చింతపండు పులుపు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని కొందరి అభిప్రాయం. ఇది తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చింతపండును ఆహారంలో తీసుకోవడం వలన పలు ఆరోగ్య సమస్యలు తప్పించుకోవచ్చని వారు చెబుతున్నారు. చింతపండులో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీని ద్వారా లభించే గుజ్జులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. శరీర ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో ఇది సమర్థవంతంగా పోరాడుతుందని చెబుతున్నారు. చింతపండులోని పోషకాలు శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలస్ట్రాల్ పెరగడానికి దోహదం చేస్తాయని వారు అంటున్నారు. ఇవే కాకుండా దీనిలో లభించే పొటాషియం, మినరల్స్ విటమిన్లు ఆరోగ్యాన్ని కాపాడతాయని వారు స్పష్టం చేస్తున్నారు.
చింతపండు, ఆకు రెండూ ఆరోగ్యకరమే! వీటిలోని పోషకాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హెపటైటిస్ ఎ, బి, సిల నుంచి రక్షణ కల్పించడంతోపాటు, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్‌లకు గురి కాకుండా కాలేయాన్ని కాపాడతాయి.
కాలేయం దాదాపు 500 జీవక్రియలను నిర్వహిస్తుంది. తనను తాను పునర్నిర్మించుకునే సామర్ధ్యం కలిగిన ఏకైక అవయవం కాలేయం! అయితే అస్తవ్యస్త జీవనశైలి, ఆహారపుటలవాట్లు, వివిధ చికిత్సల్లో భాగంగా వాడే మందుల ప్రభావంతో కాలేయంలో క్రమంగా విషాలు పేరుకుంటూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు విసర్జించేలా చేయాలంటే, ఓ చిట్కా పాటించాలి. గుప్పెడు లేత చింత ఆకులను శుభ్రంగా కడిగి, ఒక లీటరు నీళ్లలో కలిపి 15 నిమిషాలపాటు మరిగించాలి. దీన్లో రుచికి తేనె లేదా చక్కెర కలుపుకోవచ్చు. ఈ కషాయాన్ని ఉదయం, సాయంత్రం చెరొక కప్పు తాగితే కాలేయం ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.
No comments:
Post a Comment