Monday, 20 February 2017

Honey

తేనె ఆరోగ్యానికి మంచిది. దానిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అయితే తేనెలో కూడా అనేక రకాలు ఉన్నాయి. వాటి రుచి, వాసన , రంగు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఒక్కోరకం తేనెలో ఒక్కోరకమైన ఔషధ గుణాలున్నాయి. అంతేకాదు ఇప్పడు తేనెటీగల పెంపకాన్ని అనేక మంది ఒక వృత్తిగా ఎంచుకుంటున్నారు.

రేగి తేనె 
రేగి చెట్ల నుంచి తేనెటీగలు మకరందాన్ని సేకరించడం ద్వారా తయారయ్యే తేనెను రేగి తేనె అంటారు. దీనిని శక్తి కోసం, జీర్ణ వ్యవస్థ సక్రమం గా పనిచేయడం కోసం ఉపయోగిస్తున్నారు.
 
యూకలిప్టస్‌ తేనె 
యూకలిఫ్టస్‌ చెట్లలో తేనెతుట్టెలు ఉండేలా చేస్తారు. ఆ చెట్ల నుంచి సేకరించిన మకరందంతో తయారయ్యేదే యూకలిఫ్టస్‌ తేనె. అస్తమా, గుండె సంబంధిత వ్యాధులు, జలుబు వాళ్లు దీనిని తీసుకుంటారు.
 
వాము తేనె 
వాము పండించే ప్రాంతాలలో తేనెటీగలు ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయి. వామ తేనెను అల్సర్సు, గ్యాస్‌ ట్రబుల్‌ ఉన్నవాళ్లు తీసుకుంటే మంచిది.
 
అడవి పూల తేనె 
అడవిలో సహజంగా లభించే పూల నుంచి తయార య్యేదే అడవి పూల తేనె. దీన్ని అందరూ వాడవచ్చు.
 
కొత్తిమీర తేనె 
పెద్దఎత్తున కొత్తిమీర పండించే ప్రాంతాలలో తేనెతుట్టెల బాక్సులు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ సేకరించే మకరందాన్ని కొత్తిమీర తేనె అంటున్నారు. ఇది జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడానికి ఉపయో గిస్తారు. థైరాయిడ్‌ సంబంధిత వ్యాధులున్న వాళ్లకూ చాలా మంచిది.
 
నేరేడు తేనె 
నేరెడు చెట్ల వద్ద ఏర్పాటు చేసిన తుట్టెల నుంచి సేకరించిన తేనెను ఈ పేరుతో పిలుస్తారు. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు దీనిని ఉపయోగి స్తారు. దీన్ని తగిన మోతాదులో తీసుకుంటే హుషారుగా ఉంటారు.
 
లిచీ తేనె 

లిచీ పండ్ల తోటలు ఉన్న ప్రాంతాల్లో దీనిని ఉత్పత్తి చేస్తారు. దీనిని అందరూ వాడుకోవచ్చు.

No comments:

Post a Comment