సాంత్వననిస్తుంది.
  • పాలకూరలో కన్నా పాప్‌కార్న్‌లో ఐరన్‌ ఎక్కువ.
  • గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
  • పీచుపదార్థాలు అధికంగా ఉండడం వల్ల పెద్దపేగు కాన్సర్‌ని నిరోధిస్తుంది.
  • రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • బి3, బి6, ఫోల్లేట్‌, పాంథోథెనిక్‌ యాసిడ్లు ఇందులో ఉన్నాయి. ఇవి ఎనర్జీనివ్వడంతో పాటు వివిధరకాల పోషకాలను శరీరంలో క్రమబద్ధీకరిస్తాయి.
.


జలుబు చేసినట్లు అనిపించగానే ఏ ట్యాబ్లెట్‌ కోసమో మందులషాపుకు పరుగులు తీయకుండా పాప్‌కార్న్‌ తిని చూడమంటున్నారు పెన్సిల్వేనియా పరిశోధకులు. పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ పాళ్లు ఎక్కువగా ఉంటాయనీ, అవి జలుబును తగ్గిస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా పాప్‌కార్న్‌లో లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్స్‌ మోతాదులు కొన్ని పండ్ల నుంచి లభ్యమయ్యే వాటి కంటే కూడా చాలా ఎక్కువని వారు చెబుతున్నారు. పాప్‌కార్న్‌ తినే సమయంలో అందులో ఉప్పు వేసుకోకపోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు



No comments:

Post a Comment